Shripad Naik
-
రోడ్డు ప్రమాదం: కేంద్రమంత్రి భార్య మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కేంద్ర ఆయుష్, యునానీ, హోమియోపతి మంత్రి శ్రీపాద యశోనాయక్ కారు సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన భార్య విజయ నాయక్, వ్యక్తిగత సహాయకుడు(పీఏ) దీపక్ మృత్యువాత పడ్డారు. కేంద్ర మంత్రితో సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తర కన్నడ జిల్లాకు వచ్చిన శ్రీపాద యశోనాయక్ గోకర్ణ నుంచి గోవాకు తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న మంత్రి కారు అంకోలా తాలూకా హోసకంబి వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పల్టీ కొట్టింది. ఈ సమయంలో కారులో శ్రీపాద నాయక్, ఆయన భార్య, పీఏ దీపక్, అనుచరుడు సాయికిరణ్, గన్‌మ్యాన్, డ్రైవర్ ఉన్నారు. ప్రమాదంలో మంత్రి భార్య, పీఏ మృతిచెందారు. గాయపడిన మంత్రిని గోవాకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు ఫోన్ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీపాద నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మంత్రి భార్య, పీఏ మృతిచెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రిని గోవాకు తరలిస్తున్న దృశ్యం. ప్రమాదంలో ధ్వంసమైన కారు -
కరోనా : విషమంగా కేంద్రమంత్రి ఆరోగ్యం
పనాజీ : కరోనా బారిన పడిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత 10 రోజులుగా మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో వైద్యుల సూచనల మేరకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి గోవాకు ప్రత్యేక వైద్య బృందం పయనమైంది. ఈ మేరకు శ్రీపాద నాయక్ ఆరోగ్య పరిస్థితిపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ నెల 12వ తేదీన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. (భారత్‌లో ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్!) -
యోగా సీక్రెట్ చెప్పిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : యోగాను క్రమం తప్పకుండా అభ్యసించే వారికి కరోనా వైరస్ ముప్పు తక్కువని కేంద్ర ఆయూష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ, ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న యోగా కరోనాతో పోరాటం చేయటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యోగా దినోత్సవానికి విశేషమైన స్పందన వస్తోంది. ప్రజలందరూ ఇంట్లో ఉంటూనే యోగాను చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నట్లయితే 20 మంది కంటే ఎక్కువ ఉండరాదని స్పష్టం చేశాము. ( యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు: మోదీ) యోగాతో మన శరీరంలో జరిగే వాటిని నియంత్రించవచ్చు, ఆరోగ్యకర జీవితాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్యకర అలవాట్లను అలవర్చుకుంటూనే ఇంట్లో యోగా అభ్యసించాలనే దానిపై దృష్టి సారించాము. ఈ యోగా దినోత్సవం సందర్బంగా అందరూ ప్రతి రోజూ ఓ గంట పాటు యోగా చేసేందుకు ప్రతినబూనాలి’’ అని అన్నారు. -
ఇక జెనరిక్ షాపుల్లో ఆయుర్వేద మందులు
న్యూఢిల్లీ: ఆయుష్ మందులు ఇకమీదట జెనరిక్ మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఆయుర్వేద మందులను ఆరోగ్యమంత్రిత్వ శఖ ఆధ్వర్యంలో నిర్వహించే జెనరిక్ మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ లోక్‌సభలో వెల్లడించారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖతో చర్చలు జరుపుతున్నట్టు అని శుక్రవారం లోక్‌సభకు అందించిన సమాచారంలో తెలిపారు. పురాతన ఆయుర్వేద నాడీ వ్యాధి నిర్ధారణ కోర్సును కూడా వైద్య విద్య జాబితాలో చేర్చనున్నట్టు కూడా ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ఈ పురాతన నైపుణ్యాన్ని అందించే దిశగా ఆయుర్వేద కౌన్సిల్ తో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ప్రజారోగ్య కేంద్రాల్లోనూ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు కూడా ఉండనున్నారని ఇందుకు సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటికే "డేంజర్ జోన్" లోఉన్న ఔషధ మొక్కలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. -
'ఆ రోజు మీకు ఇష్టమైన దైవాన్నే తలుచుకోండి'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పాల్గొనే ముస్లింలు శ్లోకాలనే చదవాల్సిన అవసరం లేదని.. వారికి ఇష్టమైనా అల్లా నామాన్ని తలుచుకోవచ్చని గోవా మంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పారు. యోగా దినోత్సవం రోజు కుల మత భేదాలు లేకుండా అందరు పాల్గొనాలనే ఉద్దేశంతో, ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందులో నుంచి ఇప్పటికే సూర్య నమస్కారాన్ని పక్కకు పెట్టిన విషయం తెలిసిందే. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉన్నందున అందులో ముస్లింలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. యోగాలోని శ్లోకాలు తమ మత విశ్వాసాలకు విరుద్ధమైనవని, తమను అందులో పాల్గొనకుండా మినహాయింపు ఇవ్వాలని కొందరు ముస్లిం పెద్దలు ఆయనను కలవడంతో ఈ విషయం చెప్పారు. ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున అది ఎలాంటి వివాదం లేకుండా నిర్వహించాలని నిర్ణయించామని, అందుకు అనుకూలమైన సడలింపులు కూడా కేంద్రం కల్పించిందని సుష్మా స్వరాజ్ ప్రకటించారని, అందరినీ దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం సజావుగా జరగాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.