దూరవిద్య ఫలితాలు విడుదల | Distance Education Supplementary results released | Sakshi
Sakshi News home page

దూరవిద్య ఫలితాలు విడుదల

Published Tue, Nov 24 2015 6:50 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Distance Education Supplementary results released

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్‌ఎస్) అక్టోబర్‌లో నిర్వహించిన 10వ తరగతి, ఇంటర్మీడియెట్ దూరవిద్య సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఏపీఓఎస్‌ఎస్ డెరైక్టర్ పి.పార్వతి మంగళవారం విడుదల చేశారు. అక్టోబర్ 13 నుంచి 27వ తేదీ వరకూ జరిగిన ఎస్సెస్సీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 8,497మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 4,190 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఎస్సెస్సీలో 49.31 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వివరించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరైన 11,779 మందిలో 6,816 మంది ఉత్తీర్ణులయ్యారని, 57.87 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.

మార్కుల మెమోలను సంబంధిత ఏపీఓఎస్‌ఎస్ స్టడీ సెంటర్లకు 10 రోజుల్లో పంపుతామని తెలిపారు. జవాబు పత్రాల రీకౌంటింగ్‌కు ఎస్సెస్సీలో ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ రూ.200, రీవెరిఫికేషన్‌తోపాటు ఫొటోస్టాట్ జవాబు పత్రాన్ని పొందేందుకు ఎస్సెస్సీలో సబ్జెక్టుకు రూ.వెయ్యి, ఇంటర్‌కు రూ. 600 వంతున ఫీజును ఏపీ ఆన్‌లైన్, మీసేవ కేంద్రాల్లో ఈ నెల 30వ తేదీ లోపు చెల్లించి దరఖాస్తు చేయాలని సూచించారు. ఫలితాల కోసం www.apopenschool.org, www.schools-9.com, www.manabadi.com వెబ్‌సైట్‌లలో చూడొచ్చని తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement