
భూములు, స్థలాల విలువలు అడ్డగోలుగా పెరిగిపోయాయి. కనీసం వంద గజాల ఇంటి స్థలం కొనాలన్నా.. లక్షలకు లక్షలు కావాల్సిందే. కానీ ఒక చోట మాత్రం ఇంటి స్థలాన్ని చదరపు మీటర్‌కు ఎనిమిది రూపాయల లోపు ధరకే అమ్ముతున్నారు. అంటే రూ.800 పెడితే చాలు.. ఇంటి స్థలం వచ్చేస్తుందన్న మాట. కాకపోతే అలా కొనుక్కోవడానికి మనం స్వీడన్ దాకా వెళ్లాల్సి వస్తుంది మరి. స్వీడన్‌లోని గోటెన్ నగర అధికారులు ఇలా ఇళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టారు. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌కు 321 కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంటుంది.
పాపులేషన్ తగ్గడం, ఆర్థిక సమస్యలతో..
స్వీడన్‌లోని రూరల్ ప్రాంతమైన గోటెన్ సిటీలో సుమారు 13 వేల మంది నివసిస్తుంటారు. ఇటీవల అక్కడ పాపులేషన్ తగ్గడానికి తోడు సిటీకి కాస్త ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీనితో హౌజింగ్ మార్కెట్‌కు డిమాండ్ పెంచడం కోసం అతి తక్కువ ధరకే ఇళ్ల స్థలా లను అమ్మకానికి పెట్టినట్టు గోటెన్ సిటీ మేయర్ జోహన్ మాన్సన్ ప్రకటించారు. ఒక చదరపు మీటరుకు ఒక క్రోనా రేటుతో.. మన కరెన్సీలో రూ.7.86 రేటుతో 29 ప్లాట్లను విక్రయించనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment