న్యూఢిల్లీ: ఆయుష్ మందులు ఇకమీదట జెనరిక్ మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఆయుర్వేద మందులను ఆరోగ్యమంత్రిత్వ శఖ ఆధ్వర‍్యంలో నిర్వహించే జెనరిక్ మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ లోక్‌సభలో వెల్లడించారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖతో చర్చలు జరుపుతున్నట్టు అని శుక్రవారం లోక్‌సభకు అందించిన సమాచారంలో తెలిపారు.
పురాతన ఆయుర్వేద నాడీ వ్యాధి నిర్ధారణ కోర్సును కూడా వైద్య విద్య జాబితాలో చేర్చనున్నట్టు కూడా ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ఈ పురాతన నైపుణ్యాన్ని అందించే దిశగా ఆయుర్వేద కౌన్సిల్ తో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు.
అలాగే ప్రజారోగ్య కేంద్రాల్లోనూ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు కూడా ఉండనున్నారని ఇందుకు సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటికే "డేంజర్ జోన్" లోఉన్న ఔషధ మొక్కలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక జెనరిక్ షాపుల్లో ఆయుర్వేద మందులు
Published Fri, Mar 17 2017 7:52 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
Advertisement