
పనాజీ : కరోనా బారిన పడిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత 10 రోజులుగా మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో వైద్యుల సూచనల మేరకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి గోవాకు ప్రత్యేక వైద్య బృందం పయనమైంది. ఈ మేరకు శ్రీపాద నాయక్ ఆరోగ్య పరిస్థితిపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ నెల 12వ తేదీన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. (భారత్‌లో ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్!)
Comments
Please login to add a commentAdd a comment