postel
-
జైలు నుంచే పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఓటు!
పాకిస్తాన్‌కు త్వరలో కొత్త ప్రధాని ఎన్నికకానున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీకి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇమ్రాన్ ఖాన్‌తో పాటు జైలులో ఉన్న ఇతర రాజకీయ ప్రముఖులు జైలు నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఓటు వేయలేకపోయారు. బుష్రా అరెస్ట్ అయ్యే సమయానికి పోస్ట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మెయిల్ ద్వారా ఓటు వేసిన వారిలో మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ ఎలాహి, అవామీ ముస్లిం లీగ్ చీఫ్ షేక్ రషీద్, సమాచార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా ఉన్నారని అడియాలా జైలు వర్గాలు తెలిపాయి. అడియాలా జైలులో 100 మంది ఖైదీలు ఓటు వేయనున్నారు. జైలులోని 7,000 మంది ఖైదీల్లో ఒక శాతం మంది మాత్రమే ఓటువేయనున్నారు. కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్న ఖైదీలను మాత్రమే ఓటు వేయడానికి జైలు అధికారులు అనుమతించించారు. -
రామాలయం పోస్టల్ స్టాంపు విడుదల
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా నేడు (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. రామాలయ పోస్టల్ స్టాంపు విడుదల అనంతరం ప్రధాని మోదీ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ మొత్తం 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, శబరి మొదలైనవి ఉన్నాయి. ఈ 48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు సహా 20కి మించిన దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్! #WATCH | Prime Minister Narendra Modi releases Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and a book of stamps issued on Lord Ram around the world. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and… pic.twitter.com/X2eZXJzTKz — ANI (@ANI) January 18, 2024 -
‘గాడ్ డిపార్ట్మెంట్’ అంటే ఏమిటి? యూదుల లేఖల్లో ఏముంటుంది?
ఇజ్రాయెల్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యూదుల జీవితాల్లో మతం, ఆధ్యాత్మికత అనేవి లోతుగా నాటుకుపోయాయి. దీనికి ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ‘దేవుని ప్రత్యేక విభాగం’ ఉదాహరణగా నిలుస్తుంది. దీనినే ‘గాడ్ డిపార్ట్మెంట్’ అని అంటారు. ‘గాడ్ డిపార్ట్మెంట్’కి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఉత్తరాలు వస్తుంటాయి. ఇజ్రాయెట్ 21సీ. ఓఆర్జీ తెలిపిన వివరాల ప్రకారం ఈ దేవుని విభాగానికి ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఉత్తరాలు వస్తుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉంటున్న యూదులు తమ ప్రార్థనలు, కోరికలు, బాధలు, సంతోషాలను ప్రస్తావిస్తూ దేవునికి లేఖలు పంపుతారు. వీటన్నింటికీ ఒకే చిరునామా ఉంటుంది. అదే.. కోటెల్ లేదా వెస్ట్రన్ వాల్. ఇజ్రాయెల్ పోస్టల్ డిపార్ట్మెంట్లోని ‘గాడ్ డిపార్ట్మెంట్’కు వచ్చే ఉత్తరాలన్నీ జెరూసలేంలొని ‘వెస్ట్రన్ వాల్’ రంధ్రాలలో ఉంచుతారు. ఇక్కడ పశ్చిమ గోడను కోటెల్ అని కూడా అంటారు. ఇది ‘వాల్ ఆఫ్ ది మౌంట్’లో ఒక భాగం. ఒకప్పుడు ఈ ప్రదేశంలోనే తమ పవిత్ర దేవాలయం ఉండేదని యూదులు గాఢంగా నమ్ముతారు. దీన్నే ‘హోలీ ఆఫ్ ది హోలీస్’ అని అంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది యూదులు తమ వారసత్వాన్ని గుర్తు చేసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
హక్కులే కాదు... బాధ్యతలూ గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేవలం హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత సంఘ సేవకుడు చమన్‌లాల్ శతజయంతి సందర్భంగా భారతీయ పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అందుకే హక్కులు, బాధ్యతల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో సర్వస్వాన్ని కోల్పోయిన భారతీయ కుటుంబాలను పరామర్శిస్తూ వారికి చమన్‌లాల్ అండగా నిలిచారన్నారు. చమన్ లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని తపాలా బిళ్లను విడుదల చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ తపాలా శాఖను ఉపరాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రులు దేవ్‌సింగ్ చౌహాన్, రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో 22.60% సమయం సద్వినియోగం పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో మూడోవారం 8 బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో ఎగువ సభలో సద్వినియోగమైన సమయం(ప్రొడక్టివిటీ) 24.2 శాతానికి పెరిగింది. ఇది మొదటి వారంలో 32.20 శాతం, రెండో వారంలో కేవలం 13.70 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు రాజ్యసభ పరిశోధక విభాగం గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా మొత్తం మూడు వారాల్లో సద్వినియోగమైన సమయం 22.60 శాతంగా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూలై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెగసస్ స్పైవేర్‌తోపాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు మొదటిరోజు నుంచే ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రవేశపెడుతూనే ఉంది. గతవారం 17 పార్టీలకు చెందిన 68 మంది సభ్యులు వివిధ బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో బిల్లులపై మొత్తం 3.25 గంటలపాటు చర్చలు జరిగాయి. -
కౌంటింగ్‌కు కౌంటర్
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇదో అసాధారణ నిర్ణయం. విమర్శలు, వివాదాలు, క్షణక్షణం ఉత్కంఠ రేగే పరిస్థితుల మధ్య వ్యవహారం కోర్టు వరకు వెళుతోంది. మొదట్నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కోర్టుకెక్కుతామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ అమెరికా ప్రజల్ని మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ట్రంప్ దీనిపై సుప్రీంకోర్టుకి వెళతానని స్పష్టం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు శ్వేత సౌధంలో తన మద్దతుదారులనుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో మనమే గెలవబోతున్నాం. నా దృష్టిలో మనమే గెలిచాం. దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి మనం కట్టుబడి ఉన్నాం. అందుకే చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటాం’’అని ట్రంప్ చెప్పారు. ‘‘వెంటనే పోస్టల్ బ్యాలెట్లను అనుమతించడం ఆపేయాలి. జో బైడెన్ శిబిరం దేశాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కి అనుమతిస్తున్నారు. నవంబర్ 3 అర్థరాత్రి తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్లను అనుమతించ కూడదు. అందుకే సుప్రీంకోర్టుకెళతాం’’అని ట్రంప్ తన అనుచరుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ట్రంప్ మొదట్నుంచి పోస్టల్ బ్యాలెట్‌ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఓట్లలో అక్రమాలకు ఆస్కారం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి సగం మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నింటినీ ఎదుర్కొంటాం: డెమొక్రాట్లు ఎన్నికల ఫలితాల్ని నిరోధించడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ శిబిరం విమర్శించింది. ట్రంప్ కోర్టుకి వెళ్లకుండా తమ న్యాయ నిపుణుల బృందం అడ్డుకుంటుందని బైడెన్ క్యాంపైన్ మేనేజర్ ఓ మల్లే డిల్లాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిలిపివేయాలని ట్రంప్ పేర్కొనడం అసాధారణం, అవమానకరమని ఆమె మండిపడ్డారు. ట్రంప్ చర్యలు సరైనవి కావన్న డిల్లాన్ ఓటింగ్ నిలిపివేయాలనడం అమెరికా పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమేనని అన్నారు. ట్రంప్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కోవడానికి తమ న్యాయనిపుణుల బృందం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలా చెయ్యడం కుదరదు: అమెరికా పోస్టల్ సర్వీసు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓట్లు అన్నింటీనీ మంగళవారం సాయంత్రానికల్లా కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలన్న న్యాయస్థానం ఆదేశాలను పాటించలేమని అమెరికా పోస్టల్ సర్వీసు స్పష్టం చేసింది. ప్రతీ రాష్ట్రంలోనూ రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రావడం వల్ల సమయం పడుతుందని పోస్టల్ సర్వీసు తరఫు లాయర్ కోర్టులో తన వాదనలు వినిపించారు. కీలక రాష్ట్రాలుగా భావించే డజనుకి పైగా రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా ఓట్లు ఇంకా ఎన్నికల అధికారులకు అప్పగించవలసి ఉంది. -
ఉద్యోగులు ఎటువైపో.!
ఆదిలాబాద్‌అర్బన్: రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులు దృష్టి సారించారు. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రచారంలో హడావిడిగా గడుపుతున్న అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఓ కన్నేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు రేపటి వరకు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు ఉద్యోగులను కూడా తమ దారికి తెచ్చుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు మొదలెట్టారు. మరోవైపు వందశాతం పోలింగ్ లక్ష్యంగా చర్యలు చేపడుతున్న ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగి తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది. కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం గెలుపును ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు వారిని అనుకూలంగా మలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలో ఉద్యోగులకు అనుకూలంగా ఉండే తాయిలాలను ప్రకటిస్తూ మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాయి. 7,250 మంది ఉద్యోగులు.. జిల్లాలోని 18 మండలాల్లో దాదాపు 7,250 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. అయితే వీరంతా ఖజానా శాఖ పరిధిలో వేతనాలు పొందేవారే. వీరు కాకుండా ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్, సింగరేణి ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరందరికీ జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం’ (సీపీఎస్) రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గతకొంత కాలంగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుకూలంగా తమవంతు సహకారం చేస్తామని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అలాగే పీఆర్సీ, మధ్యంతర భృతిపై కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు. దీంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. తమ డిమాండ్లకు అనుకూలంగా ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో ప్రకటించాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. అన్ని పార్టీల నాయకులు సీపీఎస్ విషయమై సానుకూలంగా స్పందిస్తామని సంకేతాలు ఇవ్వడంతో అసలు ఉద్యోగులు ఏ పార్టీని నమ్మి ఓట్లు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కారించే విధంగా ఏ పార్టీ మేనిఫెస్టో ఉంటుందో వారి వైపే ఉద్యోగులు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రేపటితో గడువు పూర్తి.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పిస్తే సమయానికి వారి చేతికి పత్రాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు కలిపి పోస్టల్ బ్యాలెట్ కోసం 3,025 మంది సిబ్బంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఒక నియోజకవర్గంలోని సిబ్బంది అదే అసెంబ్లీ పరిధిలో పోలింగ్ విధులు నిర్వర్తిస్తే పోస్టల్ బ్యాలెట్ అప్పుడే ఇస్తామని, ఇతర నియోజకవర్గంలో పోలింగ్ బాధ్యతలు ఉంటే పోస్ట్ ద్వారా లేదా ఆర్వోకు డ్యూటీ ఆర్డర్ కాపీతో పాటు పోస్టల్ బ్యాలెట్‌ను పంపిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇందుకు ఎన్నికల సిబ్బంది డ్యూటీ ఆర్డర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఈ నెలాఖరులోగా పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోకుంటే ఓటు వినియోగించుకోవడం కష్టంగా ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థుల ఆశలు.. గత ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటున్నందున ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఓటు హక్కు వినియోగానికి అవకాశం దొరకడం లేదని సమాచారం. ఓటు వినియోగించుకున్న సిబ్బంది సైతం పోస్టల్ బ్యాలెట్‌పై అనుమానాస్పదంగా మార్క్ చేయడంతో కొన్ని ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించింది. దీనిపై కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఓటు ఆవశ్యకత గురించి ఉద్యోగులకు, సిబ్బందికి వివరిస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా మారే అవకాశం లేకపోలేదు. అందుకే రాజకీయ పార్టీలు ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ వారిని మచ్చిక చేసుకునే పనిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. -
గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల ఆందోళన
విజయనగరం : విజయనగరం జిల్లాలో గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పార్వతీపురం మండల కేంద్రంలో సోమవారం ఉద్యోగులు పోస్టల్ సూపరిండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే పోస్టల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉద్యోగులు దర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయానికి తాళం వేసి బైఠాయించారు. గ్రామీణ పోస్టల్ ఉద్యోగులకు పీఆర్సీ అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. (పార్వతీపురం)