పోలింగ్‌ మధ్యలోనే వెలువడిన ఫలితాలు? | Nawaz Sharifs PML to Emerge as Single Largest Party May Win | Sakshi
Sakshi News home page

pakistan general election 2024: పోలింగ్‌ మధ్యలోనే ఫలితాలు వెల్లడి? ఎవరికి ఎన్ని సీట్లు?

Published Thu, Feb 8 2024 11:22 AM | Last Updated on Thu, Feb 8 2024 11:48 AM

Nawaz Sharifs PML to Emerge as Single Largest Party May Win - Sakshi

పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. అయితే ఇంతలోనే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని,  పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండవ స్థానంలో ఉంటుందని, ఆ తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్‌ ఉంటుందని ఒక నివేదిక వెల్లడించింది. 

పోలీసు వర్గాలు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, కార్మిక సంఘాలు, వివిధ రంగాలకు చెందిన నిపుణుల ఇంటర్వ్యూల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా పాక్‌ ఎన్నికల ఫలితాలపై ఒక నివేదిక బయటకు వచ్చింది. ఈ రిపోర్టులోని వివరాలను ఒక పాక్‌ అధికారి మీడియా ముందు వెల్లడించారు.

ఈ నివేదిక ప్రకారం నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎస్‌- ఎన్‌ 115 నుండి 132 జాతీయ అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఫలితంగా నవాజ్ షరీఫ్ నూతనప్రభుత్వాన్ని సాధారణ మెజారిటీతోనే ఒంటరిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పంజాబ్ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ పార్టీకి పూర్తి మెజారిటీ లభిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. 

అదే సమయంలో నవాజ్ షరీఫ్ పార్టీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా అవతరించనుంది. అయితే సింధ్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. అసెస్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం ఈ ఎన్నికల్లో పీపీపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని, పీటీఐ స్వతంత్ర అభ్యర్థులకు 23 నుంచి 29 సీట్లు రావచ్చనే అంచనాలున్నాయి. అలాగే ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌కు 12-14 సీట్లు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లామ్‌కు 6-8 సీట్లు, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్వైద్), ఇస్తేకామ్-ఏ-పాకిస్థాన్ పార్టీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement