ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కేదార్‌నాథ్ యాత్రలో వ్యాపారుల నిలువు దోపిడీకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు కేదార్‌నాథ్ మార్గంలో ట్రాఫిక్ జామ్ పెద్ద సమస్యగా పరిణమించింది.
వైరల్ అయిన ఆ వీడియోలో ఓ వ్యక్తి కేదార్‌నాథ్‌లోని ఆహార పదార్థాల ధరలను తెలియజేశాడు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో వివిధ వస్తువులు, ఆహార పదార్థాల ధరలు అధికంగానే ఉంటాయి. అయితే చార్‌ధామ్ యాత్ర సందర్భంగా ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచేయడం భక్తులకు భారంగా మారింది. సాధారణ రోజులలో రూ. 10కి దొరికే టీ రూ. 30కి, రూ. 20కి లభించే వాటర్ బాటిల్ రూ. 100కు విక్రయిస్తున్నారు. అలాగే కాఫీ ధరను రూ. 50కి పెంచేశారు. శీతల పానీయాల ధరలను కూడా విపరీతంగా పెంచారు. ఇతర ఆహార పదార్థాల ధరలను కూడా రెట్టింపు చేశారు.
ఈ వీడియోలో వ్యాపారులను వివిధ వస్తువుల ధరలను అడిగిన ఆ వ్యక్తి వాటి ధరలు ఎందుకు పెరిగాయో కూడా తెలిపాడు. ఆయా వస్తువులను కింది నుంచి పైకి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు అధికమవుతున్నాయని తెలిపాడు. అయితే వైష్ణోదేవి యాత్రలో ఇంత భారీ ఖర్చులు ఉండవని కూడా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment