నీట్‌ పేపర్‌ లీక్‌ : కేంద్రం దిద్దుబాటు చర్యలు | Former ISRO Chief Radhakrishnan Led A Panel To Reform The NEET Examination Process | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌ లీక్‌ : కేంద్రం దిద్దుబాటు చర్యలు

Published Sat, Jun 22 2024 3:50 PM | Last Updated on Sat, Jun 22 2024 4:23 PM

Former ISRO chief Radhakrishnan led a panel to reform the NEET examination process

ఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీపై కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పరీక్షల నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా, కేంద్రం ఆదేశాలతో.. రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ ప్రవేశ పరీక్ష విధానంలో సంస్కరణలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పని విధానాల్లో మార్పులు , డేటా సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ సిఫారసులు చేయనుంది.  

రాధాకృష్ణన్‌తో పాటు కమిటీలో ఎయిమ్స్‌ ఢిల్లీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదారబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్ రామమూర్తి, ఐఐటీ మద్రాస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎమిరిటస్,కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్‌ బన్సల్‌,ఐఐటీ ఢిల్లీ డీన్‌ (విద్యార్ధి వ్యవహారాలు) ప్రొఫెసర్‌ ఆదిత్య మిట్టల్‌, కేంద్ర విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌ సభ్యులుగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement