తప్పుల తడకగా డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
గుత్తి : గత గురువారం ఎస్కేయూ విడుదల చేసిన డిగ్రీ సంప్లిమెంటరీ ప్రథమ,ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయి. బాగా రాసిన విద్యార్థులకు కూడా 0,1,2,3 చొప్పున మార్కులు వేశారు. అంతేకాకుండా నూరు మార్కులకు ఉండాల్సిన సబ్జెక్ట్‌కు 70 మార్కులు, 70 మార్కులకు ఉండాల్సిన సబ్జెక్ట్‌కు వంద మార్కులు చూపించారు. సబ్జెక్ట్ పేర్లు కూడా తప్పుగా వచ్చాయి. దీంతో విద్యార్థు«లు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజీ విద్యార్థులు మార్కుల జాబితా తప్పుల తడకపై ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా ఫస్టియర్, సెకెండియర్ విద్యార్థులు ఎస్.సాయి యశ్వంత్, రోషన్, మల్లికార్జున, నవీన్, నరేష్, జిలాన్, మధుమతి, రేణుక తదితరులు మాట్లాడుతూ బాగా రాసిన సబ్జెక్టుల్లో కూడా 0, 1, 2 ,3 మార్కుల చొప్పున వేయడం దారుణమన్నారు. సెకెండియర్‌లో బిజినెస్ స్టాటిస్టిక్స్‌కు మాగ్జిమమ్ 70 మార్కులయితే మార్కుల జాబితాలో 100 మార్కులుగా చూపించారన్నారు. అదే విధంగా అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్‌లో మాగ్జిమమ్ మార్కులు 100 ఉండాలని, 70 మార్కులుగా చూపించారన్నారు. అదే విధంగా ప్రోగ్రామింగ్ ఇన్ కంప్యూటర్ సబ్జెక్టుకు మాగ్జిమమ్ మార్కులు 70 ఉండాల్సి ఉండగా 100 మార్కులుగా చూపించారన్నారు. ఇలా ప్రతి పాయింట్ తప్పుగా మార్కుల జాబితా రూపొందించారన్నారు. ఽఅదేవిధంగా ఇంప్రూవ్ మెంట్ రాసిన విద్యార్థులకు కూడా వంద మార్కులకు గాను 0, 1, 2, 12,13, 14 మార్కుల చొప్పున వేశారన్నారు.
ఈ విషయంపై శ్రీసాయి డిగ్రీకాలేజీ ప్రిన్సిపల్ శివారెడ్డి మాట్లాడుతూ ఎస్కేయూ విడుదల చేసిన డిగ్రీ ఫస్టియర్, సెకెకండియర్ ఫరీక్షా ఫలితాలు పూర్తి తప్పుల తడకగా ఉన్నాయన్నారు.