ఓపెన్‌ స్కూల్ ఫలితాల విడుదల | open school result | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్ ఫలితాల విడుదల

Published Fri, Jun 2 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

open school result

  1. జిల్లాకు ఇంటర్‌లో మూడు, పదిలో 5వ స్థానాలు
  2. భానుగుడి(కాకినాడ): ఏపీ ఓపెన్‌ స్కూల్ సొసైటీ (ఆపాస్‌) ద్వారా పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు శుక్రవారం విడుదలయినట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ కొమ్మన జనార్దనరావు తెలిపారు. జిల్లాలో పదోతరగతికి సంబంధించి 7,355 మంది పరీక్షలు రాస్తే 4,690 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 63.77 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానంలో నిలిచిందన్నారు. ఇంటర్‌వీుడియట్‌లో 9,089 మంది పరీక్షలకు హాజరవగా 6,440 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. 70.85 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 3వ స్థానంలో నిలిచిందన్నారు. పదోతరగతి రీకౌంటింగ్‌కు రూ.100, ఇంటరీ్మడియట్‌ రీకౌంటింగ్‌కు రూ.200 చెల్లించాలని, రీవెరిఫికేషన్, ఫొటోస్టాట్‌ కాపీ ఇచ్చేం దుకు రూ.1000 ఏపీ ఆ¯ŒSలై¯ŒS ద్వారా ఈ నెల 5 నుంచి 15 లోగా చెల్లించాలని సూచించారు. సెప్టెంబరులో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు  పదోతరగతి సబ్జెక్టు ఒక్కింటికి రూ.100, ఇంటరీ్మడియట్‌ సబ్జెక్టు ఒక్కింటికి రూ.150, ఇంటరీ్మడియట్‌ ప్రాక్టికల్‌ పేపర్‌ ఒక్కింటికి రూ.100 చొప్పున  ఏపీ ఆ¯ŒSలై¯ŒS ద్వారా ఫీజులు చెల్లించే  జూలై 6నుంచి 20 వరకు చెల్లించవచ్చన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో ఓపెన్‌ స్కూల్ ద్వారా పదోతరగతిలో 34,362 మంది, ఇంటరీ్మడియట్‌లో 31,961 మంది ఉత్తీర్ణులైనట్లు డీఈవో ఎస్‌.అబ్రహం పేర్కొన్నారు.
    6 నుంచి 9 వరకు డీఈఈ సెట్‌ 
    భానుగుడి(కాకినాడ సిటీ) : డీఈఈ సెట్‌–2017 ఈ నెల 6 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌  ఎంట్ర¯Œ్స టెస్ట్‌గా(సిబెట్‌) నిర్వహించేందుకు ఏర్పాట్లు  చేసినట్లు  డీఈవో ఎస్‌.అబ్రహాం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు ’డీఈఈసీఈటీఏపీ.జీవోవీ.ఇ¯ŒS’ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్ల ఈనెల 1నుంచి పొందవచ్చన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల సూరంపాలెం, రాజమండ్రి శ్రీప్రకాష్‌ విద్యానికేతన్, రాజమండ్రి  సీఎస్‌ఆర్‌ ఆ¯ŒSలై¯ŒSఅకాడమీ, భట్లపాలెం బీవీసీ ఇ¯ŒSస్టిట్యూట్‌ఆఫ్‌  టెక్నాలజీ అండ్‌ సై¯Œ్స, రైట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, భూపాలపట్నం, రాజమండ్రి, బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాల ఓడలరేవులలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది 11582 మంది పరీక్ష రాస్తున్నారన్నారు. ఉదయం రాసే అభ్యర్థులు 9 గంటలకు, మధాహ్నం రాసే అభ్యర్థులు 1.30 గంటలకు పరీక్షా కేంద్రాల వద్ద హాజరవ్వాలన్నారు.   
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement