పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి
పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి
Published Fri, Jan 27 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
–హెచ్‌ఎంలతో డీఈఓ రవీంద్రనాథరెడ్డి
గూడూరు: పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనా«ద్‌రెడ్డి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో గూడూరు, సి.బెళగల్ మండలాల జెడ్పీ, మోడల్, కస్తూర్బా పాఠశాలల హెచ్‌ఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా హెచ్‌ఎంతో పదోతరగతి విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను గ్రేడ్‌లుగా విభజించి తక్కువ గ్రేడ్ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఫలితాలు తక్కువ వస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో విదా్యశాఖ డిప్యూటీ ఈఓ తాహెరాసుల్తాన, డీసీఈబీ ఓంకార్‌యాదవ్, ఇన్‌చార్జి ఎంఈఓ నాగభూపాల్‌నాయుడు పాల్గొన్నారు.
Advertisement