హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు | Goa: Congress MLA Vishwajit Rane quits party in disgust over post-result fiasco, slams inaction | Sakshi
Sakshi News home page

హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు

Published Tue, Mar 14 2017 8:56 AM | Last Updated on Tue, Aug 14 2018 5:49 PM

హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు - Sakshi

హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు

పణజి: ‘నితిన్ గడ్కరీ(బీజేపీ) ప్రభుత్వ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. మన సీనియర్ నాయకులు ఏం చేస్తున్నార’ని ప్రశిస్తూ గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినాయత్వం చేతగానితనాన్ని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ 17 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సభ్యుల్ని కూడగట్టడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, మరింత మంది పార్టీని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

‘గోవాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చాలా అవమానకర రీతిలో కాంగ్రెస్ హేండిల్ చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నార’ని విశ్వజిత్ రాణె వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణె కుమారుడైన విశ్వజిత్ గత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అయితే పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎవరు పార్టీని వీడరని, రాణెతో మాట్లాడతామని చెప్పారు.

బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చక్రం తిప్పడంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్‌ కంటే బీజేపీ తక్కువ సీట్లు గెల్చుకున్నప్పటికీ గడ్కరీ రంగంలోకి పరిస్థితిని తమ పార్టీకి అనుకూలంగా మార్చేశారు. పరీకర్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే మద్దతు ఇస్తామన్న ఇతరుల కోరికను మన్నించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమైంది. దీనికి అనుగుణంగా పరీకర్ తో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయించి మళ్లీ గోవాకు తీసుకురావడంతో బీజేపీపై ఇతరులకు విశ్వాసం కలిగింది. అతిపెద్ద పార్టీగా ఏర్పడిన హస్తం పార్టీ మీనమేషాలు లెక్కించడంతో కమలం పార్టీ పదుదైన వ్యూహాలతో ముందుకు దూసుకుపోయింది. ఫలితంగా కాంగ్రెస్‌ లో అసంతృప్తి రాజుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement