ఎప్పుడూ దేశ బడ్జెట్, జీడీపీ, జీఎస్టీ అంటూ ఆర్ధిక అంశాల్లో ఊపిరి సలపని పనితో బిజీగా ఉండే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ మహిళగా మారారు. చెన్నైకి చెందిన ఓ వీధిలో కూరగాయలు కొంటూ స్థానికుల కంట పడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నై జిల్లా మైలాపూర్ దక్షిణ మాడ వీధిలో శనివారం సాయంత్రం నిర్మలా సీతారామన్ సందడి చేశారు. కేంద్ర మంత్రి హోదాను పక్కన పెట్టి సాధారణ గృహిణిగా కూరగాయాల్ని కొనుగోలు చేశారు. న్యూఢిల్లీకి బయలు దేరే ముందు ఇంట్లో వంటకు కావాల్సిన టర్కీ బెర్రీ (ఉస్తికాయలు), పిడి కరణై (కందగడ్డ), ములై కీరై (ఒక రకమైన ఉసిరికాయ), మనతక్కలి కీరై (పాల కూర)ను కొనుగోలు చేశారు.
During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors & local residents and also purchased vegetables. pic.twitter.com/emJlu81BRh
— NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022
కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో స్థానికులతో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగ్గారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశిస్తూ ‘వీధిల్లో కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో ఆమె సెక్యూరిటీని చూసి వ్యాపారులు కాస్త బయపడ్డారు. ఇక్కడికి వచ్చింది నిర్మలా సీతారామన్ అని తెలుసుకొని సంతోషించారని, స్థానికులు టీ తాగేందుకు పిలిచినట్లు బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ అన్నారు.
చదవండి👉 ‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్
Comments
Please login to add a commentAdd a comment