భర్త.. భార్య.. ఆడీ కారు మాయం | Bihar doctor, wife and their Audi go missing | Sakshi
Sakshi News home page

భర్త.. భార్య.. ఆడీ కారు మాయం

Published Mon, May 4 2015 1:00 PM | Last Updated on Thu, Jul 18 2019 2:07 PM

భర్త.. భార్య.. ఆడీ కారు మాయం - Sakshi

భర్త.. భార్య.. ఆడీ కారు మాయం

బీహార్: వివాహానికి వెళ్లొస్తున్న దంపతులతోపాటు, వారు ప్రయాణించిన కారుతో సహా కనిపించకుండా పోయారు. వారిని నేరస్థులు ఎత్తుకెళ్లారో.. మావోయిస్టులు బందీలుగా తీసుకెళ్లారోనని పోలీసులు తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గయలో పంకజ్ గుప్తా అనే వ్యక్తి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడు తన భార్య శుబ్రా గుప్తాతో కలిసి శుక్రవారం వివాహానికి వెళ్లొస్తూ కనిపించకుండా పోయారు. ఇప్పటి వరకు వారి జాడ తెలియలేదు. అయితే, వీరు పెద్ద పారిశ్రామిక వేత్తల కుటుంబానికి చెందిన వారట.

వీరు ప్రయాణించిన మార్గంలో మావోయిస్టులతోపాటు దొంగల బెడద కూడా చాలా ఎక్కువని వారు ఒక వేళ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారేమోనని ప్రత్యేక బృందాలతో కలసి గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోయింది. వీరు కనిపించకుండా పోయిన గంట ముందువరకు కూడా వారు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారట. పోలీసులు ఎన్ని రోజుల్లో వారి జాడ కనిపెడతారో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement