
సాక్షి,హైదరాబాద్ : రేపు (ఏప్రిల్ 28న) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు.
తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.
ఇక ఏప్రిల్ 30న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన విద్యార్ధులకు ఎస్‌ఎస్‌ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాలను అధికారులు రేపు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్‌సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment