supplementary results
-
రేపే టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : రేపు (ఏప్రిల్ 28న) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు.తెలంగాణలో మార్చి 18న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో ముగిశాయి. ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు.ఇక ఏప్రిల్ 30న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన విద్యార్ధులకు ఎస్ఎస్ఈ బోర్డు జూన్ 03 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షా ఫలితాలను అధికారులు రేపు విడుదల చేయనున్నారు. ఫలితాలను వెబ్సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. -
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది.విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3 వరకూ జరిగాయి. సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలకు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ (జనరల్) ఫలితాల కోసం క్లిక్ చేయండిఇంటర్ ఫస్ల్ ఇయర్ సప్లమెంటరీ(వొకేషనల్) ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 49%
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో 49.57 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మే నెలలో జరిగిన రెగ్యులర్‌తో కలుపుకుంటే ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత 80.80 శాతంగా నమోదైంది. ఆగస్టు 1వ తేదీ నుంచి జరిగిన అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అడ్వాన్స్డ్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా జనరల్‌కు 1,02,236 మంది, ఒకేషనల్‌కు 12,053 మంది హాజరయ్యారని, వీరిలో జనరల్ 48,816(47.74 శాతం) మంది, ఒకేషనల్ 7,843 (65.07 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అధికారిక వెబ్సైట్లో మార్కుల జాబితాలను అందుబాటులో ఉంచామన్నారు. రెగ్యులర్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కలిపి జనరల్ ఇంటర్లో 3,92,258 మంది పరీక్ష రాస్తే, 3,18,247 మంది (81.13 శాతం), ఒకేషనల్‌లో 44,112 మంది రాస్తే 34,361 (77.89 శాతం) ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌లో 67 శాతం ఉత్తీర్ణత ఫస్టియర్‌లో అడ్వాన్స్ సప్లిమెంటరీలో జనరల్ 1,49,285 మంది, ఒకేషనల్ 10,858 మంది ఉత్తీర్ణులైనట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు. 1,00,513 మంది జనరల్‌లో, 2,146 మంది ఒకేషనల్‌లో ఇంప్రూవ్మెంట్ రాసినట్టు బోర్డ్ పేర్కొంది. పరీక్ష రాసినవారిలో 80028 మందికి ఏ గ్రేడ్ వచ్చినట్టు స్పష్టం చేసింది. అడ్వాన్స్డ్ రాసినవారిలో జనరల్ ఉత్తీర్ణత శాతం 67.72 శాతం, ఒకేషనల్‌లో 57.28 శాతం నమోదైనట్టు తెలిపింది. ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షలకు జనరల్‌లో 4,14,380 మంది విద్యార్థులు హాజరైతే, వీరిలో 2,68,763 (64.85 శాతం) పాసయినట్టు తెలిపారు. -
Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు. విద్యార్థులు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్ రెగ్యులర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ ఫలితాలను ముందుగానే ప్రకటించారు. ఈ ఫలితాల్లో 48,816 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 65.07గా నమోదైంది. అయితే, సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు ఇవాళ సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు పేర్కొంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజరవుతారు. అయితే ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంటర్ ఫెయిల్ అయి, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫలితాలు విడుదల చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్స్ ఇవే జనరల్ గ్రూపుల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఒకేషనల్ గ్రూపుల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు..? ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఉన్నత విద్యామండలి ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్ 6న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కారణంగా సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం సమావేశమైన అధికారిక నిర్ణయం తీసుకునే వీలుంది. -
తప్పుల తడకగా డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
గుత్తి : గత గురువారం ఎస్కేయూ విడుదల చేసిన డిగ్రీ సంప్లిమెంటరీ ప్రథమ,ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయి. బాగా రాసిన విద్యార్థులకు కూడా 0,1,2,3 చొప్పున మార్కులు వేశారు. అంతేకాకుండా నూరు మార్కులకు ఉండాల్సిన సబ్జెక్ట్‌కు 70 మార్కులు, 70 మార్కులకు ఉండాల్సిన సబ్జెక్ట్‌కు వంద మార్కులు చూపించారు. సబ్జెక్ట్ పేర్లు కూడా తప్పుగా వచ్చాయి. దీంతో విద్యార్థు«లు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజీ విద్యార్థులు మార్కుల జాబితా తప్పుల తడకపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఫస్టియర్, సెకెండియర్ విద్యార్థులు ఎస్.సాయి యశ్వంత్, రోషన్, మల్లికార్జున, నవీన్, నరేష్, జిలాన్, మధుమతి, రేణుక తదితరులు మాట్లాడుతూ బాగా రాసిన సబ్జెక్టుల్లో కూడా 0, 1, 2 ,3 మార్కుల చొప్పున వేయడం దారుణమన్నారు. సెకెండియర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్‌కు మాగ్జిమమ్ 70 మార్కులయితే మార్కుల జాబితాలో 100 మార్కులుగా చూపించారన్నారు. అదే విధంగా అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో మాగ్జిమమ్ మార్కులు 100 ఉండాలని, 70 మార్కులుగా చూపించారన్నారు. అదే విధంగా ప్రోగ్రామింగ్ ఇన్ కంప్యూటర్ సబ్జెక్టుకు మాగ్జిమమ్ మార్కులు 70 ఉండాల్సి ఉండగా 100 మార్కులుగా చూపించారన్నారు. ఇలా ప్రతి పాయింట్ తప్పుగా మార్కుల జాబితా రూపొందించారన్నారు. ఽఅదేవిధంగా ఇంప్రూవ్ మెంట్ రాసిన విద్యార్థులకు కూడా వంద మార్కులకు గాను 0, 1, 2, 12,13, 14 మార్కుల చొప్పున వేశారన్నారు. ఈ విషయంపై శ్రీసాయి డిగ్రీకాలేజీ ప్రిన్సిపల్ శివారెడ్డి మాట్లాడుతూ ఎస్కేయూ విడుదల చేసిన డిగ్రీ ఫస్టియర్, సెకెకండియర్ ఫరీక్షా ఫలితాలు పూర్తి తప్పుల తడకగా ఉన్నాయన్నారు. -
దూరవిద్య ఫలితాలు విడుదల
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) అక్టోబర్‌లో నిర్వహించిన 10వ తరగతి, ఇంటర్మీడియెట్ దూరవిద్య సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఏపీఓఎస్ఎస్ డెరైక్టర్ పి.పార్వతి మంగళవారం విడుదల చేశారు. అక్టోబర్ 13 నుంచి 27వ తేదీ వరకూ జరిగిన ఎస్సెస్సీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 8,497మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 4,190 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఎస్సెస్సీలో 49.31 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వివరించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరైన 11,779 మందిలో 6,816 మంది ఉత్తీర్ణులయ్యారని, 57.87 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. మార్కుల మెమోలను సంబంధిత ఏపీఓఎస్ఎస్ స్టడీ సెంటర్లకు 10 రోజుల్లో పంపుతామని తెలిపారు. జవాబు పత్రాల రీకౌంటింగ్‌కు ఎస్సెస్సీలో ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ రూ.200, రీవెరిఫికేషన్‌తోపాటు ఫొటోస్టాట్ జవాబు పత్రాన్ని పొందేందుకు ఎస్సెస్సీలో సబ్జెక్టుకు రూ.వెయ్యి, ఇంటర్‌కు రూ. 600 వంతున ఫీజును ఏపీ ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లో ఈ నెల 30వ తేదీ లోపు చెల్లించి దరఖాస్తు చేయాలని సూచించారు. ఫలితాల కోసం www.apopenschool.org, www.schools-9.com, www.manabadi.com వెబ్సైట్లలో చూడొచ్చని తెలిపారు. -
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటర్మీడియెట్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 2,55,234 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియెట్ విద్యా కమిషనరేట్ కార్యాలయంలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
ఏపీసెట్ సప్లిమెంటరీ ఫలితాలు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: ఏపీసెట్-2013 సప్లిమెంటరీ ఫలితాల విడుదల లేనట్టేనని తేలిపోయింది. గత ఏడాది నవంబరు 24న జరిగిన ఏపీసెట్ ఫలితాలను ఫిబ్రవరి 8న విడుదల చేసిన విషయం తెలిసిందే. యూజీసీ నిబంధనల ప్రకారం ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో 15 శాతం మందినే ఏపీసెట్‌లో అర్హులుగా ప్రకటించారు. దీంతో ఈ పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నా.. 15 శాతం నిబంధన కారణంగా అర్హత పొందలేక అభ్యర్థులు ఆందోళనలో మునిగిపోయారు. దీనిపై విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు ఏపీ సెట్ చైర్మన్, ఉస్మానియా వీసీ సత్యనారాయణ మరో ఐదు శాతం ఫలితాల పెంపునకు అనుమతి కోసం యూజీసీకి లేఖ రాశారు. ఈ లేఖ రాసి మూడు నెలలైనా యూ జీసీ నుంచి సమాధానం రాలేదు. దీంతో సప్లిమెంటరీ ఫలితాలకు అవకాశం లేదని ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.