
బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ అదృశ్యమయ్యారు. సీతామర్హిలో మే 20న జరిగిన ఐదో విడత పోలింగ్‌లో ఈ మహిళా కానిస్టేబుల్‌కు విధులను కేటాయించారు. అయితే ఆమె ఆయుధంతో పాటు అదృశ్యమయ్యారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ ఉదంతంపై స్థానిక పోలీసుశాఖలో చర్చలు జరుగుతున్నాయి.
మహిళా కానిస్టేబుల్ సుభంతి కుమారి ఘాటో పోలీస్ స్టేషన్‌లోని డయల్ 112లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు సీతామర్హిలో ఎన్నికల విధులలో కొన్ని భాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పరారయ్యారు. ఆమె మొబైల్ ఫోన్ కంటిన్యూగా స్విచ్ ఆఫ్ చేసి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ విషయమై సీతామర్హి ఎస్పీ సమస్తిపూర్ ఎస్పీకి లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి సమాచారం లేకుండా అదృశ్యమైన ఈ మహిళా కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజా సమాచారం ప్రకారం ఈ మహిళా కానిస్టేబుల్ సమస్తిపూర్ పోలీస్ సెంటర్‌లో తన దగ్గరున్న ఆయుధాన్ని సమర్పించారు. ఉన్నతాధికారులు ఈ మహిళా కానిస్టేబుల్‌పై చర్యలు చేపట్టనున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment