ప్రేమకు హద్దులు లేవని చెబుతుంటారు. ఈ విషయాన్ని యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక యువకుడు రుజువు చేశాడు. సుఖ్‌జీత్ అనే ఈ యువకుడు నాలుగేళ్ల పాటు దక్షిణ కొరియాలో ఉద్యోగం చేశాడు. కాఫీషాపులో పనిచేస్తున్న సమయంలో అతను ఒక యువతి ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలితో మాట్లాడేందుకు దక్షిణ కొరియా బాషను నాలుగు నెలల్లో నేర్చుకున్నాడు. నాలుగేళ్ల తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారిద్దిరి ప్రేమ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది.
మీడియాకు అందిన సమచారం ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన కిమ్ బోహ్‌నీ అనే యువతి యూపీలోని పువాయా తహసీల్‌లోని ఒక గ్రామానికి చెందిన యువకుని సరసన వధువుగా మారింది. వరుడు సుఖజీత్ సింగ్ తండ్రి బల్‌దేవ్‌సింగ్ రైతు. అతని తల్లి హర్‌జిందర్ కౌర్ గృహిణి. సుఖజీత్ సింగ్ తమ్ముడు జగజీత్‌సింగ్ పొలంలో పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు.
28 ఏళ్ల సుఖజీత్ సింగ్ నాలుగేళ్ల క్రితం ఉద్యోగవేటలో దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడి బుసాన్‌లోని ఒక కాఫీషాప్‌లో పనికి కుదిరాడు. అదే కాఫీషాప్‌లోని బిల్లింగ్ సెషన్‌లో దక్షిణకొరియాకు చెందిన 30 ఏళ్ల కిమ్ బోహ్ నీ పనిచేస్తోంది. సుఖజీత్ తెలిపిన వివరాల ప్రకారం కాఫీషాపులోనే వారి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే వారి ప్రేమకు భాష అడ్డంకిగా మారింది. దీంతో సుఖజీత్ నాలుగు నెలల్లో అక్కడి భాష నేర్చుకున్నాడు. అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో నాలుగేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారు.
అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగు నెలల క్రితమే సుఖజీత్ సింగ్ తన ఇంటికి వచ్చాడు. రెండు నెలల క్రితం కిమ్ కూడా తన డిల్లీ స్నేహితురాలితో పాటు మూడు నెలల టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది. ఆగస్టు 18న వారిద్దరూ పువాయాలోని గురుద్వారా నానక్ బాగ్‌లో వివాహం చేసుకున్నారు.
సుఖజీత్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య మూడు నెలల క్రితం భారత్ వచ్చిందని, ఆమె తమ గ్రామంలో ఉంటూ రెండు నెలలు అయ్యిందని తెలిపారు. ఇంకొక నెల రోజుల తరువాత ఆమె దక్షిణ కొరియా వెళ్లిపోతుందని, నెల రోజుల తరువాత తిరిగి భారత్ వస్తుందని, అప్పుడు తామిద్దం తిరిగి దక్షిణ కొరియా వెళ్లేలా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో మన ఇంజినీర్లు చేసే 12 పనులివే..
Comments
Please login to add a commentAdd a comment