ఢిల్లీ: ఇటీవల ఓ విద్యార్ధిని తన నీట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ చిరిగిందని, ఫలితంగా మార్కులు తక్కువ వచ్చాయని అలహాబాద్ హైకోర్టులో జూన్ 12న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఓఎంఆర్ షీట్‌ను పరిశీలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్‌పై జస్టీస్ రాజేస్ సింగ్ చౌహాన్ ధర్మాసనం జూన్ 18న విచారణ చేపట్టింది.
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ అవతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఈ తరుణంలో నీట్ పరీక్ష రాసిన ఆయుషి పటేల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నీట్ పరీక్షను జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. ఫలితాల్ని విడుదల చేస్తోంది. అయితే ఈ జూన్ 4న విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆయేషాకు 335 మార్కులు వచ్చాయి. ఆ మార్కులపై విద్యార్ధిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆన్సర్ కీ ఆధారంగా తనకు 715 మార్కులు వస్తాయని, కానీ వేరే అప్లికేషన్ నంబర్‌తో విడుదలైన పరీక్ష ఫలితాల్లో కేవలం 335 మార్కులే వచ్చాయని అలహదాబాద్ కోర్టులో వాపోయారు.
ఎన్‌టీఏ ఓఎంఆర్ చించేసింది
అంతేకాదు జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన, తన ఫలితాలు వెలువడడంలో జాప్యం జరిగిందని తెలిపింది. తొలుత నీట్ ఫలితాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలేదు. ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని ఎన్‌టీఏ ఆమెకు మెయిల్ చేసినట్లు తెలిపింది. ఓఎంఆర్ షీట్‌ను ఉద్దేశపూర్వకంగా చింపేసిందని ఎన్‌టీఏపై ఆయుషి ఆరోపణలు గుప్పించింది. తన ఓఎంఆర్ షీట్‌ను మరోసారి పరిశీలించాలని అన్నారు. అంతేకాదు ఎన్‌టీఏపై విచారణ చేపట్టాలని, త్వరలో జరగాల్సిన అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపకుండా నిలిపి వేయాలని కోరారు.
నకిలీ పత్రాలు సమర్పించి
అయితే, కోర్టు ఆదేశాలతో ఎన్‌టీఏ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్‌ను సమర్పించింది. ఆ ఓఎంఆర్ షీట్ చిరిగిపోలేదు. విద్యార్ధిని నకిలీ ఓఎంఆర్ షీట్‌ను కోర్టుకు సమర్పించినట్లు నిర్దారణకు వచ్చింది. అందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎన్‌టీఏను ఆపలేమని కోర్టు పేర్కొంది.
పిటిషన్ ఉపసంహరణ
ఎన్‌టీఏ సైతం ఆయుషిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తన ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచింది. అయితే వరుస పరిణామాలతో ఆయుషి తరుపు న్యాయవాది తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కోరగా అందుకు కోర్టు అంగీకరించింది.
NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।
क्या परीक्षा कराने… pic.twitter.com/mcHwsVb4IH— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 10, 2024
ప్రియాంక గాంధీ సైతం
ఇక ఆయేషీ పటేల్ తనకు అన్యాయం జరిగిందంటూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి, పేపర్ లీకేజీలు, అవకతవకలపై చర్య తీసుకోవాలని కోరారు. ఆయుషి పటేల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బీజేపీ నేతలు ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు, అసత్యాల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment