91.4 శాతం మంది ఉత్తీర్ణత
అడ్మిషన్లకు జూలై 11న నోటిఫికేషన్
జూలై 17 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జూలై 25న సీట్ల అలాట్‌మెంట్
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గతనెల 22న నిర్వహించిన టీఎస్ ఐసెట్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల అయ్యాయి. కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 63,490 మంది ఐసెట్ రాయగా, అందులో 58,037మంది (91.41 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పురుషుల విభాగంలో 90.79 శాతం, మహిళల విభాగంలో 92,42 శాతం ఉత్తీర్ణులైనట్లు పాపిరెడ్డి వివరించారు.
ఐసెట్ షెడ్యూల్..: ఐసెట్ -2015 అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను జూలై 11న వెలువడుతుం దని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. జూలై 17నుంచి అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. జూలై 18నుంచి 22 వతేదీ వరకు అభ్యర్థులు అప్షన్లు ఇచ్చుకోవాలని, జూలై 25న సీట్ల అలాట్‌మెంట్ ఉంటుందన్నారు డబ్ల్యూడబ్ల్యూడబ్లూటీఐసెట్.ఓఆర్‌జీలో ఫలితాలు అందుబాటులో ఉంటాయని పాపిరెడ్డి వివరించారు. ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ మాట్లాడుతూ గతేడాది తెలంగాణలో ఎంబీఏలో 50 వేల సీట్లు, ఎంసీఏలో 15 వేల సీట్లు ఉన్నాయని వివరించారు. యూనివర్సిటీల పరిధిలో అఫ్లియేషన్ కలిగి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఎన్ని అనేది .. సీట్లు సంఖ్య కచ్చితంగా జులైలో ఇచ్చే అడ్మిషన్ల నోటిఫికేషన్ నాటికి ఉన్నత విద్యామండలి వెల్లడించనున్నదని ఆయన తెలిపారు.
యూనివర్సిటీల పరిధిలో ఐసెట్‌లో ఉత్తీర్ణత వివరాలు
పేరు ర్యాంక్ మార్కులు
కృష్ణచైతన్య కొల్లు, కృష్ణాజిల్లా 1 178
సీహెచ్ ఎన్.ఎ.చంద్ర, హైదరాబాద్ 2 162
పోకూరి రాఘవేంద్ర, రంగారెడ్డి 3 160
టీఎస్ ఐసెట్-15 పలితాలు విడుదల
Published Sat, Jun 6 2015 3:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM
Advertisement
Advertisement