Goa Congress MLA
-
...గోవా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్
గోవా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్.. 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక -
బీజేపీలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే
పణాజి : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె గురువారం కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండుల్కర్ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విశ్వజిత్ రేపు బీజేపీలో చేరబోతున్నారు. పార్టీలో చేరేందుకు ఆయన ఎలాంటి నిబంధనలు పెట్టలేదు’ అని తెలిపారు. విశ్వజిత్ రాణెను మంత్రివర్గంలోకి తీసుకుంటారా అని విలేకరుల ప్రశ్నకు వినయ్ టెండుల్కర్ సమాధానమిస్తూ ... అది ముఖ్యమంత్రి నిర్ణయమన్నారు. అలాగే విశ్వజిత్ రాణె కూడా తాను బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాగా ఇటీవలి జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో తీవ్ర అసంతృప్తి చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె.. కాంగ్రెస్ పార్టీతో పాటుగా, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐదు రోజులకే ఆయన రాజీనామా చేశారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ 13 సీట్లకే పరిమితం అయినా చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మనోహర్ పారికర్ గోవా సీఎం పీఠాన్ని అధిరోహించారు. -
గెలిచిన 5 రోజులకే రాజీనామా..!
పణాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె.. పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐదు రోజులకే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. గత అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. విశ్వజిత్ తండ్రి ప్రతాప్ రాణె గోవా ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పనిచేశారు. గురువారం గోవా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బలపరీక్షలో విశ్వజిత్ పాల్గొనలేదు. సభ నుంచి వాకౌట్ చేసిన విశ్వజిత్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాజా ఎన్నికల్లో వాల్పోయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విశ్వజిత్.. మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసి ప్రజాభిప్రాయాన్ని కోరుతానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పిన రాణె.. బీజేపీలో చేరే విషయాన్ని తోసిపుచ్చలేదు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రోహన్ కాంటె కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. గోవాలో అధికార బీజేపీ 13 సీట్లకే పరిమితం అయినా చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మనోహర్ పారికర్ సీఎంగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని రాణె నిందించారు. -
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు
-
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు
పణజి: ‘నితిన్ గడ్కరీ(బీజేపీ) ప్రభుత్వ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు. మన సీనియర్ నాయకులు ఏం చేస్తున్నార’ని ప్రశిస్తూ గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినాయత్వం చేతగానితనాన్ని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ 17 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సభ్యుల్ని కూడగట్టడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, మరింత మంది పార్టీని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘గోవాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చాలా అవమానకర రీతిలో కాంగ్రెస్ హేండిల్ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నార’ని విశ్వజిత్ రాణె వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణె కుమారుడైన విశ్వజిత్ గత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అయితే పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎవరు పార్టీని వీడరని, రాణెతో మాట్లాడతామని చెప్పారు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చక్రం తిప్పడంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కమలం పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ కంటే బీజేపీ తక్కువ సీట్లు గెల్చుకున్నప్పటికీ గడ్కరీ రంగంలోకి పరిస్థితిని తమ పార్టీకి అనుకూలంగా మార్చేశారు. పరీకర్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే మద్దతు ఇస్తామన్న ఇతరుల కోరికను మన్నించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమైంది. దీనికి అనుగుణంగా పరీకర్ తో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయించి మళ్లీ గోవాకు తీసుకురావడంతో బీజేపీపై ఇతరులకు విశ్వాసం కలిగింది. అతిపెద్ద పార్టీగా ఏర్పడిన హస్తం పార్టీ మీనమేషాలు లెక్కించడంతో కమలం పార్టీ పదుదైన వ్యూహాలతో ముందుకు దూసుకుపోయింది. ఫలితంగా కాంగ్రెస్ లో అసంతృప్తి రాజుకుంది.