Mejarti
-
పోలింగ్ మధ్యలోనే వెలువడిన ఫలితాలు?
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. అయితే ఇంతలోనే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండవ స్థానంలో ఉంటుందని, ఆ తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ ఉంటుందని ఒక నివేదిక వెల్లడించింది. పోలీసు వర్గాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కార్మిక సంఘాలు, వివిధ రంగాలకు చెందిన నిపుణుల ఇంటర్వ్యూల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా పాక్ ఎన్నికల ఫలితాలపై ఒక నివేదిక బయటకు వచ్చింది. ఈ రిపోర్టులోని వివరాలను ఒక పాక్ అధికారి మీడియా ముందు వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎస్- ఎన్ 115 నుండి 132 జాతీయ అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఫలితంగా నవాజ్ షరీఫ్ నూతనప్రభుత్వాన్ని సాధారణ మెజారిటీతోనే ఒంటరిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పంజాబ్ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ పార్టీకి పూర్తి మెజారిటీ లభిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నవాజ్ షరీఫ్ పార్టీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా అవతరించనుంది. అయితే సింధ్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. అసెస్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఈ ఎన్నికల్లో పీపీపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని, పీటీఐ స్వతంత్ర అభ్యర్థులకు 23 నుంచి 29 సీట్లు రావచ్చనే అంచనాలున్నాయి. అలాగే ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌కు 12-14 సీట్లు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లామ్‌కు 6-8 సీట్లు, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్వైద్), ఇస్తేకామ్-ఏ-పాకిస్థాన్ పార్టీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. -
Five States Assembly Elections 2023: 12 రాష్ట్రాల్లో అధికార పీఠంపై కమలం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రశంసనీయమైన ఫలితాలు సాధించింది. మూడు కీలక రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగా, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సులువుగా నెగ్గింది. దీంతో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టినట్లయ్యింది. ఉత్తరాఖండ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలున్నాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలు కొలువుదీరడం లాంఛనమే. అలాగే మహారాష్ట్ర, మేఘాలయా, నాగాలాడ్, సిక్కిం ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటోంది. దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను కోల్పోయింది. తెలంగాణలో విజయం సాధించింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇప్పటికే సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణ సైతం ఆ పార్టీ ఖాతాలోకి చేరింది. అంటే మొత్తం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి ఉన్నట్లు లెక్క. బిహార్, జార్ఖండ్ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. మరో జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ఢిల్లీ, పంజాబ్‌లో పూర్తి మెజారీ్టతో అధికారంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి రెండు రాష్ట్రాలు చేజారిపోవడంతో ఇక ఉత్తర భారతదేశంలో ‘ఆప్’ అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించిందని ఆ పార్టీ నేత జాస్మిన్ షా తెలిపారు. 2024లో లోక్‌సభ సాధారణ ఎన్నికలతోపాటు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. -
కమల్‌నాథ్‌కు బీజేపీ చెక్?
భోపాల్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం పూర్తిస్థాయి మెజారిటీ లేదనీ, అసెంబ్లీలో బలపరీక్ష కోసం తాము గవర్నర్‌ను కలుస్తామని ప్రకటించింది. ఈ విషయమై మధ్యప్రదేశ్ విపక్ష నేత గోపాల్ భార్గవ మాట్లాడుతూ..‘రుణమాఫీ, శాంతిభద్రతలు, తాగునీటి సమస్య వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించడంతో పాటు ప్రభుత్వ మెజారిటీ విషయంలో బలపరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మేం గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు ఇప్పటికే లేఖ రాశాం. ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా ముఖం చాటేస్తున్న కమల్‌నాథ్ ప్రభుత్వం గుట్టలకొద్దీ కాగితాలను మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇంటికి పంపుతోంది. రాష్ట్రంలోని 21 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసేశామని చెబుతోంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ బలహీన కాంగ్రెస్ ప్రభుత్వానికి సభలో మెజారిటీ ఉందా? లేదా? అని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయంలో మేం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా, స్థిరంగా కొనసాగడంపై ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి’ అని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మరోసారి కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డ మరుసటి రోజే మధ్యప్రదేశ్‌లో కమలనాథులు బలపరీక్ష కోరడం గమనార్హం. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు అవసరమైన నేపథ్యంలో బీఎస్పీ(2), ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. బీజేపీ కుట్ర పన్నుతోంది: కాంగ్రెస్ అవినీతి పద్ధతుల ద్వారా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దీపక్ బబరియా ఆరోపించారు. మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. విశ్వాస పరీక్షకు సిద్ధం: కమల్‌నాథ్ విశ్వాసపరీక్షను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమల్‌నాథ్ చెప్పారు. గడిచిన ఐదు నెలల్లో నాలుగు సార్లు తమ సంకీర్ణ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నామనీ, అవసరమైతే మరోసారి కూడా సిద్ధమేనని పేర్కొన్నారు. -
భం భం బోలే మెజార్టీ మోగాలే!
ఇప్పుడు అందరి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసి మీదే. ప్రధాని గెలుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆయనకు ఎంత మెజార్టీ వస్తుందన్నదే చర్చనీయాంశం. 2014 ఎన్నికల్లో మోదీ పోటీ చేసిన ఈ స్థానంలో ప్రత్యర్థిగా అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మోదీని ఓడిస్తానని శపథం చేసి మరీ వారణాసి నుంచి బరిలోకి దిగారు. మోదీ హవా ముందు కేజ్రీవాల్ క్రేజ్ వెలవెలబోయింది. 3 లక్షల 71 వేల 785 ఓట్ల మెజార్టీతో మోదీ విజయదుందుభి మోగించారు. ఈసారి కేజ్రీవాల్ వంటి బలమైన అభ్యర్థులు బరిలో లేరు. ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థి శాలిని యాదవ్ రెండేళ్ల క్రితమే వారణాసి మేయర్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి ఆమె మూడో స్థానానికే పరిమితమవుతారని అంచనాలున్నాయి. ఇక కాంగ్రెస్ తరఫు నుంచి అజయ్‌రాయ్ గత ఎన్నికల్లో పోటీకి దిగి కనీసం డిపాజిట్ కూడా సాధించలేకపోయారు. అందుకే బీజేపీ ఈ సారి గత ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పక్కాగా అడుగులు వేస్తోంది. నామినేషన్ నుంచే బలప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నాదే అన్నట్టుగా నామినేషన్ నుంచే బలప్రదర్శనకు దిగారు. నిత్యం శివనామ స్మరణతో మారుమోగే వారణాసిలో హర హర మోదీ నినాదాలు హోరెత్తేలా ఓపెన్ టాప్ వాహనంలో రోడ్ షో నిర్వహించి తన సత్తా చాటారు. ఆ తర్వాత జరిగిన గంగా హారతి, పడవ విహారం నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాగాయి . మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బెంగాల్లో పట్టు బిగించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే వారణాసిపైన కూడా అంతే దృష్టి పెట్టారు. మోదీ కూడా ప్రతీ రోజూ ఏదో ఒక సమయంలో వారణాసికి వస్తూ పొలిటికల్ మూడ్ గమనిస్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, సిద్ధార్థనాథ్ సింగ్, శ్రీకాంత్ శర్మ, సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, వీకే సింగ్ వారణాసిలో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ సాధించాలన్న పట్టుదలతో పని చేశారు. గత అయిదేళ్లలో వారణాసిలో జరిగిన అభివృద్ధినే ప్రస్తావించారు. వారణాసిని జపాన్‌లో ఆధ్యాత్మిక నగరం క్యోటోగా మారుస్తానని గత ఎన్నికల్లో మోదీ తాను ఇచ్చిన హామీని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయినా ఆ దిశగా పునాదులైతే పడ్డాయి. విద్యుత్ సౌకర్యం, రోడ్ల విస్తరణ, విశ్వనాథుడి ఆలయం నుంచి గంగా ఘాట్ వరకు కారిడార్, ఇంటింటికీ పైపు లైన్ల ద్వారా గ్యాస్ సౌకర్యం వంటి ప్రాజెక్టుల్లో పురోగతి కళ్లకు కనిపిస్తూనే ఉంది. ‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అన్ని వర్గాలకు ఇళ్లు కట్టి ఇచ్చాం. ఆయుష్, టాయిలెట్ స్కీమ్‌లు ముస్లింలకు కూడా ప్రయోజనకరంగానే ఉన్నాయి’’ అని కొందరు ముస్లింలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ప్రియాంకని కాకుండా ఎప్పుడైతే వేరే అభ్యర్థిని రంగంలోకి దింపిందో అప్పుడే చేతులెత్తేసిందని, మోదీకి తిరుగులేని మెజార్టీ ఖాయమన్న అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది. ‘‘మేము ఎన్నుకుంటున్నది ఒక ఎంపీని కాదు. ప్రధానమంత్రిని’’ –శిశిర్ వాజ్‌పేయి, బీజేపీ కార్యకర్త (ఇది కేవలం ఒక కార్యకర్త అభిప్రాయం మాత్రమే కాదు వారణాసి గుండె చప్పుడు కూడా ఇదే) -
సిద్దిపేట: ఆమే శక్తి
శాసనసభ ఎన్నికల్లో గెలుపోటములను మహిళలు ప్రభావితం చేయబోతున్నారా..? రాజకీయ నేతల భవితవ్యంపై తీర్పునివ్వబోతున్నారా..? మహిళ నిర్ణయమే శిరోధ్యారమవుతుందా.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. జిల్లాలో మహిళల నిర్ణయమే రాజకీయ పార్టీల భవిష్యత్తును శాసించబోతోంది. మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఓటింగ్‌లో పాల్గొనడం అభ్యర్థుల తల రాతలను మార్చబోతోంది. జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో గజ్వేల్ మినహా మిగతా చోట్ల మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పోలింగ్ జరిగిన తీరు పరిశీలిస్తే మహిళలదే పైచేయిగా ఉంది. గజ్వేల్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 222436 ఓటర్లు ఉండగా... ఇందులో మహిళలు 111692, పురుషులు 110737 మంది ఉన్నారు. ఎన్నికల్లో 185976 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 93587 మంది ఓటు హక్కును వినియోగించుకోగా పురుషులు 92100 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ లెక్కన 1487 మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్లు వేశారు. నియోజకవర్గంలో స్థానిక అంశాలు ఓటింగ్‌ను ప్రభావితం చేశాయని తెలుస్తోంది. నియోజకవర్గంలోని మిషన్ భగీరథ పథకం పనులు కొన్ని గ్రామాల్లో పూర్తయి, మరికొన్ని గ్రామాల్లో ప్రగతిపథంలో ఉండడం, హుస్నాబాద్ పట్టణంలో 560 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం సాగుతుండడం తమకు అనుకూలంగా ఉంటుం దని... ఈ అంశాన్ని మహిళలు సానుకూలంగా తీసుకొని తమ వైపే మొగ్గు చూపారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫ ల్యాలు, అసంపూర్తి పనులు మహిళలను తమ వైపు మళ్లించాయని ప్రజాకూటమి అంచనా వే స్తోంది. దుబ్బాక నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ మొత్తంగా 190483 ఓట్లు ఉండగా... ఇందులో మహిళలు 96780, పురుషులు 93703 మంది ఉన్నారు. ఎన్నికల్లో మొత్తంగా 163798 ఓట్లు పోలవగా... ఇందులో మహిళలు 83176, పురుషులు 80482 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో 26 94మంది మహిళలు పురుషులతో పోలిస్తే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ అంశం తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. నియోజకవర్గంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఆసరా పింఛన్‌దారులు తమ వైపే మొగ్గు చూపారని అంచనా వేస్తోంది. మరోవైపు మిషన్ భగీరథ పథకం కూడా తమకు కలిసివచ్చిందనే ఆశలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నియోజకవర్గంలో స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందనే ఆశలో ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితి మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇక్కడ మహిళలు ఏకపక్షంగా తీర్పునిస్తారనే అంచనాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 209339 ఓట్లలో మహిళలు 105279 మంది ఉన్నారు. ఎన్నికల్లో 165368 ఓట్లు పోలవగా... ఇందులో మహిళలు 83575 మంది ఉన్నారు. వీరిలో 95శాతానికి పైగా తమవైపే మొగ్గు చూపారని టీఆర్ఎస్ భావిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, మర్కూక్, మనో హరాబాద్, తూప్రాన్ మండలాల్లో మొత్తంగా 233207 ఓట్లు ఉండగా... మహిళలు 116202, పురుషులు 116982, ఇతరులు 23మంది ఉన్నా రు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన గా... ఈ రెండు పార్టీలు కూడా తమ మేనిఫెస్టోతో మహిళల ముందుకు వెళ్లాయి. టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. నియోజకవర్గంలో రూ. 450కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని చే పట్టి 248 ఆవాసాలకు స్వచ్ఛమైన నల్లా నీటిని అందించామని పార్టీ శ్రేణులు ప్రచారంలో వివరించే ప్రయత్నం చేశాయి. గతంలో ఇక్కడ మం చినీళ్లు దొరకక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్న కష్టాలను గుర్తు చేస్తూ కేసీఆర్‌కు ఓటు వేయాలని అభ్యర్థించాయి. అంతేగాకుండా మహిళా సంఘాలకు రుణాలు, ఇతర పథకాలను ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ సైతం మేనిఫెస్టోలో పొందు పర్చిన ఓ కుటుంబానికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచి తంగా పంపిణీ చేస్తామనే అంశాన్ని బలంగా మహిళల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. ఏటా 6 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తే మహిళల కష్టాలు తీరుతాయని వివరించాయి. అదే విధంగా మహిళా సంఘాలకు రుణాల పెంపు అంశాన్ని ప్రచారం చేశాయి. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు, సభలకు మహిళలను పెద్ద ఎత్తు న తరలించడంపైనే పార్టీలు దృష్టి పెట్టాయి. రెండు పార్టీలు మహిళలు తమవైపే ఉంటారని వి శ్లేషిస్తున్నాయి. ఎన్నికల్లో మొత్తంగా 206699 ఓటర్లు పాల్గొనగా... అందులో మహిళలు 1022309 మంది, పురుషులు 104457 మంది, ఇతరులు ముగ్గురున్నారు. రెండు పార్టీలు మహిళలు తమ వైపే మొగ్గు చూపారనే అంచనాల్లో నిమగ్నమయ్యాయి. మొత్తానికి సిద్దిపేట ఎన్నికల చిత్రం మహిళల పాత్రపైనే ఆధారపడి ఉండటం విశేషం. -
సంఖ్య తగ్గినా బీజేపీదే మెజారిటీ
న్యూఢిల్లీ: ఇటీవల వరుసగా ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి లోక్‌సభలో బీజేపీకి వచ్చిన సమస్యేమీ లేదు. తాజా ఉప ఎన్నికల ఫలితాల అనంతరం.. లోక్‌సభలో బీజేపీ బలం 272 (స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను కలుపుకుని) గా ఉంది. మొత్తం 543 స్థానాల్లో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ముగ్గురు కర్ణాటక సభ్యులు ఇటీవల రాజీనామా చేయగా.. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ సీటు కూడా ఏడాదిగా ఖాళీగా ఉంది. మొత్తం 539 సీట్లను పరిగణనలోకి తీసుకుంటే లోక్‌సభలో కావాల్సిన మెజారిటీ 271. ఇద్దరు నామినేటెడ్ సభ్యులను జతచేరిస్తే 541 సంఖ్యకు గానూ 272 మెజారిటీ అవసరం. వీరిద్దరిని కలుపుకుంటే బీజేపీకి 274 మంది సభ్యుల మద్దతుంది. ఎన్డీయే కూటమికి 315 మంది సభ్యుల బలముంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే బలం 336 గా ఉంది. అయితే పలు ఉప ఎన్నికలు, టీడీపీ తెగదెంపుల అనంతరం ఈ సంఖ్య 315కు చేరింది. -
రాజ్యసభలో బీజేపీ హవా!
న్యూఢిల్లీ: వచ్చే నెల 23న 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామని కమలనాథులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా రాజ్యసభలో ప్రతిపక్షాలు కీలక బిల్లుల్ని అడ్డుకోవడాన్ని నిలువరించవచ్చన్నారు. ప్రస్తుతం 58 సీట్లతో రాజ్యసభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ను వెనక్కునెట్టింది. యూపీలో భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఖాళీ అయ్యే 10 సీట్లలో 8 చోట్ల బీజేపీ గెలవనుంది. ప్రస్తుతం యూపీలో బీజేపీకి ఓ రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉన్నారు. అలాగే రాజస్తాన్‌లో ఖాళీకానున్న మూడు స్థానాలనూ కమలనాథులే దక్కించుకోనున్నారు. అయితే బిహార్‌లో ప్రస్తుతమున్న ఆరుస్థానాల్లో మూడు చోట్ల, గుజరాత్‌లోని నాలుగుస్థానాల్లో రెండుసీట్లను మాత్రమే బీజేపీ నిలుపుకునే అవకాశముంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు కేంద్రానికి అనుకూలంగా ఉన్న అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ, వైఎస్సార్సీపీల మద్దతును కలుపుకుంటే 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ దక్కే అవకాశముందని ఓ బీజేపీ సీనియర్ నేత తెలిపారు. ఈ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులు ఖరారు కానప్పటికీ పలువురు జాతీయ ఆఫీస్ బేర్లరను పార్టీ ఎంపికచేసే అవకాశముందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులైన అనీల్ జైన్, అరుణ్ సింగ్, కైలాశ్ విజయవర్గియా, మురళీధర్‌రావు, రామ్‌మాధవ్, భూపేందర్ యాదవ్‌లు రాజ్యసభ అశావహుల జాబితాలో ఉన్నారన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రులు జైట్లీ, జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా, థావర్‌చంద్ గెహ్లాట్, రామ్‌దాస్ అథావలేల పదవీకాలం పూర్తికానుంది. వీరందరి పదవీకాలాన్ని కేంద్రం పొడిగించే అవకాశముందని పేర్కొన్నారు. -
గుజరాత్లో 16 స్థానాలు త్రుటిలో ‘చే’జారే!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు సాధించి మెజారిటీకి దూరంగా నిలిచిన కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే విషయమిది. ఆ పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులు 3 వేల కన్నా తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. అందులో ముగ్గురు వేయి కన్నా తక్కువ మెజారిటీతో గెలుపునకు దూరమయ్యారు. గోధ్రాలో బీజేపీ అభ్యర్థి సీకే రావుల్జీ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రసిన్హా పర్మార్‌పై కేవలం 258 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ధోల్కాలో 327 ఓట్లు, బోతాడ్‌లో 906 ఓట్లు, వీజాపూర్లో 1164 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓటమిపాలైంది. అలాగే హిమత్‌నగర్(1712), గారిధర్(1876), ఉమ్రెత్(1883), రాజ్‌కోట్ (గ్రామీణ–2,179), ఖాంబట్(2318), వాగ్రా(2370),మాతర్(2406), ప్రతీజ్(2551), ఫతేపురా(2711), వీస్‌నగర్(2869)లను కూడా స్వల్ప తేడాతో చేజార్చుకుంది. -
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిపోరు
కొప్పళ, న్యూస్‌లైన్ : ‘లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతాం..నాలో శక్తి ఇంకా పోలేదు, వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తా.. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు’ అని మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌కు వలస వచ్చిన వారే అధికార పగ్గాలు చేపట్టిన ందున సమన్వయ సమితి రూపొందించారని ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం కొప్పళలో విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు ఉన్నాయన్న సంగతి ఓటర్లకు తెలిసిందేనన్నారు. అయితే దీనినే కొన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మలుచుకుంటున్నాయని విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనే సమన్వయ సమితి లేదని, అలాంటిది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా సమన్వయ సమితిని ఎందుకు ఏర్పాటు చేశారు? అని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లో అన్నీ సక్రమంగా లేవని అర్థమవుతోందన్నారు. వలస కాంగ్రెస్ వాదుల చేతిలో అధికార పగ్గాలున్నందునే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమితిని రూపొందించి ఉండవచ్చన్నారు. గతంలో కాంగ్రెస్(ఐ) అని ఉండేదని, అది ఇప్పుడు కాంగ్రెస్(జే) అయ్యిందని హాస్యోక్తి విసిరారు. తమ పార్టీ మొదటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు అధికారం కల్పించి పెంచిన పార్టీ తమదన్నారు. తండ్రీ కొడుకుల పార్టీ అని ఏ ఓటరు, ప్రజలు చెప్పలేదన్నారు. ఈ విషయంపై జరుగుతున్న దుష్ర్పచారం అంతా తమ ప్రత్యర్థి పార్టీల పనే అన్నారు. ఆ దేవుడి దయ వల్ల తనలో ఇంకా శక్తి ఉందని, వంట్లో చేవ ఉన్నంత వరకు ఎన్నికల బరి నుంచి తప్పుకునేది లేదని, తప్పకుండా పోటీ చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని 28 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు.