cental govt
-
నీట్ పేపర్ లీక్ : కేంద్రం దిద్దుబాటు చర్యలు
ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పరీక్షల నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, కేంద్రం ఆదేశాలతో.. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ ప్రవేశ పరీక్ష విధానంలో సంస్కరణలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పని విధానాల్లో మార్పులు , డేటా సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ సిఫారసులు చేయనుంది. రాధాకృష్ణన్‌తో పాటు కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదారబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామమూర్తి, ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎమిరిటస్,కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్,ఐఐటీ ఢిల్లీ డీన్ (విద్యార్ధి వ్యవహారాలు) ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ సభ్యులుగా ఉన్నారు.Ministry of Education constitutes a High-Level Committee of Experts to ensure transparent, smooth and fair conduct of examinations. Committee to make recommendations on Reform in the mechanism of the examination process, improvement in Data Security protocols and structure and… pic.twitter.com/TJ9NqqUJMi— ANI (@ANI) June 22, 2024 -
దేశానికే ఆర్ధికశాఖ మంత్రి..కూరగాయల మార్కెట్లో ఇలా..
ఎప్పుడూ దేశ బడ్జెట్, జీడీపీ, జీఎస్టీ అంటూ ఆర్ధిక అంశాల్లో ఊపిరి సలపని పనితో బిజీగా ఉండే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ మహిళగా మారారు. చెన్నైకి చెందిన ఓ వీధిలో కూరగాయలు కొంటూ స్థానికుల కంట పడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై జిల్లా మైలాపూర్ దక్షిణ మాడ వీధిలో శనివారం సాయంత్రం నిర్మలా సీతారామన్ సందడి చేశారు. కేంద్ర మంత్రి హోదాను పక్కన పెట్టి సాధారణ గృహిణిగా కూరగాయాల్ని కొనుగోలు చేశారు. న్యూఢిల్లీకి బయలు దేరే ముందు ఇంట్లో వంటకు కావాల్సిన టర్కీ బెర్రీ (ఉస్తికాయలు), పిడి కరణై (కందగడ్డ), ములై కీరై (ఒక రకమైన ఉసిరికాయ), మనతక్కలి కీరై (పాల కూర)ను కొనుగోలు చేశారు. During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors & local residents and also purchased vegetables. pic.twitter.com/emJlu81BRh — NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022 కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో స్థానికులతో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగ్గారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ ‘వీధిల్లో కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో ఆమె సెక్యూరిటీని చూసి వ్యాపారులు కాస్త బయపడ్డారు. ఇక్కడికి వచ్చింది నిర్మలా సీతారామన్ అని తెలుసుకొని సంతోషించారని, స్థానికులు టీ తాగేందుకు పిలిచినట్లు బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ అన్నారు. చదవండి👉 ‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్ -
ఎయిరిండియాకు ‘ప్రాధాన్యత’ ఉపసంహరణ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఎయిరిండియాకు ఇస్తున్న ప్రాధాన్యతను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉపసంహరించింది. ఎయిరిండియాకు ఇచ్చిన ట్రాఫిక్ హక్కులను ఇతర సంస్థలకు కేటాయించే ముందు.. కంపెనీ సమర్పించే ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తామంటూ గత సర్క్యులర్‌లో పొందుపర్చిన నిబంధనను తాజాగా ఏప్రిల్ 19న జారీ చేసిన సర్క్యులర్‌లో తొలగించింది. పౌర విమాయాన రంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న ఏ ఎయిర్‌లైన్స్‌కైనా సదరు హక్కులను కేటాయిస్తామని పేర్కొంది. సాధారణంగా ఒక దేశ విమానయాన సంస్థలు మరో దేశానికి సర్వీసులు నడపాలంటే ఇరు దేశాలు చర్చించుకుని, ద్వైపాక్షిక విమాన సేవల ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. దానికి అనుగుణంగా ఆయా దేశాలు తమ ఎయిర్‌లైన్స్‌కి సర్వీసులు హక్కులను కేటాయిస్తాయి. ఎయిరిండియా ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో ఉండటంతో ఈ హక్కుల విషయంలో దానికి ప్రాధాన్యత లభించేది. కానీ ప్రస్తుతం టాటా గ్రూప్ చేతికి వెళ్లి ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌గా మారడం వల్ల ప్రత్యేక హోదా కోల్పోయింది. -
కాపాడండి మహాప్రభో..బొగ్గు కొరతపై మోదీకి విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: అనియంత్రిత రంగ సంస్థలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో సత్వరం జోక్యం చేసుకుని పరిష్కారమార్గం చూపాలని ప్రధాని నరేంద్ర మోదీకి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు కొరత వల్ల ఎక్ఛేంజీల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. తయారీ, క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్లపై (సీపీపీ) ఆధారపడే సంస్థలు మొదలైన వాటికి సంబంధించిన 10 పరిశ్రమల అసోసియేషన్లు కలిసి ఈ మేరకు ప్రధానికి వినతిపత్రం సమర్పించాయి. బొగ్గు సరఫరా సుదీర్ఘ సమయంగా తగ్గిపోవడం వల్ల అల్యుమినియం, సిమెంటు, ఉక్కు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. సీపీపీలు నిరుపయోగంగా పడి ఉండటంతో పాటు వాటిపై ఆధారపడిన సంస్థలు మార్కెట్ నుంచి విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని, దీనివల్ల మొత్తం వ్యవస్థ పనితీరు దెబ్బతింటోందని వినతిపత్రంలో పరిశ్రమలు వివరించాయి. చాలా మటుకు కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకోవడమో లేక మూసివేయడమో చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపాయి. దీనితో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయి, అంతిమంగా వినియోగదారులపై భారం పడుతుందని పేర్కొన్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీపీలు, ఉక్కు, సిమెంటు, స్పాంజ్ ఐరన్ వంటి రంగాలకు బొగ్గు సరఫరా 32 శాతం వరకూ తగ్గిపోయింది. జనవరి–మార్చిలోనే విద్యుత్, విద్యుత్‌యేతర రంగాలకు సమానంగా బొగ్గు సరఫరా జరిపి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని అవి తెలిపాయి. మరోవైపు, కోవిడ్–19 అనంతరం ఎకానమీలో డిమాండ్ ఒక్కసారిగా ఎగియడం, వేసవి మరికాస్త ముందుగానే రావడం, గ్యాస్ ధర .. దిగుమతి చేసుకున్న బొగ్గు రేటు పెరగడం, కోస్తా థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోవడం వంటి అంశాలు బొగ్గు కొరత.. విద్యుత్ డిమాండ్‌కు దారి తీశాయని బొగ్గు శాఖ కార్యదర్శి ఏకే జైన్ తెలిపారు. -
నిర్మాణ రంగానికి కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్యను నివారించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఆర్బిట్రేషన్ పక్రియలో నిలిచిపోయిన మొత్తంలో 75 శాతం ఈ రంగానికి అందుబాటులోకి వచ్చే విధంగా నిబంధనల రూపకల్పన చేసింది. దీనిప్రకారం, కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఆర్బిట్రల్ అవార్డును (తీర్పు)ను ఒక మంత్రిత్వ శాఖ దాని విభాగం అప్పీలేట్ కోర్టులో సవాలు చేసిన సందర్భంలో అవార్డు ప్రకారం ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతం కాంట్రాక్టర్‌కు ఇకపై లభ్యమయ్యే అవకాశం ఏర్పడింది. అయితే ఇందుకు సంబంధిత కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు అమలు... నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ మేరకు ఇప్పటికే నిర్దేశాలు ఉన్నాయి. 2019 నవంబర్‌లో కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటూ, ఆర్బిట్రేషన్ అవార్డును ఏదైన ప్రభుత్వ రంగ సంస్థ సవాలు చేసిన సందర్భంలో ‘బ్యాంక్ గ్యారెంటీ’పై కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతాన్ని చెల్లించాలని చెల్లించాలని నిర్దేశించింది. ఇప్పుడు ఈ నిబంధనను మంత్రిత్వశాఖలకూ వర్తింపజేస్తూ నిబంధనలు రూపొందించింది. ఇందుకు సంబంధించి జనరల్ ఫైనాన్షియల్ రూల్ (జీఎఫ్ఆర్)లో 227ఏ కొత్త రూల్‌ను జోడిస్తున్నట్లు వ్యయ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ‘మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్ మధ్యవర్తిత్వ అవార్డ్‌ను సవాలు చేసిన సందర్భాలలో, ఆర్బిట్రల్ అవార్డ్ మొత్తాన్ని చెల్లించనట్లయితే, అవార్డ్‌లో 75 శాతాన్ని కాంట్రాక్టర్/రాయితీదారుకు బ్యాంక్ గ్యారెంటీపై మంత్రిత్వశాఖ /డిపార్ట్మెంట్ చెల్లించాలి‘అని తన తాజా ఉత్తర్వుల్లో కేంద్ర వ్యయ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు పరిశీలిస్తే... బ్యాంక్ గ్యారెంటీ ఆర్బిట్రల్ తీర్పులో పేర్కొన్న 75 శాతానికి మాత్రమే వర్తిస్తుంది. తదుపరి కోర్టు ఉత్తర్వుల ప్రకారం పేర్కొన్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఏర్పడినట్లయితే, మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్కు చెల్లించాల్సిన వడ్డీకి ఇది వర్తించబోదు. చెల్లింపులు ఎస్క్రో ఖాతాలోకి జరుగుతాయి. అయితే అంది వచ్చిన డబ్బు వినియోగంలో ముందుగా రుణదాతల బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలి. చెల్లింపుల్లో మిగిలిన మొత్తాన్ని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఉపయోగించాలి లేదా పరస్పరం అంగీకరించిన, నిర్ణయించుకున్న అదే మంత్రిత్వ శాఖ/ డిపార్ట్మెంట్ ఇతర ప్రాజెక్ట్‌ల పూర్తికి కూడా ఉపయోగించవచ్చు. రుణదాతల బకాయిల పరిష్కారం, అటుపై మంత్రిత్వశాఖ/డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌ల పూర్తి తర్వాత ఎస్క్రో ఖాతాలో మిగిలి ఉన్న ఏదైనా బ్యాలెన్స్‌ను లీడ్ బ్యాంకర్, మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్ ముందస్తు అనుమతితో కాంట్రాక్టర్/రాయితీదారు వినియోగించుకోవచ్చు. నిలిపివేసిన ఏదైనా డబ్బు లేదా ఇతర మొత్తాలను కూడా బ్యాంక్ గ్యారెంటీపై కాంట్రాక్టర్‌కు విడుదల చేయవచ్చు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అభిప్రాయం తీసుకుని ఆర్బిట్రల్ తీర్పును, దానిపై ఏదైనా అప్పీల్‌ను పరిష్కరించుకోడానికి (కొట్టివేయించడానికి) తగిన నిర్ణయాన్ని ప్రభుత్వ సంస్థలు తీసుకోవచ్చు. ఆర్బిట్రల్ అవార్డు అప్పీల్స్, ఆయా ఆంశాల పెండింగ్ సందర్భాల్లో కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడంలేదు. సంబంధిత న్యాయ ప్రక్రియ ముగింపునకు సంవత్సరాలు పడుతున్న నేపథ్యం లో కేంద్రం ఈ చర్యలపై దృష్టి సారించింది. -
కేంద్రంపై కొట్లాటే..!: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే వరకు, పెట్రోల్, డీజిల్‌పై సెస్సు పూర్తిగా ఉపసంహరించుకునే వరకు కొట్లాడతామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులతో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. వరుసగా రెండోరోజు సోమవారం ప్రగతి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పి కొట్టారు. తెలంగాణలో పండిన 3 కోట్ల టన్నుల ధాన్యం కొనే అంశం వదిలేసి వంకర టింకర మాటలు మాట్లాడారన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ధాన్యం కొంటారో లేదో చెప్పలేదు ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు ప్రెస్‌మీట్ పెట్టి సొల్లు అంతా చెప్పిండు.. కానీ కేంద్రం ధాన్యం కొంటుందో లేదో మాత్రం చెప్పలేదు. తెలంగాణ రైతులు పండించే మొత్తం ధాన్యం కొనుగోలు చేసే వరకు మిమ్మల్ని వదలం. వేటాడతం. ప్రతి విషయంలో వెంటాడతం. వేటాడతం. ఎక్స్పోజ్ చేస్తం. ఎక్కడిదాకనైనా పోతం. వడ్లు కొంటరా? కొనరా? సూటిగా చెప్పాలి. గోల్మాల్ పద్ధతులు. హరాకిరి ముచ్చట్లు వద్దు. డీజిల్, పెట్రోల్‌పై సెస్ విత్‌డ్రా చేయాలి. చేస్తరా? సస్తరా? ఫస్ట్ అది చెప్పు. వడ్ల సంగతి చెప్పమంటే. వడ్లు విడిచిపెట్టి దొడ్లో నుంచి పారిపోయిండు. నువ్వా మా మెడలు వంచేది. నీ మెడలు మేము వంచుతం. అడుగడుగునా నిలదీస్తం. తిప్పి కొడ్తం. గింగిరాలు తిరగాలి. మేము యుద్ధవీరులం. భయపడే వాళ్లం కాదు. మేం ఏ తప్పు చేయలేదు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మీ అడ్డగోలు అధికార దుర్విని యోగం చేసి ఏమైనా చేయాలనుకుంటే మీరే గోల్మాల్ అవుతరు. మేము కాము. ఏ విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నం. మీకు సహకరించకపోతే కక్షసాధింపు చర్యలా? ఈడీ, ఐటీతో అడ్డగోలు దాడులా? మీతో దొంగలు భయపడ్తరు. మేమెందుకు భయపడ్తం..’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. రైతు ప్రయోజనాల కోసం కొట్లాడతాం ‘యాసంగిలో కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని స్పష్టం చేసినందునే..వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాణం పోయే వరకు కొన ఊపిరితోనైనా రైతు ప్రయోజనాల కోసం, తెలంగాణ కోసం కొట్లాడుతాం. మీరు కాదు మీ జేజేమ్మ ఎవరున్నా వదిలిపెట్టం. మేమే ఈ దేశానికి కంట్రిబ్యూటర్లం. దేశానికి అతి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశ ఖజానాలో మాకు వాటా ఉంది. ఇది మీ అయ్య సొత్తు కాదు. మంచి పథకం మేము ప్రారంభిస్తే కేసీఆర్ ఇంట్ల కాడనుంచి ఇస్తుండా? అని సోషల్ మీడియాలో వింత ప్రచారం చేస్తున్నరు. మీరిచ్చేది మీ ఇంటి నుంచా? ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయిలే అనుకుని ఇంతకాలం క్షమించినం. ఇంకా అట్లనే మొరుగుతామంటే 100 శాతం బుద్ధి చెబ్తాం. ఇకపై రోజూ విలేకరుల సమావేశం నిర్వహించి గట్టి జవాబిస్తా..’ అని తెలిపారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను నిలదీయాలి ‘కేంద్రం తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వేలు, లక్షల మంది రైతులతో ధర్నాలు పెడ్తున్నం. మిమ్మల్ని ఢిల్లీ వరకు వదలం. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఏ ఊరికి వచ్చినా ధాన్యం కొంటారా? లేదా ? అని ఎక్కడికక్కడ రైతులు నిలదీయాలి. పాదయాత్రలు చేస్తానంటావు. ఇక పాదయాత్రలు చేయి. రైతులు వచ్చి నిలదీస్తరు..’ అని అన్నారు. చమురు ధరలపై అబద్ధాలు చెప్తున్నరు ‘దేశ ప్రజలపై బీజేపీకి ప్రేమ ఉంటే పెట్రోల్, డీజిల్‌పై విధించిన సెస్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. అప్పుడు మళ్లీ రూ.77కే పెట్రోల్, రూ.68కే డీజిల్ వస్తుంది. మీరు (కేంద్రం) 16 సార్లు పెంచిన్రు. మేము ఒక్కసారి కూడా పెంచలేదు. విడి విడి వసూళ్లు ఉండకుండా 2015లో హేతుబద్ధీకరించినం. దాన్ని కూడా పెంచినట్టు అబద్ధాలు చెప్తున్నరు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకున్నా తప్పుడు లెక్కలు చూపి సెస్సు పెంచారు..’ అని సీఎం ధ్వజమెత్తారు. ట్రాక్టర్ డ్రైవరా నువ్వు? ‘కేసీఆర్ నీ ఫార్మ్‌హౌస్‌కు వచ్చి దున్నుతా అని నీ పాదయాత్రలో 50 సార్లు మాట్లాడినవ్. ఏం దున్నుతవ్? ట్రాక్టర్ డ్రైవరా నువ్వు? నేను, నా కొడుకు పేరు మీద ఉన్న 100 ఎకరాల భూముల్లో బాజాప్త వ్యవసాయం చేసుకుంటున్నం. అది దాచిపెట్టేదా? వ్యవసాయం చేయకపోతే ఏం చేయాలె. రాఫేల్ యుద్ధ విమానాల్లో కమీషన్లు తీసుకోవాలె? వ్యవసాయం చేసుకుని బతుకుతున్నం. తప్పా. ముఖ్యమంత్రిగా ఉంటూ సిద్దిపేటలో ఓ జాగా అమ్ముకున్న. రూ.16 కోట్ల నుంచి రూ.17 కోట్లు వస్తే ఫార్మ్ హౌస్‌లో పాత ఇళ్లు కూలగొట్టి రూ.2.5 కోట్లు పెట్టి ఇళ్లు కట్టుకున్నం. మిగిలిన దాంట్లో రూ.3.75 కోట్ల ఆదాయ పన్ను చెల్లించిన. మేము దొంగ లెక్కల మీద బతికేటోళ్లం కాదు. మనకేమీ మనీ ల్యాండరింగ్లు, కంపెనీలు లేవు. దందాలు దొంగ వ్యాపారాలు లేవు. నేను పోయి సూట్‌కేసులు ఇచ్చినానా? సూట్ కేసులు ఇచ్చేది మీరు. దేశంలో ఈ రోజు ఎన్నికల్లో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పార్టీ ఏది? హరాకిరి చేసేది మీరు. మీకు అనుకూలంగా ప్రజాతీర్పు రాకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంది మీరే..’ అని విమర్శించారు. దా నా ఫార్మ్ హౌజ్ కాడికి.. ఆరు ముక్కలవుతవు కొడకా ‘నీ ముక్కు బాగాలేదని ఒకడు..నీ ముడ్డి బాగాలేదని ఒకడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో ఏమేమో మాట్లాడినరు. నువ్వు మందు తాగుతవు అన్నావు. నీకు తెలుసా ? నువ్వు వచ్చిపోసినవా? ఎప్పుడైనా వచ్చి మందు కలిపినవా? అలా మాట్లాడవచ్చా? నీ గురువులు నేర్పిన సంస్కారం ఇదేనా? అందుకే కదా నీ మెడలు విరగ్గొడ్త అన్నది. దా.. నా ఫార్మ్ హౌజ్ కాడ అడుగు పెట్టు.. ఆరు ముక్కలవుతవు నా కొడకా.. నీలాగా గెస్ట్ హౌస్ లేదు. అది ఫార్మ్‌హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్. నా ఫార్మ్ హౌస్ దున్నతవా? నీ అయ్యదా నా ఫార్మ్ హౌస్. బాజప్తా కొనుక్కున్న భూములవి. ఎన్నికల అఫిడవిట్లో చూపిస్తం. ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మా అత్తగారివి, మా భూములు పోయాయి..’ కేసీఆర్ తెలిపారు. మీరు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా? ‘టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా ఉంటుందని 2014లోనే ప్రకటించినం. కేబినెట్లో ఉద్యమకారులే ఉంటరా? సమపాళ్లలో ఉంటరు. ఉద్యమకారులకు సైతం వారి శక్తియుక్తలను బట్టి అవకాశాలు వస్తుంటాయి. ఇతర పార్టీల నుంచి సీనియర్లను తీసుకుని వారి సేవలను తెలంగాణ కోసం వినియోగించుకుంటాం. జ్యోతిరాదిత్య సింథియాను ఎందుకు కేంద్ర కేబినెట్లో పెట్టుకున్నరు? ఆయన ఏమైనా ఆరెస్సెసా..బీజేపీనా.. మీరు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా? నీలాంటి ఎంపీలను ఎంత మందిని చేసిన నేను. నువ్వో తోకగాడివి. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంత కొత్త రాజకీయ నాయకత్వాన్ని టీఆర్ఎస్ సృష్టించింది. నువ్వా నా మీద మాట్లాడేది. నేను ఓ రాష్ట్రం, పార్టీ, జెండా సృష్టికర్తను. రాష్ట్రంలో హనుమంతుడి గుడిలేని గ్రామం లేదు, తెలంగాణలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రూ.2 వేల పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళిత బంధు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంఇదే. దేశంలో బీజేపీ ఏ రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేస్తోందో ఆ పార్టీ నాయకులు చెప్పాలి..’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. దేశ ద్రోహి ఎవరో తేల్చుదాం ‘బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే, చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై ఆ పార్టీ రెండు, మూడురకాల ముద్రలు వేస్తోంది. దేశద్రోహి అంటున్నారు. లేదంటే అర్బన్ నక్సలైట్ అనే పేరుపెట్టి వేధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నోసార్లు పదవులు వదిలేసి ఉద్యమించిన వ్యక్తిని నేను. నేను దేశద్రోహినా? నేను యాడ దేశద్రోహం చేసిన. దేశం సరిహద్దులను చైనా వాడు ఆక్రమించుకుంటున్నడు.. కాపాడండి అనడం దేశద్రోహమా? భూభాగం కాపాడమన్నోడు దేశద్రోహా? మందికి విడిచిపెట్టినోడు దేశద్రోహా? ఈ సంగతిని తేల్చాలి. ఎవడైన గట్టిగా నిలదీస్తే దేశద్రోహి. ఇదెక్కడి ఫిలాసఫి. రా..కమాన్. ఎవరు దేశద్రోహో తేల్చుదాం..’ అని సవాల్ చేశారు. తెలంగాణకు అన్ని రకాలుగా ద్రోహం చేసింది మీరే... ‘దేశంలోని నీటి సంపద, కరెంట్ వాడే తెలివి తేటలు లేవు. 4లక్షల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్నా 60శాతం నిరుపయోగంగా ఉంది. తప్పులన్నీ మీరు చేసుకుంటూ ఇతరులను బద్నాం చేస్తరా? వాస్తవాలు అడిగితే దేశ ద్రోహులా? తెలంగాణ నీటి వాటా తేల్చడానికి ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయమని చెప్తే ఏడేళ్ల నుంచి చేతకావడం లేదు ఎందుకు? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు ఎందుకు పోయినవు అని బండి సంజయ్ అంటడు. అందులో ఉండేదే ముఖ్యమంత్రులు. బుర్ర ఏమైనా ఉందా? పరిపాలన పరిజ్ఞానం ఉందా? ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా నడవాలి కదా? ప్రస్తుత కేటాయింపుల ప్రకారం 299 టీఎంసీలను తెలంగాణకు ఉన్నయి. తాత్కాలిక పద్ధతిలో నీటిని వాడుకునే విధంగా సంతకం చేశా. ప్రజలకు నీళ్లు రావద్దా? ఏడు మండలాలు గుంజుకున్నప్పుడు ఏడ పండుకున్నరు. సీలేరు ప్రాజెక్టును ఆంధ్రకు ఇచ్చి ప్రధాని తెలంగాణకు శాశ్వత ద్రోహం చేసిండు. నన్ను ఫాసిస్టు అన్నవని ప్రధాని మోదీ అడిగిండు. నా కడుపు మండి అన్న అని ఆయనకు చెప్పిన. ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, రూ.450 కోట్ల బీఆర్జీఎఫ్ నిధులు, నవోదయ పాఠశాలలు, వైద్య కళాశాలలు ఇవ్వకుండా అన్ని రకాలుగా తెంలగాణకు ద్రోహం చేసింది మీరే. తెలంగాణ రైతుల పక్షాన శుక్రవారం ధర్నాకు కూర్చుంటం. నువ్వు కూర్చుంటవా?..’ అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనే కొత్త డ్రామాలు ‘నేను రాయలసీమ ప్రజలకు నీళ్లు ఇవ్వాలని చెప్పిన మాట వాస్తవం. తెలంగాణకు చాలినన్ని సాగునీరు వస్తే తప్పకుండా తీసుకుపోవచ్చని చెప్పా. ఏపీకి వెళ్లి చేపల పులుసు తింటే తప్పేంటి? ఎన్నికల సమయంలోనే బీజేపీ కొత్త కొత్త డ్రామాలు చేస్తది. తమిళనాడు, కర్ణాటక ఎన్నికలప్పుడు నదుల అనుసంధానం అంటూ హడావుడి చేసి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. దొడ్డిదారిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పార్టీ బీజేపీది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రజలు మ్యాండేట్ ఇవ్వకున్నా దొడ్డిదారిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంగతి ప్రజలకు తెలుసు..’ అని ఎద్దేవా చేశారు. రెచ్చగొట్టాలి.. పబ్బం గడుపుకోవాలి ‘మత విద్వేషాలే రగిలిస్తం. మా ఎజెండానే మతం అంటే ఇక మన దేశం ఏం బాగుపడుతుంది. మా కథనే మతం అని బండి సంజయే కదా రోజూ అనేది. అయితే సరిహద్దుల మీద, లేకుంటే మతం మీద రెచ్చగొట్టాలె. భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలి..ఇదీ బీజేపీ తీరు..’ అని విమర్శించారు. గొర్రెల పథకానికి రుణం తీసుకున్నాం ‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్రం సాయం చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తా. ఈ పథకానికి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రాష్ట్రం రుణం తీసుకున్నది. అందుకు ప్రతినెలా వడ్డీ చెల్లిస్తున్నాం. అంతేకానీ కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇచ్చినట్లు చూపిస్తే..రాజీనామా చేసేందుకు సిద్ధం. రాష్ట్రంలో 105 నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ బీజేపీ. అడ్రస్‌లేని పార్టీ, అబద్ధాలు చెప్పే పార్టీ నాయకులను ప్రజలు నమ్మరు. కేంద్రం రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు ఇచ్చిందని బండి సంజయ్ అన్నాడు. దేనిలో దేనికి ఎంత ఇచ్చారో కూడా చెప్పాలి. గతంలో కూడా లక్ష కోట్లు ఇచ్చామని చెప్పిన అమిత్‌షా నుంచి క్షమాపణలు కోరిన. 17న తిరుపతిలో అమిత్‌షా నిర్వహించే సమావేశంలో తప్పకుండా మా ప్రభుత్వం పాల్గొంటది. నేను పాల్గొంటానా? లేదా ? తర్వాతి విషయం..’ అని సీఎం అన్నారు. మీలాగా బ్లాక్ మెయిల్ చేయం ‘ప్రాజెక్టులు కట్టకపోతే కట్టలేదు అంటారు. కడితే కమీషన్లు తీసుకున్నారు అంటారు. దేశంలోని ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే చేసినరా? మా పార్టీకి వచ్చే డబ్బుల లెక్కలు బాజాప్తా చెప్తున్నం. గతేడాది రూ.250 కోట్లు వచ్చాయని నాడు ప్లీనరీలో చెప్పిన. మల్ల రూ.200 కోట్ల వచ్చినయని ఈ ఏడాది ప్లీనరీలో కూడా చెప్పిన. రూ.450 కోట్లు బ్యాంక్‌లో డిపాజిట్ ఉన్నయి. ఇంకో 400 కోట్లు వస్తయి. నీకేందుకు కన్నుకుట్టు. మీ లాగా మందిని బ్లాక్ మెయిల్ చేయం. వారిని వీరిని బెదిరించం..’ అని అన్నారు. దయచేసి వరి వేయవద్దు.. ‘దయచేసి రైతులు వరి వేయకండి. వీళ్లను నమ్మితే శంకరగిరి మాన్యాలు పడ్తం. వీళ్లను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. వీరి మాటను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోట్లేదు. వడ్లు తీసుకుంటవా? లేదా? అని కేంద్ర మంత్రిని ఫోన్ చేసి అడగవచ్చు కదా? రైతులకు వరి వేయమని చెప్పినందుకు ఈ రోజు ఢిల్లీ నుంచి (బండి సంజయ్‌కు) షంటింగ్ అయింది. అందుకే ఇప్పుడు వరి విషయం మాట్లాడట్లేదు..’ అని కేసీఆర్ చెప్పారు. వీళ్లు వేసుకోవచ్చు... ‘విత్తన కంపెనీలు, మిల్లర్లు, వ్యాపారస్తులతో ఒప్పందం కలిగిన రైతులతో పాటు సొంత వాడకం కోసం రైతులు వరి వేసుకోవచ్చు. ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. మద్దతు ధర ఎంత వచ్చినా పర్వలేదు అనుకునే వారూ పండించుకోవచ్చు. వరి కొంటాం అని కేంద్రంతో చెప్పిస్తే మేమే 75 లక్షల ఎకరాల్లో వరి వేయిస్తాం. కానీ ఈ కేంద్రాన్ని నమ్మి రైతులు మునగవద్దు. కొంటాం అని హామీ ఇస్తే వేసుకుందాం. కానీ వారి పరిస్థితి చూస్తా ఉంటే నమ్మకం కలగడం లేదు. రుణ మాఫీ చేయలేదని బండి సంజయ్ మాట్లాడిండు. ఈ టర్మ్‌లో రెండు దఫాలు చేసినం. మిగతాది చేస్తం.. ’ అని స్పష్టం చేశారు. పత్తి వేసుకుంటే అండగా ఉంటాం ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రిపేర్ చేసి రైతులకు అప్పగిస్తుంది. రైతులే సొసైటీలు పెట్టుకుని నడుపుకోవాలని అంటే వారు నిరాకరించారు. ప్రభుత్వం నడిపే జోలికి పోలె. చెరుకు విలువ పడిపోయింది. వర్షాకాలంలో కోటి ఎకరాల్లో పత్తి వేసుకున్నా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒకేసారి తీసేసే పత్తి పంట తీసుకొస్తున్నాం. వచ్చే ఏడాది 50–60 వేల ఎకరాలకు ఇస్తం. యాసంగిలో శనగలు వేసుకుంటే మంచి లాభం వస్తది. పెసర్లు, నువ్వులు వేసుకోవచ్చు. మినుములు, ఆవాలు వేసుకుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖే కొంటది..’ సీఎం హామీ ఇచ్చారు. దళితబంధుకు రూ.20 వేల కోట్లు ‘దళితబంధు యథాతథంగా అమలు జరుగుతుంది. వచ్చే మార్చిలోగా హుజూరాబాద్ నియోజకవర్గం, మరో 4 మండలాల్లో ప్రతి కుటుంబానికి సంపూర్ణంగా, మిగిలిన నియోజకవర్గాల్లోని 100 వంద కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తాం. వచ్చే వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి రూ.20 వేల కోట్లను కేటాయిస్తాం. 2 లక్షల కుటుంబాలకు ఇస్తాం. వచ్చే ఎన్నికల నాటికి నాలుగైదు లక్షల కుటుంబాలకు ఇస్తం. నాలుగైదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికీ ఇస్తం. దమ్ముంటే ఈ పథకానికి కేంద్రం నుంచి రూ.20 వేల కోట్లు తెప్పించాలి..’ అని సీఎం సవాల్ చేశారు. నవంబర్ తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ‘కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులను సర్దుతున్నరు. రెండు మూడు రోజుల్లో నా దగ్గరే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉంది. నవంబర్‌లో ఉద్యోగులను సర్దుబాటు చేసి వెనువెంటనే వచ్చే 60–70 వేల ఖాళీలకు తక్షణమే నోటిఫికేషన్లు ఇస్తం. అవన్నీ నింపేస్తం. ప్రతి ఏటా ఏ ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుపుతూ ఉద్యోగ క్యాలెండర్ సైతం ప్రకటిస్తాం. దేశంలో ఇలా చేసే తొలి ప్రభుత్వం మాదే. మేము తెచ్చిన స్థానిక రిజర్వేషన్లతో 95 శాతం ఉద్యోగాలు మన పిల్లలకే వస్తయి. గెజిటెడ్ పోస్టులు కూడా మనోళ్లకే వచ్చేలా వాటిని జోనల్ పోస్టుల్లోనే పెట్టినం. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నేను మాట్లాడినట్టు బండి సంజయ్ నిరుపిస్తవా? నేను ఎక్కడ లేదు. రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేసిండని బీజేపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ వాళ్లు రాష్ట్రానికి ఏమి చేశారో స్పష్టత ఇవ్వాలి. ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 80 వేల వరకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగం తక్కువగా ఉందని పలు సర్వేల్లో వెల్లడైంది. కానీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం లక్షల ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ లక్షల కుటుంబాలను రోడ్డున పడేస్తోంది..’ అని సీఎం విమర్శించారు. హెలికాప్టర్లలో తిప్పి చూపిస్తా.. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నట్లు చెబితే లేదని బీజేపీ వాళ్లు బుకాయిస్తున్నారు. వాళ్లు వస్తే కళ్లకు కట్టినట్లు చూపిస్తా. 6 హెలికాప్టర్లు పెట్టి తిప్పి మరీ చూపిస్తా. అప్పుడైనా పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తారా? తెలంగాణలో ఎందుకు కొనరు..? రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేస్తుందా? లేదా? స్పష్టత ఇవ్వాలి. పంజాబ్‌లో పూర్తి ధాన్యం కొనుగోలు చేసే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయదో తేల్చిచెప్పాలి. -
మెగా మార్పుల మోదీ మండలి
ఎట్టకేలకు ఒక పునర్వ్యవస్థీకరణ! గంటన్నర సాగిన మహా పునర్వ్యవస్థీకరణ! అనేక ఆశ్చర్యాలు కలిగిస్తూ... పాత బరువులు కొన్ని వదిలించుకొని, కొత్త ముఖాలు, సహకార శాఖ లాంటి కొత్త శాఖలతో, సరికొత్త ఇమేజ్ వచ్చేలా... కేంద్ర క్యాబినెట్ ఎన్నికల మార్కు సమూల పునర్వ్యవస్థీకరణ!! 2019లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక నరేంద్ర మోదీ బుధవారం తొలిసారి మంత్రి మండలిలో చేసిన భారీ మార్పుచేర్పులు అనేక కోణాల్లో ఆసక్తికరం. సన్నిహితులైన పలువురు పాత మంత్రులకు ఆయన ఉద్వాసన పలికారు. తొలిసారి ఎంపీలైనవారికీ, విద్యాధికులకూ చోటిచ్చారు. కొత్తగా ఏడుగురు స్త్రీలకు అవకాశమిచ్చి, మొత్తం 11 మంది మహిళా మంత్రుల క్యాబినెట్‌గా నారీ శక్తిని గౌరవించారు. అదే సమయంలో కులాలు, ప్రాంతాల వారీ పదవుల పందేరంతో సమతూకం కోసం ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్ సహా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో పట్టు బిగించేందుకు అక్కడి వారిని మంత్రులుగా చేర్చుకున్నారు. 35 ఏళ్ళ అతి పిన్నవయస్కుడికి (పశ్చిమబెంగాల్ –నిశిత్ ప్రామాణిక్) ఛాన్సిచ్చి, మంత్రిమండలి సగటు వయసు 58 ఏళ్ళనే మార్కు పడేలా చూశారు. వెరసి, ఇది ‘మోడీ 2.0 క్యాబినెట్’ అనే భావన కలిగించారు. క్యాబినెట్ విస్తరణ వార్త కొద్ది రోజులుగా వినిపిస్తున్నా, ఈ స్థాయి మార్పులను నిన్న మొన్నటి దాకా ఎవరూ ఊహించలేదు. ‘మినిమమ్ గవర్నమెంట్... మ్యాగ్జిమమ్ గవర్నెన్స్’ అనేది ఒకప్పుడు మోదీ వ్యాఖ్య. దానికి తగ్గట్టే ఆయన తొలి క్యాబినెట్ తక్కువమందితోనే సాగింది. కానీ, సమర్థ పాలనకూ, సమస్యల పరిష్కారానికీ తగినంతమంది జట్టులో ఉండాలని రెండేళ్ళ ఎదురుదెబ్బలతో ఆయనకు తెలిసొచ్చినట్టుంది. అందుకే, ఇప్పుడు 78 మందికి తన టీమ్‌ను విస్తరించారు. 2014లో తొలిసారిగా మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎన్నడూ లేనంత పెద్ద జట్టు ఇది. ఈ కొత్త కూర్పులో 12 మంది పాతవారికి స్వస్తి పలికారు. 36 మంది కొత్త మంత్రులకు చోటిచ్చారు. టీఆరెస్‌పై పైచేయి సాధించి, పట్టు బిగించదలచిన తెలంగాణలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పదోన్నతి కల్పించారు. అదే రీతిలో మరో ఆరుగురికి ప్రమోషన్ దక్కింది. జ్యోతిరాదిత్య సింధియా సహా బుధవారం మొత్తం 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఏడేళ్ళుగా అధికారంలో ఉన్న మోదీ ఈ స్థాయిలో క్యాబినెట్ మార్పులు చేయడం ఇదే తొలిసారి. 2019లో రెండో దఫా పగ్గాలు చేపట్టాక, ఆయన మంత్రివర్గ విస్తరణ చేయనే లేదు. కానీ, ఇప్పుడు చేయక తప్పలేదు. కరోనా కష్టకాలంలో ఆరోగ్య, ఆర్థిక, కార్మిక రంగాల్లో ఎదురైన సవాళ్ళతో పడిపోతున్న ఇమేజ్ను కూడగట్టుకొనేందుకు, క్యాబినెట్లో కొత్త రక్తం ఎక్కించడమే మందు అని మోదీ బృందం భావించింది. అవునన్నా కాదన్నా.. కరోనా రెండో ఉద్ధృతి అంచనాలో, సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం ప్రపంచ వేదికపై అప్రతిష్ఠ తెచ్చింది. కొత్త ఐ.టి. నిబంధనలు, సినిమాటోగ్రాఫ్ చట్టం సవరణల లాంటివీ విమర్శల పాలయ్యాయి. దేశరాజధాని వెలుపల రైతుల ఆందోళనను విరమిపజేయడంలో మంత్రుల దౌత్య వైఫల్యం లాంటివీ బాధిస్తున్నాయి. వెరసి, పరిస్థితి చేయి దాటక ముందే సరిదిద్దుకోవాలనే ఆలోచన ఈ తాజా కూర్పుకు దారి తీసింది. ఇప్పటికిప్పుడు ఆరోగ్య మంత్రి– ఆయన సహాయకుడు (డాక్టర్ హర్షవర్ధన్, అశ్వినీ చౌబే), సమాచార శాఖ మంత్రి (ప్రకాశ్ జావదేకర్), ఐ.టి మంత్రి (రవిశంకర్ ప్రసాద్), విద్యా మంత్రి (రమేశ్ పోఖ్రియాల్), కార్మిక మంత్రి (సంతోష్ గాంగ్వర్)తో రాజీనామా చేయించారు. కొత్త వారికి బాధ్యతలు ఇచ్చారు. అలాగే, వచ్చే ఏడాది మొదట్లో ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహం కూడా కొలువు తీరిన కొత్త మంత్రుల ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలతో అర్థమవుతోంది. సరికొత్త కేంద్ర క్యాబినెట్లో సుమారు 27 మంది ఓబీసీలు, అయిదుగురు మైనారిటీలని ఓ లెక్క. అంటే ఈ పునర్వ్యవస్థీకరణ రాజకీయ అనివార్యతలతో పాటు, ఓటర్లను దృష్టిలో పెట్టుకొని చేసిన ఓ రాజకీయ విన్యాసం కూడా అని స్పష్టమవుతోంది. అలాగే, కేంద్రమంత్రి సదానంద గౌడతో రాజీనామా చేయించి, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సన్నిహితురాలైన శోభా కరంద్లాజేకు క్యాబినెట్లో చోటివ్వడం గమనార్హం. అధికారంలోకి వచ్చాక బీజేపీ హవాకూ, మోదీ పాపులారిటీకీ తొలిసారిగా గత ఏణ్ణర్ధ కాలంలో బలమైన దెబ్బలు తగిలాయి. మార్పులు అనివార్యమని తేలింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కంభంపాటి హరిబాబు సహా కొత్త గవర్నర్లకు ఛాన్సిచ్చి, మంగళవారం మొదట కొన్ని మార్పులు చేశారు. బుధవారం కేంద్ర క్యాబినెట్లో సమూల మార్పులు తెచ్చారు. ఇక, పలు ఖాళీలతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పార్టీ వ్యవస్థాగత మార్పులు చేయడమే బాకీ. సమైక్య ప్రతిపక్షం లేకపోయినప్పటికీ, సర్వసన్నద్ధమవుతున్నట్టు మోదీ బృందం ఒక రకంగా సంకేతాలిచ్చింది. మిత్రపక్షాలకూ క్యాబినెట్లో చోటిచ్చిన బీజేపీ... కొత్త రక్తంతో పాలనలో, పనితీరులో మార్పు తెస్తామంటోంది. ప్రభుత్వ పాలనలో, పనితీరులో మార్పు మాటెలా ఉన్నా... ముందు చూడగానే ఏదో మారిందని భావనాత్మకంగా అనిపించడానికి ఈ మెగా మార్పులు ఉపకరిస్తాయి. రేపు నిజంగా ప్రభుత్వ పాలనలోనూ ఈ మార్పు కనిపిస్తే మంచిదే. ఆ దిశలో ఇది తొలి అడుగు అవునో, కాదో కొద్దికాలమైతే గానీ తెలియదు. ఇప్పటికైతే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్షాలతో యుద్ధానికి సిద్ధమవుతున్న మోదీ సర్కారు కొత్త యోధులతో సిద్ధమైనట్టు కనిపిస్తోంది. -
వ్యాక్సినేషన్: కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ పాలసీలో ఎన్నో లోపాలున్నాయని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలకు వ్యాక్సిన్ విక్రయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వచ్చే డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తారా? అని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని.. కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్‌పై పునరాలోచించాలని తెలిపింది. అనంతరం కేంద్రం స్పందిస్తూ.. డిసెంబర్ 31 నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేస్తామని, ఫైజర్‌లాంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. సహేతుకంగా లేదు దేశ ప్రజలందరికీ ప్రభుత్వం ఎందుకు టీకా ఇవ్వకూడదంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కేవలం 45 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్లు అందించే బాధ్యత కేంద్రం తీసుకుందని, 18 నుంచి 44 ఏళ్ల వాళ్లకు టీకా ఇచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు వదిలేశారని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. వ్యాక్సిన్ల ధరలను కేంద్రానికి ఒక రేటు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రేటు , ప్రైవేటు ఆస్పత్రులకు మరో రేటు పెట్టడం వెనుక సహేతుక కారణం కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. కొవిడ్ బారిన యువత ఓవైపు 45 ఏళ్లు పైబడిన వారికే టీకాలు ఇవ్వడంపై కేంద్రం దృష్టి పెట్టిందని, మరోవైపు కరోనా సెకండ్ వేవ్‌లో 18 నుంచి 44 ఏళ్లలోపు వారే ఎక్కువగా కరోనా బారిన పడ్డారని కోర్టు పేర్కొంది. 45 ఏళ్లు పైబడిన వారికే కాకుండా అందరికీ టీకాలు ఇస్తే బాగుండేదంటూ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేంద్రం బాధ్యత లేదా వ్యాక్సిన్ల ధర నిర్ణయించే అధికారం తయారీ సంస్థలకే ఎందుకు వదిలేశారంటూ ప్రశ్నించింది సుప్రీం. వ్యాక్సిన్‌కు ఏకరూప ధరను నిర్ణయించే బాధ్యతను కేంద్రం ఎందుకు తీసుకోకూడదని అడిగింది. మరోవైపు కేంద్రం ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా గ్లోబల్ టెండర్లకు వెళ్లడం ఏంటని నిలదీసింది. రూరల్‌కి యాక్సెస్ ఉందా కొవిడ్ టీకా తీసుకోవాలంటే కోవిన్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని కేంద్రం చెబుతోంది. గ్రామీణ భారత్‌లో ఉన్న ప్రజలందరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉందా ? వారు కోవిన్ యాప్‌లో ద్వారా టీకా పొందడం సాధ్యమేనా అని ప్రశ్నించింది. ఇదే విషయం వలస కార్మికులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. -
డబుల్ మాస్క్‌పై కేంద్రం కీలక మార్గదర్శకాలు
-
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 2020 సంవత్సరానికి గానూ పద్మ విభూషణ్-7, పద్మభూషణ్-16, పద్మ శ్రీ- 118 ఇలా మొత్తంగా 141 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలు దక్కించుకున్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ.. సాంఘిక, ప్రజా వ్యవహారాలు, విజ్ఞానశాస్త్రం మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, ఔషధం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌర సేవా తదితర రంగాలలో ఈ అవార్డులు లభిస్తాయి. పద్మ విభూషణ్ అసాధారణమైన, ప్రత్యేకమైన సేవకు ప్రదానం చేస్తారు. పద్మభూషణ్ పండిత శ్రీకి, ఏ రంగంలో అయినా ప్రత్యేకమైన సేవ చేసిన వారికీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా అవార్డులు ప్రకటించబడతాయి. బీజేపీ అగ్ర నేతలైన అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్.. మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్‌లకు ప్రజా వ్యవహారాలకు సంబంధించిన రంగంలో ఈ పురస్కారాలు దక్కాయి. విజయ సారథి శ్రీభాష్యం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధుకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. మరో నలుగురు తెలుగు వారిని పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి.. చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయం), కరీంనగర్ జిల్లా వాసి, ప్రముఖ సంస్కృత పండితులు, కవి, విమర్శకులు విజయసారథి శ్రీభాష్యం (విద్య). ఆంధ్రప్రదేశ్ నుంచి ఎడ్ల గోపాలరావు (కళారంగం), దలవాయి చలపతిరావు( కళారంగం). అదేవిధంగా ఈ ఏడాది వాణిజ్యం, పరిశ్రమలు విభాగంలో ఇద్దరికి పద్మభూషన్ పురస్కారాలు లభించాయి. అందులో ఆనంద్ మహీంద్రా (మహారాష్ట్ర), వేణు శ్రీనివాసన్ (తమిళనాడు). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాంగ్రెస్‌తోనే కష్టాలు తీరుతాయి
దండేపల్లి(మంచిర్యాల) : మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తీరిపోతాయని ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. దండేపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని కాసిపేటలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రైతులకు ఎకరాకు రూ. 4వేల పంట పెట్టుబడి అని కొత్త నాటకం మొదలు పెట్టారన్నారు. అనంతరం టీఆర్ఎస్, టీడీడీపీ, బీజేపీలకు చెందిన సుమారు 500ల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రేంసాగర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొరుపుటాల మల్లేశ్, మహిళా అధ్యక్షురాలు శకుంతల, బీజేపీ మండల అ« ద్యక్షుడు బోడకుంట వెంకటేష్, టీఆర్ఎస్ నుం చి రైతు సమన్వయ సమితి సభ్యురాలు బొలి శెట్టి మల్లేశ్వరి, గంగయ్య, దేవేందర్‌తో పాటు వారి అనుచర వర్గాలు కాంగ్రెస్‌లో చేరారు. మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, గూడెం పీఏ సీఎస్ చైర్మన్ తోట లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అ«ధ్యక్షురాలు పడాల మాధవి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖలీద్, మాజీ ఎం పీపీలు శకుంతల, కాంతారావ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న చంద్రబాబు
చింతలపూడి : కార్పొరేట్ శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జన ఆవేదన సదస్సులో భాగంగా పీసీసీ కార్యదర్శి ఎం.ధామస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు తాపత్రయం అంతా తన పుత్రరత్నం లోకేష్ గురించేనన్నారు. లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మోడీ మెప్పు కోసం చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. తుందుర్రు ఘటనలో మహిళలను తీవ్రంగా కొట్టి పోలీసులతో ఈడ్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మహిళా మంత్రి పీతల సుజాత కనీసం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించకపోవడం అన్యాయమన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో లాభపడింది విజయ్ మాల్యా, అంబానీ, అదానీ లాంటి పారిశ్రామిక వేత్తలేనన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు పంచి గెలిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 20లోగా ప్రజా బ్యాలెట్‌ను పూర్తిచేసి పంపించాలని కోరారు. అనంతరం ఏలూరుచింతలపూడి ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమర్జహాబేగ్, కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్‌సెల్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. -
ఏపీ హక్కుల్ని కాలరాస్తున్న చంద్రబాబు
-
ట్రిబ్యునల్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు