పెళ్లి చేసుకొని.. రూ. 50 వేలకు అమ్మేశాడు | 14-year-old girl forcibly married, then sold as maid | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకొని.. రూ. 50 వేలకు అమ్మేశాడు

Published Thu, Jul 28 2016 10:26 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

పెళ్లి చేసుకొని.. రూ. 50 వేలకు అమ్మేశాడు

పెళ్లి చేసుకొని.. రూ. 50 వేలకు అమ్మేశాడు

ముంబై: ముంబైలో ఓ 14 ఏళ్ల బాలిక దీనపరిస్థితిలో పోలీస్స్టేషన్కు చేరింది. తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి.. మంచి జాబ్ అని నమ్మించి ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకొచ్చి.. ఓ మహిళకు రూ. 50 వేలకు అమ్మేశాడని ఫిర్యాదు చేసింది. ఇంట్లో పనికోసం తనను కొనుగోలు చేసిన మహిళ దాడికి పాల్పడుతోందని వాపోయింది. అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో పోలీసుల చెంతకు చేరినట్లు తెలిపింది.

ప్రాధమిక విచారణలో బాలికను ఉత్తర ప్రదేశ్లోని బెనారస్కు చెందినట్లు గుర్తించారు. అక్కడి ఓ అనాధశరణాలయం నుంచి తీసుకొచ్చి తనను పెళ్లి చేసుకున్నాడని.. అయితే పెళ్లి ఢిల్లీలో జరిగిందా లేక ముంబైలో జరిగిందా అనే విషయం కూడా తనకు తెలియదని బాలిక వెల్లడించింది. భర్త తనను కొట్టేవాడని వాపోయింది. బాలిక వెల్లడించిన వివరాల ఆధారంగా బాలల అక్రమరవాణా కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని జాయింట్ కమిషనర్ దేవన్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement