
గెలుపు కోసం యజ్ఞం
కాన్పూర్: చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రాజకీయాల్లో. అందుకే వీలైన అన్ని దారుల్లోనూ విజయం కోసం పరిశ్రమిస్తుంటారు రాజకీయనేతలు. ఆ క్రమంలోనే బిహార్ ఎన్నికల్లో నేడు ఓటరు తీర్పు వెలువడనుండటంతో ఫలితాలు తమకే అనుకూలంగా రావాలని యజ్ఞం మొదలుపెట్టారు బీజేపీ శ్రేణులు.
పక్కరాష్ట్రం బీజేపీలో తమ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించాలని ఉత్తరప్రదేశ్ కమళదళాలు ఆదివారం ఉదయం యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. కాన్పూర్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొంన్నారు.