
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ జోన్-4 కార్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన గ్రామ వాలంటీర్ల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఎంపికయిన అభ్యర్థుల జాబితాను ఉదయం జోనల్ కార్యాలయ ఆవరణలో నోటీస్‌బోర్డులో పెట్టారు. జోన్-4 పరిధిలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు మొత్తం 5,330 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని విశాఖపట్నం జీవీఎంసీ జోన్-4 కమిషనర్ సింహాచలం వెల్లడించారు. 3,700 మంది మౌఖిక పరీక్షకు హాజరు కాగా 1,623 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. 2,181 మంది గ్రామ వాలంటీర్లుగా ఎంపికయినట్లు తెలిపారు. ఫలితాల కోసం కార్యాలయానికి పెద్దసంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment