పనాజి : గోవాలో మొదటి కరోనా మరణం చోటుచేసుకుంది. 85 ఏళ్ల వృద్ధుడు చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె తెలిపారు. దీంతో కరోనాతో రాష్ట్రంలో మొదటి మరణం చోటుచేసుకుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆయన సంతాపం ప్రకటించారు. అయితే మంత్రి విశ్వజిత్ అంతకుముందు చనిపోయిందని మహిళ అని తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా, వెంటనే సరిదిద్దుకొని వృద్ధుడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠిన చర్యలు అమలుచేస్తున్నామని, ప్రతి జిల్లాలో ప్రత్యేక బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని తెలిపారు. (చైనాతో రెండు యుద్ధాలు : వెనక్కి తగ్గేది లేదు )
Deeply saddened to inform that a 85 year old man, from Morlem in Sattari, who had tested positive has succumbed to #COVID19
— VishwajitRane (@visrane) June 22, 2020
My heartfelt condolence to the family.
This is the first COVID-19 death reported in the state.
బాధితుడు గోవాలోని మోర్లెం గ్రామానికి చెందినవాడని అధికారులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరగా సోమవారం చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతుడు గత నాలుగేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ గ్రామాన్ని అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 818 కరోనా కేసులు నమోదవగా, 683 యాక్టివ్ కేసులున్నాయి. (యూపీలో సుశాంత్ అభిమాని ఆత్మహత్య )
Comments
Please login to add a commentAdd a comment