లక‍్నో: పచ్చని పందిళ్లు, మేలతాళాలు, వేదమంత్రాలు, బంధువుల చిరునవ్వులు, ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకునే కుటుంబ సభ్యుల హడావిడి మధ్య పెళ్లిమండపానికి సిగ్గు పడుతూ వస్తోంది వధువు. ఇదంతా చెబుతుంటే ఎవరిదో వివాహం అని అర్థమవుతోంది కదా..! కానీ ఇది మీరు పురాణాల్లో తప్పా మరెక్కడా చూడని పెళ్లి. భక్తితో పరమ శివున్నే వివాహం చేసుకున్నది ఓ యువతి.. ఏంటో ఈ కథ తెలుసుకుందాం పదండి..
మంచి వరుడు కావాలని ప్రతి యువతి కలలు కంటుంది. ఏ దుర్గునాలు లేని వాడితో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడతారు. అయితే.. మనుషుల్లో అలాంటివారు ఉండరనుకుందో ఏమో? కానీ ఓ యువతి ఏకంగా ముక్కంటినే వివాహం చేసుకుంది. పరమేశ్వరుని మీద భక్తితో శివలింగాన్నే వరునిగా భావించి మనువాడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
శివుని సేవలోనే..
ఝాన్సీలో అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి తన తల్లిదండ్రులతో జీవిస్తోంది. వారి కుటుంబమంతా చాలా ఏళ్లుగా బ్రహ్మకుమారి సంస్థతో అనుసంధానమై ఉన్నారు. అనునిత్యం శివుడి సేవలో ఉన్న యువతి.. అపారమైన భక్తి విశ్వాసాలను పెంచుకుంది. దీంతో శివుడినే వివాహమాడుతానని తల్లిదండ్రులకు తెలిపింది. వారు కూడా అందుకు అంగీకరించడంతో యువతి అభీష్టం నెరవేరింది.
నెలరోజుల ముందే..
పెళ్లికి నెలరోజుల ముందే వారి కుటుంబమంతా అన్ని ఏర్పాట్లు చేసింది. పెళ్లిమండపాలు వెయించడం, బంధువులకు పత్రికలు పంచడం, పెళ్లి బట్టలు ఖరీదు చేయడం ఇలా అన్నీ పనులు మనుషుల పెళ్లికి చేసినట్లు చేశారు. మేలతాళాల చప్పుళ్లతో బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ విభిన్నమైన వివాహాన్ని చూడటానికి చుట్టపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తికనబరిచారు.
ఇదీ చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక..
Comments
Please login to add a commentAdd a comment