పాకిస్తాన్‌కు త్వరలో కొత్త ప్రధాని ఎన్నికకానున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీకి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇమ్రాన్ ఖాన్‌తో పాటు జైలులో ఉన్న ఇతర రాజకీయ ప్రముఖులు జైలు నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఓటు వేయలేకపోయారు. బుష్రా అరెస్ట్ అయ్యే సమయానికి పోస్ట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మెయిల్ ద్వారా ఓటు వేసిన వారిలో మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ ఎలాహి, అవామీ ముస్లిం లీగ్ చీఫ్ షేక్ రషీద్, సమాచార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా ఉన్నారని అడియాలా జైలు వర్గాలు తెలిపాయి.
అడియాలా జైలులో 100 మంది ఖైదీలు ఓటు వేయనున్నారు. జైలులోని 7,000 మంది ఖైదీల్లో ఒక శాతం మంది మాత్రమే ఓటువేయనున్నారు. కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్న ఖైదీలను మాత్రమే ఓటు వేయడానికి జైలు అధికారులు అనుమతించించారు.
Comments
Please login to add a commentAdd a comment