
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయ ఆవరణలో ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,63,546 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,55,635 మంది ఫస్టియర్ కాగా.. 5,07,911 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ‘టీఎస్‌బీఐఈ సర్వీసెస్’ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల వారీ ఫలితాలను తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి http://admi.tsbie.cgg.gov. in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
ఫలితాలకోసం
www.sakshi.com
www.sakshieducation.com
https://tsbie.cgg.gov.in
www.bie.telangana.gov.in
www.exam.bie.telangana.gov.in
http://results.cgg.gov.in
http://bie.tg.nic.in
http://examresults.ts.nic.in