సాక్షి ,హైదరాబాద్ : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్‌స్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2.45లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
👉తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
- తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చాం
- 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుంది
- దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు ఇస్తాం
- 56 రోజుల్లో డీఎస్సీ విడుదల చేశాం
- మేం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం
- గత సర్కార్ విద్యా వ్యవస్థను నిర్విర్యం చేసింది
- 10ఏళ్లలో 7వేల టీచర్ పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారు
పోస్టుల వారీగా చూస్తే..
పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.
ఇక తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment