న్యూఢిల్లీ : యోగాను క్రమం తప్పకుండా అభ్యసించే వారికి కరోనా వైరస్ ముప్పు తక్కువని కేంద్ర ఆయూష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ, ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న యోగా కరోనాతో పోరాటం చేయటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యోగా దినోత్సవానికి విశేషమైన స్పందన వస్తోంది. ప్రజలందరూ ఇంట్లో ఉంటూనే యోగాను చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో యోగా చేస్తున్నట్లయితే 20 మంది కంటే ఎక్కువ ఉండరాదని స్పష్టం చేశాము. ( యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు: మోదీ)
యోగాతో మన శరీరంలో జరిగే వాటిని నియంత్రించవచ్చు, ఆరోగ్యకర జీవితాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్యకర అలవాట్లను అలవర్చుకుంటూనే ఇంట్లో యోగా అభ్యసించాలనే దానిపై దృష్టి సారించాము. ఈ యోగా దినోత్సవం సందర్బంగా అందరూ ప్రతి రోజూ ఓ గంట పాటు యోగా చేసేందుకు ప్రతినబూనాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment