![Fieo Letter To Nirmala Sitharaman For Reduce Exports Gst - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/4/Nirmala%20Sitharaman.jpg.webp?itok=xE0Bphyf)
కోల్‌కతా: ఎగుమతుల రవాణా చార్జీలకు సంబంధించి సెప్టెంబర్ 30తో ముగిసిన జీఎస్‌టీ మినహాయింపును మళ్లీ పొడిగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్‌ఐఈవో కోరింది.
పొడిగించని పక్షంలో, వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో నిధులపరంగా తాము మరిన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. ఆర్థిక మంత్రికి ఎఫ్‌ఐఈవో ఈ మేరకు లేఖ రాసింది. 2018లో ఈ స్కీమును ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం ఇప్పటివరకూ రెండు సార్లు పొడిగించింది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగిసింది.
దీన్ని పొడిగించకపోతే ఎగుమతుల రవాణా చార్జీలపై ఎగుమతిదారులు 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎగుమతుల రవాణా రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో జీఎస్‌టీ విధిస్తే మరింత భారంగా మారుతుందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment