పనాజి: దేశంలో కరోనా విజృంభణ తక్కువగా ఉన్న గోవాలో బుధవారం ఒక్కరోజే పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. వాస్కోలోని మ్యాంగోర్ హిల్ కంటైన్‌మెంట్ జోన్‌లో తాజాగా 40 కరోనా కేసులు వెలుగు చూశాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. లోకల్ ట్రాన్స్‌మిషన్ ద్వారానే ఇంత మొత్తంలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా ఈ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కోవిడ్ లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. (ఆ రైలు ఇకపై ఇక్కడ ఆగదు: సీఎం)
అనంతరం వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు కుటుంబ సభ్యులకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో వారు నివసించే ప్రాంతాన్ని ప్రభుత్వం సోమవారం కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించింది. కోవిడ్ పరీక్షల నిమిత్తం ఆ ప్రాంతంలోని 200 మంది నమూనాలను సేకరించగా 40 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు అధికారులు వీరితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు ఆరా తీసే పనిలో పడ్డారు. కాగా గోవాలో మొత్తం 65 కేసులు నమోదవగా 57 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. (90 శాతం పేషెంట్లు వాళ్లే: గోవా సీఎం)
Comments
Please login to add a commentAdd a comment