పనాజి : కరోనా కారణంగా గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సురేష్ అమోంకర్ (68) సోమవారం కన్నుమూశారు. జూన్ చివరి వారంలోనే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె దృవీకరించారు. కాగా గోవాలోని పాలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999లో సురేష్ అమోంకర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత మనోహర్ పారికర్ ప్రభుత్వంలో ఆరోగ్య, సాంఘీక సంక్షేమ, కార్మిక ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు. తదనంతరం 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సురేష్ అమోన్‌కర్ మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. (ఒక వ్యక్తి నుంచి 104 మందికి సోకిన కరోనా )
Deeply saddened to hear about the sad demise of former Health Minister & President of BJP Goa, Shri. Suresh Amonkar ji due to #COVID19
— VishwajitRane (@visrane) July 6, 2020
May God give his family the strength to overcome this tragic loss. My prayers are with his family & loved ones. May his soul rest in peace. pic.twitter.com/lv7co4mlNH
Comments
Please login to add a commentAdd a comment