
సీబీఎస్ఈలోనూ వాళ్లదే పైచేయి!
అస్పష్టత వీడింది. కొద్దిరోజులుగా విద్యార్థులను గందరగోళానికి గురిచేసిన సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పదోతరగతి ఫలితాలు గురువారం మద్యాహ్నం ఎట్టకేలకు విడుదలయ్యాయి.
సీబీఎస్ఈ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 97.32 శాతం మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతంలో కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలదే పైచేయి అయ్యింది. అమ్మాయిలు 97.82 శాతం క్వాలిఫై కాగా, అబ్బాయిలు 96.98 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2014లో వచ్చిన ఫలితాల కంటే ఈసారి 1.55 శాతం తగ్గాయి. తిరువనంతపురం రీజియన్లో అత్యధికంగా 99.77 శాతం మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 13,73,853 మంది పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.37 శాతం ఎక్కువ.
ఫలితాలకోసం cbseresults.nic.in లేదా cbse.nic.in వెబ్సైట్లకు లాగిన్ కావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే.. ఎక్కువ మంది ఈ సైట్ కోసం ప్రయత్నిస్తుండటంతో వెబ్ సైట్ డౌన్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఎవరు ప్రయత్నించినా.. కనెక్షన్ ఫెయిల్డ్ అనో మరొకటో మెసేజ్ వస్తోందని గగ్గోలు పెడుతున్నారు.