దేశంలోని ఏడు రాష్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జూలై 10న ఎన్నికలు జరగగా, నేడు(శనివారం) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా ఉపఎన్నికకు సంబంధించిన ఫలితం వెలువడింది.
ఇక్కడి నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య, కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ స్థానానికి సంబంధించిన 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో డెహ్రా స్థానం ఫలితం మొదట వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment