భార్యను పోర్న్ ఫిల్మ్మేకర్స్కు అమ్మేశాడు | Bihar man sells wife to porn filmmaker over non payment of dowry | Sakshi
Sakshi News home page

భార్యను పోర్న్ ఫిల్మ్మేకర్స్కు అమ్మేశాడు

Published Wed, Feb 17 2016 9:11 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

భార్యను పోర్న్ ఫిల్మ్మేకర్స్కు అమ్మేశాడు - Sakshi

భార్యను పోర్న్ ఫిల్మ్మేకర్స్కు అమ్మేశాడు

పట్నా: బిహార్లో దారుణం చోటుచేసుకుంది. చేతిలో చేయి వేసి నూరేళ్లు తోడుగా ఉంటానని అందరిముందు దైవ సాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమెను నిలువునా మోసం చేశాడు. పరాయి మగాడు వెంటపడితే దండించి తన భార్యకు తండ్రిలాగా అండగా నిలవాల్సిన ఆ భర్త.. సభ్యసమాజం సిగ్గుపడేలా తన భార్యను వేరొకరి చేతిలో పెట్టేందుకు సిద్ధపడ్డాడు. అది కూడా నీలి చిత్రాలు తీసే వాళ్ల చేతుల్లో. పెళ్లయి కనీసం నెలన్నర కూడా గడువక ముందే సంతలో వస్తువులా అమాయకురాలైన తన భార్యను రూ.7లక్షలకు పోర్న్ వీడియోలు తీసేవారికి అమ్మేశాడు. అదృష్టవశాత్తు ఆమె తన తోటికోడలు ద్వారా ఈ విషయం తెలుసుకొని పరుగుపరుగున రాత్రికి రాత్రే ప్రాణాలు అరచేతబట్టుకొని తన ఇంటికి చేరుకుంది.

పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్లోని సరాన్ జిల్లాకు చెందిన తరయా అనే గ్రామంలో రితాదేవీ(పేరు మార్చాం)కి అదే రాష్ట్రానికి చెంది హర్యానాలోని పాటికారా అనే గ్రామంలో స్థిరపడిన టికు పాటికర్ అనే వ్యక్తికి వివాహం చేశారు. అది కూడా ఈ ఏడాది జనవరి 8న వారి ఊర్లోని ఆలయంలో సాంప్రదాయ బద్ధంగా ఈ వివాహం జరిగింది. అనంతరం ఆమెను కాపురానికి హర్యానా పంపించారు. అయితే, ఆమె కాపురానికి వెళినప్పటి నుంచి ఆ కుటుంబం రాచిరంపాన పెట్టడం ప్రారంభించారు. రూపాయి కట్నం కూడా తీసుకురాలేదంటూ కొట్టడం మొదలుపెట్టారు. రూ.2లక్షల కట్నం, ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇప్పించాలని కోరామని ఇప్పటి వరకు వాటిని ఆమె కుటుంబం ఇవ్వలేకపోయిందంటూ చిత్రహింసలు పెట్టసాగారు.

వాటన్నింటి ఆమె ఎంతో సహనంతో భరిస్తూ వచ్చింది. కానీ, ఇటీవల ఆమెకు గుండెలో దడపుట్టించే వార్త తెలిసింది. ఆమెను తన భర్త పరాయివాళ్లకు అమ్మేశాడని, వారు కూడా నీలి చిత్రాలు తీసేవాళ్లకు అని తెలిసింది. తెల్లారితే ఆమెను వాళ్లు తీసుకెళతారని తెలియడంతో రాత్రికి రాత్రే తన గ్రామానికి చేరుకుంది. జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement