బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లాడారు. నిర్మాతగా, నటుడిగా జాకీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో బ్యానర్‌ను నడుపుతున్నారు. ఇటీవల ఈ బ్యానర్‌లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన పూజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్‌ను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ముంబయిలోని ఏడంతస్తుల పూజా ఎంటర్‌టైన్‌మెంట్ కార్యాలయాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది.
దీంతో ఈ నిర్మాణ సంస్థకు దాదాపు రూ.250 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. అందువల్లే జాకీ భగ్నానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ముంబయిలోని ఓ ప్రముఖ బిల్డర్‌కు ఈ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మకానికి ఒక్క రోజు ముందే జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ పలువురు సిబ్బంది ఆరోపించారు.
అయితే కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వైఫల్యాలే అమ్మకానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జీతాలు ఇవ్వలేక దాదాపు 80 శాతం సిబ్బందిని తొలగించి.. తాత్కాలికంగా జుహులోని ఫ్లాట్‌కు కార్యాలయాన్ని తరలించారని ఓ నివేదిక వెల్లడించింది. కాగా.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను 1986లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌లో కూలీ నెం.1, బీవీ నెం.1, రంగేజ్, షాదీ నెం.1, జవానీ జానేమాన్ లాంటి చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్‌లో చివరిసారిగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment