vishwajit rane
-
ఘోరం: 4 గంటల్లో 26 మంది కరోనా రోగులు మృతి
పనాజి: పశ్చిమ తీర రాష్ట్రం గోవాలోని ప్రభుత్వ గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసిహెచ్)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రిలో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 26 మంది కరోనా రోగులు చనిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 2 నుండి 6 గంటల మధ్యలో ఈ దుర్ఘటన జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు. అయితే, ఈ ఘటనకు గల కారణాలపై స్పష్టత లేదని అన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ఆసుపత్రికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెళ్లారు. "మెడికల్ ఆక్సిజన్ లభ్యత, జీఎంసిహెచ్ లోని కోవిడ్-19 వార్డులకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో అవాంతరం ఏర్పడటం వల్ల రోగులకు కొన్ని సమస్యలను కలిగించి ఉండవచ్చు" అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మాత్రం ఆక్సిజన్ సరఫరా కొరత లేదు అని అన్నారు. కొన్ని సార్లు సిలిండర్లు సమయానికి చేరుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. గోవా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో వైద్య ఆక్సిజన్ సరఫరాలో కొరత ఉందని ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే సోమవారమే చెప్పారు. నిన్న ఆసుపత్రిలో 1,200 జంబో సిలిండర్లు అవసరం ఉండగా కేవలం 400 మాత్రమే సరఫరా చేయబడ్డాయి అని తెలిపారు. ఈ ఘటనపై హైకోర్టు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో కొరత ఉంటే, ఆ అంతరాన్ని ఎలా తగ్గించాలో చర్చ జరగాలి" అని రాణే అన్నారు. గోవా మెడికల్ కాలేజీ& హాస్పిటల్లో కోవిడ్ -19 చికిత్సను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ అధికారుల ముగ్గురు సభ్యుల బృందం ఈ సమస్యల గురించి ముఖ్యమంత్రికి తెలియజేయాలని మిస్టర్ రాణే అన్నారు. గోవాలో సోమవారం నాటికి 1,21,650 మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకు 1729 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. చదవండి: కోవిడ్-19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు అవసరం? -
కరోనా : మాజీ ఆరోగ్యశాఖ మంత్రి మృతి
పనాజి : కరోనా కారణంగా గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సురేష్ అమోంకర్ (68) సోమవారం కన్నుమూశారు. జూన్ చివరి వారంలోనే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె దృవీకరించారు. కాగా గోవాలోని పాలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999లో సురేష్ అమోంకర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత మనోహర్ పారికర్ ప్రభుత్వంలో ఆరోగ్య, సాంఘీక సంక్షేమ, కార్మిక ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు. తదనంతరం 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సురేష్ అమోన్కర్ మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. (ఒక వ్యక్తి నుంచి 104 మందికి సోకిన కరోనా ) Deeply saddened to hear about the sad demise of former Health Minister & President of BJP Goa, Shri. Suresh Amonkar ji due to #COVID19 May God give his family the strength to overcome this tragic loss. My prayers are with his family & loved ones. May his soul rest in peace. pic.twitter.com/lv7co4mlNH — VishwajitRane (@visrane) July 6, 2020 -
గోవాలో మొదటి కరోనా మరణం
పనాజి : గోవాలో మొదటి కరోనా మరణం చోటుచేసుకుంది. 85 ఏళ్ల వృద్ధుడు చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె తెలిపారు. దీంతో కరోనాతో రాష్ట్రంలో మొదటి మరణం చోటుచేసుకుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆయన సంతాపం ప్రకటించారు. అయితే మంత్రి విశ్వజిత్ అంతకుముందు చనిపోయిందని మహిళ అని తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేయగా, వెంటనే సరిదిద్దుకొని వృద్ధుడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠిన చర్యలు అమలుచేస్తున్నామని, ప్రతి జిల్లాలో ప్రత్యేక బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని తెలిపారు. (చైనాతో రెండు యుద్ధాలు : వెనక్కి తగ్గేది లేదు ) Deeply saddened to inform that a 85 year old man, from Morlem in Sattari, who had tested positive has succumbed to #COVID19 My heartfelt condolence to the family. This is the first COVID-19 death reported in the state. — VishwajitRane (@visrane) June 22, 2020 బాధితుడు గోవాలోని మోర్లెం గ్రామానికి చెందినవాడని అధికారులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరగా సోమవారం చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతుడు గత నాలుగేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 818 కరోనా కేసులు నమోదవగా, 683 యాక్టివ్ కేసులున్నాయి. (యూపీలో సుశాంత్ అభిమాని ఆత్మహత్య ) -
పరీకర్ పడకగదిలో ‘రఫేల్’ ఫైల్స్!
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఓ దస్త్రం అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పడక గదిలో ఉందని, ఆయన సహచర మంత్రి ఒకరు వ్యాఖ్యానిస్తున్న ఆడియోను కాంగ్రెస్ బయటపెట్టింది. అయితే ఈ వీడియో ఎంత వరకు నిజమో తెలియరాలేదు. ఓసారి కేబినెట్ సమావేశంలో పరీకర్ ఈమేరకు వ్యాఖ్యానించినట్లు గోవా మంత్రి విశ్వజిత్ రాణె గుర్తుతెలియని వ్యక్తితో అంటున్నట్లు ఆడియోలో ఉంది. రఫేల్ ఒప్పంద విషయమై మోదీని పరీకర్ బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఆడియో టేపులు అబద్ధం, కట్టుకథలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని సుప్రీంకోర్టే ఎండగట్టిందని, నిజాల్ని తారుమారు చేసేందుకు మరే మార్గం లేకపోవడంతో ఆ పార్టీ ఇలా నకిలీ ఆడియోల్ని విడుదలచేస్తోందని పరీకర్ దుయ్యబట్టారు. ఆడియోలో ఉన్నట్లుగా తానెప్పుడూ కేబినెట్ సమావేశంలోగానీ, మరే ఇతర సమావేశంలోగానీ చర్చించలేదని స్పష్టం చేశారు. ‘సీఎం పరీకర్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రఫేల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఆయన పడకగదిలోనే ఉందట. దీనర్థం.. ఏదో ఆశించే ఆయన ఆ సమాచారాన్నంతా తన వద్ద భద్రపరుచుకున్నారు’ అని రాణెను ఉటంకిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఈ ఆడియో కల్పితమని, దాని విడుదల వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాణె అమిత్ షాకు చెప్పారు. పరీకర్‌కు లైడిటెక్టర్ పరీక్షలు: గోవా కాంగ్రెస్ రఫేల్ ఒప్పంద ఫైల్‌ను గుర్తించడానికి పరీకర్ నివాసంపై సీబీఐతో సోదాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీకర్, ఆయన సహచరులకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కూడా కోరింది. ఈ ఆడియోను వెలుగులోకి తెచ్చిన వేగును గుర్తించి రక్షణ కల్పించాలని, దివంగత జడ్జి లోయా లాంటి పరిస్థితి ఎదురుకాకుండా, పరీకర్‌కు కూడా భద్రతను పెంచాలని గోవా కాంగ్రెస్ ప్రతినిధి సిద్ధాంత్ బుయావో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
‘ఆయన చేతుల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది’
పనాజీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని గోవా మంత్రి, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ నేత విశ్వజిత్ రాణే జోస్యం చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి అది జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన విశ్వజిత్ రాణే అనంతరం మార్చి 16న రాజీనామా చేసి బీజేపీలో చేరగా ఆయనకు కేబినెట్ హోదా ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్నారు. అయితే, త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని పేర్కొటూ కాంగ్రెస్ పార్టీ ముంబయి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ పై విధంగా అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో ఉండాలని ఏ ఒక్కరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా రాహుల్‌గాంధీలాంటి విఫలమైన వ్యక్తి నాయకత్వంలో. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలో తుడిచిపెట్టుకుపోతుంది’ అని ఆయన అన్నారు. కోర్టులో పిటిషన్‌పై స్పందిస్తూ తానేం తప్పు చేయలేదననే, ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశానని, మరోసారి ప్రజల తీర్పును తెలుసుకునేందుకు ఉప ఎన్నికల్లో వెళతానని అన్నారు. మనోహర్ పారికర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం కలిసికట్టుగా సాగుతోందని అన్నారు. -
త్వరలో టూ వీలర్ అంబులెన్స్‌లు
పనాజీ: త్వరలో టూ వీలర్ అంబులెన్స్‌లు రాబోతున్నాయి. గోవాకు చెందిన ఆరోగ్యశాఖ వీటిని ప్రవేశపెట్టబోతుంది. టూరిజం శాఖ సహకారంతో వీటిని జూలై నెల నుంచి ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే స్పష్టం చేశారు. పారామెడికోలు ఈ టూవీలర్ అంబులెన్స్‌లతో వస్తారని, రోడ్డు ప్రమాదాల చోటుకైనా మరే ఇతర ప్రమాదం జరిగిన సకాలంలో చేరుకొని సేవలు అందిస్తారని చెప్పారు. రోగికి ప్రాథమిక చికిత్స అందించి ప్రధాన చికిత్స పొందేవరకు ప్రాణాలు కాపాడగలిగేన్ని వస్తువులు ఈ టూవీలర్ అంబులెన్స్‌లో ఉంటాయని తెలిపారు. తమ రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ విషయం చెప్పారు. జూలై నెలలో ఉన్నపలంగా 22 టూబీలర్ అంబులెన్స్‌లను ప్రారంభించి సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. -
2019లో ఆ పార్టీకి 20 సీట్లకు మించిరావు
-
2019లో ఆ పార్టీకి 20 సీట్లకు మించిరావు
న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సిన్హ్ రాణె కొడుకు విశ్వజిత్ రాణె మరోసారి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ ప్రభావశీల, ఆమోదనీయ రాజకీయ నాయకుడు కాదని, 2019 జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 20 సీట్లకు మించి గెలవలేదని అన్నారు. 'కాంగ్రెస్‌లో పరిణతి లేని నాయకుడు రాహుల్ ఉన్నారు. రాష్ట్ర ప్రజల గురించి, వారిచ్చిన తీర్పు గురించి, ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆయన సీరియస్‌గా ఆలోచించరు. ఆయన కనీసం ఆమోదనీయ నాయకుడు కూడా కాదు. పార్టీ ఎదగాలంటే నాయకుడు శక్తిమంతంగా ఉండటం చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతమున్న 44 సీట్లు 20కు తగ్గుతాయి. రాహుల్ నాయకత్వంలో పార్టీకి దిశానిర్దేశం లేదు. 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే సత్తాగల నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ లేరు' అని విశ్వజిత్ రాణె అన్నారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అగ్రశ్రేణి నాయకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ రాణె రాజీనామా చేశారు. -
బీజేపీలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే
పణాజి : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె గురువారం కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండుల్కర్ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విశ్వజిత్ రేపు బీజేపీలో చేరబోతున్నారు. పార్టీలో చేరేందుకు ఆయన ఎలాంటి నిబంధనలు పెట్టలేదు’ అని తెలిపారు. విశ్వజిత్ రాణెను మంత్రివర్గంలోకి తీసుకుంటారా అని విలేకరుల ప్రశ్నకు వినయ్ టెండుల్కర్ సమాధానమిస్తూ ... అది ముఖ్యమంత్రి నిర్ణయమన్నారు. అలాగే విశ్వజిత్ రాణె కూడా తాను బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాగా ఇటీవలి జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో తీవ్ర అసంతృప్తి చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె.. కాంగ్రెస్ పార్టీతో పాటుగా, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐదు రోజులకే ఆయన రాజీనామా చేశారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ 13 సీట్లకే పరిమితం అయినా చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మనోహర్ పారికర్ గోవా సీఎం పీఠాన్ని అధిరోహించారు. -
గెలిచిన 5 రోజులకే రాజీనామా..!
పణాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె.. పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐదు రోజులకే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. గత అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. విశ్వజిత్ తండ్రి ప్రతాప్ రాణె గోవా ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పనిచేశారు. గురువారం గోవా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బలపరీక్షలో విశ్వజిత్ పాల్గొనలేదు. సభ నుంచి వాకౌట్ చేసిన విశ్వజిత్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాజా ఎన్నికల్లో వాల్పోయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విశ్వజిత్.. మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసి ప్రజాభిప్రాయాన్ని కోరుతానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పిన రాణె.. బీజేపీలో చేరే విషయాన్ని తోసిపుచ్చలేదు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రోహన్ కాంటె కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. గోవాలో అధికార బీజేపీ 13 సీట్లకే పరిమితం అయినా చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మనోహర్ పారికర్ సీఎంగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని రాణె నిందించారు. -
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు
-
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు
పణజి: ‘నితిన్ గడ్కరీ(బీజేపీ) ప్రభుత్వ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. మన సీనియర్ నాయకులు ఏం చేస్తున్నార’ని ప్రశిస్తూ గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినాయత్వం చేతగానితనాన్ని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ 17 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సభ్యుల్ని కూడగట్టడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, మరింత మంది పార్టీని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘గోవాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చాలా అవమానకర రీతిలో కాంగ్రెస్ హేండిల్ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నార’ని విశ్వజిత్ రాణె వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణె కుమారుడైన విశ్వజిత్ గత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అయితే పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎవరు పార్టీని వీడరని, రాణెతో మాట్లాడతామని చెప్పారు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చక్రం తిప్పడంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ కంటే బీజేపీ తక్కువ సీట్లు గెల్చుకున్నప్పటికీ గడ్కరీ రంగంలోకి పరిస్థితిని తమ పార్టీకి అనుకూలంగా మార్చేశారు. పరీకర్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే మద్దతు ఇస్తామన్న ఇతరుల కోరికను మన్నించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమైంది. దీనికి అనుగుణంగా పరీకర్ తో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయించి మళ్లీ గోవాకు తీసుకురావడంతో బీజేపీపై ఇతరులకు విశ్వాసం కలిగింది. అతిపెద్ద పార్టీగా ఏర్పడిన హస్తం పార్టీ మీనమేషాలు లెక్కించడంతో కమలం పార్టీ పదుదైన వ్యూహాలతో ముందుకు దూసుకుపోయింది. ఫలితంగా కాంగ్రెస్ లో అసంతృప్తి రాజుకుంది.