Shahjahanpur
-
బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమరవీరులు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వీరేకాదు షాజహాన్‌పూర్ చీమలు కూడా బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు యుద్ధం చేసి, విజయం సాధించాయి. ఈ ఘటన ‘1857 సిపాయిల తిరుగుబాటు’ సమయంలో జరిగింది. చీమల దండు జరిపిన దాడి కారణంగా బ్రిటీషర్లు షాజహాన్పూర్లో స్థాపించిన కేరు అండ్ కంపెనీని మూసివేయవలసి వచ్చింది. చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా రచించిన ‘షాజహాన్‌పూర్ కా ఇతిహాస్ 1857’ పుస్తకంలోని వివరాల ప్రకారం బ్రిటీష్ వారు 1805లో కాన్పూర్‌లో కేరు అండ్ కంపెనీని తొలిసారిగా స్థాపించారు. దానిలో క్రిస్టల్ షుగర్, స్పిరిట్, రమ్ తయారు చేసేవారు. ఈ ఉత్పత్తులను యూరప్‌కు ఎగుమతి చేసేవారు. కాన్పూర్‌లో ఈ వ్యాపారం విజయవంతం కావడంతో బ్రిటీషర్లు 1811లో షాజహాన్‌పూర్‌లోని రామగంగా సమీపంలో మరో యూనిట్ ఏర్పాటు చేశారు. 1834లో బ్రిటీషర్లు.. రౌసర్ కోఠి వద్ద మరో యూనిట్‌ను స్థాపించారు. షాజహాన్‌పూర్‌లోని రౌజర్ కోఠి ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో చెరకు సాగయ్యేది. దీనికితోడు గర్రా, ఖన్నాత్ నదుల నుండి వాణిజ్యానికి నౌకాయాన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండేవి. 1857లో విప్లవ తిరుగుబాటు సమయంలో విప్లవకారులు ఫ్యాక్టరీని కొల్లగొట్టి, తగలబెట్టారని డాక్టర్ వికాస్ ఖురానా తెలిపారు. ఈ నేపధ్యంలో కంపెనీ యజమాని జీబీ కెరు ఇక్కడ నుండి తప్పించుకొని మిథౌలీ రాజు సహాయంతో లక్నోకు తరలివెళ్లిపోయాడు. అక్కడ అతను హత్యకు గురయ్యాడు. తిరుగుబాటు ఆందోళనల తర్వాత ఫ్యాక్టరీ పునఃప్రారంభించారు. వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. అయితే ఆ సమయంలో చీమలు ఆ కంపెనీపై దాడి చేశాయని చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా, సాహితీవేత్త సుశీల్ తెలిపారు చెప్పారు. కాగా చీమలను తరిమికొట్టేందుకు కంపెనీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. అయితే ఆ ప్రయత్నాలు వృథాగా మారాయి. చివరికి బ్రిటీషర్లు కెరుగంజ్లో కంపెనీ పనులను నిలిపివేయవలసి వచ్చింది. కాగా కంపెనీ ఇక్కడ భారీ మార్కెట్‌ను సృష్టించిందని డాక్టర్ ఖురానా తెలిపారు. నేటికీ షాజహాన్‌పూర్‌లోని కెరుగంజ్ మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. సుదూర ప్రాంతాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి, వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
కాఫీ షాప్‌లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం!
ప్రేమకు హద్దులు లేవని చెబుతుంటారు. ఈ విషయాన్ని యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక యువకుడు రుజువు చేశాడు. సుఖ్జీత్ అనే ఈ యువకుడు నాలుగేళ్ల పాటు దక్షిణ కొరియాలో ఉద్యోగం చేశాడు. కాఫీషాపులో పనిచేస్తున్న సమయంలో అతను ఒక యువతి ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలితో మాట్లాడేందుకు దక్షిణ కొరియా బాషను నాలుగు నెలల్లో నేర్చుకున్నాడు. నాలుగేళ్ల తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారిద్దిరి ప్రేమ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. మీడియాకు అందిన సమచారం ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన కిమ్ బోహ్నీ అనే యువతి యూపీలోని పువాయా తహసీల్‌లోని ఒక గ్రామానికి చెందిన యువకుని సరసన వధువుగా మారింది. వరుడు సుఖజీత్ సింగ్ తండ్రి బల్దేవ్సింగ్ రైతు. అతని తల్లి హర్జిందర్ కౌర్ గృహిణి. సుఖజీత్ సింగ్ తమ్ముడు జగజీత్‌సింగ్ పొలంలో పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు. 28 ఏళ్ల సుఖజీత్ సింగ్ నాలుగేళ్ల క్రితం ఉద్యోగవేటలో దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడి బుసాన్‌లోని ఒక కాఫీషాప్‌లో పనికి కుదిరాడు. అదే కాఫీషాప్లోని బిల్లింగ్ సెషన్లో దక్షిణకొరియాకు చెందిన 30 ఏళ్ల కిమ్ బోహ్ నీ పనిచేస్తోంది. సుఖజీత్ తెలిపిన వివరాల ప్రకారం కాఫీషాపులోనే వారి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే వారి ప్రేమకు భాష అడ్డంకిగా మారింది. దీంతో సుఖజీత్ నాలుగు నెలల్లో అక్కడి భాష నేర్చుకున్నాడు. అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో నాలుగేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగు నెలల క్రితమే సుఖజీత్ సింగ్ తన ఇంటికి వచ్చాడు. రెండు నెలల క్రితం కిమ్ కూడా తన డిల్లీ స్నేహితురాలితో పాటు మూడు నెలల టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది. ఆగస్టు 18న వారిద్దరూ పువాయాలోని గురుద్వారా నానక్ బాగ్‌లో వివాహం చేసుకున్నారు. సుఖజీత్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య మూడు నెలల క్రితం భారత్ వచ్చిందని, ఆమె తమ గ్రామంలో ఉంటూ రెండు నెలలు అయ్యిందని తెలిపారు. ఇంకొక నెల రోజుల తరువాత ఆమె దక్షిణ కొరియా వెళ్లిపోతుందని, నెల రోజుల తరువాత తిరిగి భారత్ వస్తుందని, అప్పుడు తామిద్దం తిరిగి దక్షిణ కొరియా వెళ్లేలా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో మన ఇంజినీర్లు చేసే 12 పనులివే.. -
ఆంజనేయాలయం కోసం భూదానం చేసిన ముస్లిం
షాజహాన్‌పూర్(యూపీ): ఆంజనేయ ఆలయ నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి భూదానం చేసి మతసామరస్యాన్ని చాటాడు. ఢిల్లీ–లక్నో 24వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు కచియానా ఖేరి గ్రామంలో హనుమాన్ ఆలయం అడ్డంకిగా మారింది. విషయం తెలుసుకున్న స్థానికుడు బాబూ అలీ తన 0.65 హెక్టార్ల భూమిలో కొత్త ఆలయం నిర్మించుకోండంటూ భూమిని దానం చేశాడు. దీంతో రోడ్డపై ఆలయాన్ని పడగొట్టి అలీకి చెందిన స్థలంలో పునర్నిర్మించనున్నారని అదనపు జిల్లా మేజిస్ట్రేట్(పరిపాలన) రామ్‌సేవక్ ద్వివేది బుధవారం చెప్పారు. ఈ మేరకు భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిందని తిల్హార్ డెప్యూటీ జిల్లా మహిళా మేజిస్ట్రేట్ రాశీ కృష్ణ వెల్లడించారు. హిందూ – ముస్లిం ఐక్యతను అలీ మరోసారి చాటిచెప్పారని రాశీ పొగిడారు. ఇదీ చదవండి: మా లక్ష్మణరేఖ తెలుసు -
కుంతీపుత్రుడు: 27 ఏళ్ల తర్వాత కన్నతల్లిని చేరుకుని..
తన తప్పు లేకుండా జన్మించిన బిడ్డను నీట వదిలేసింది ఆనాటి కుంతీ. కామాంధుడి దాహార్తికి పుట్టిన బిడ్డను విధివశాత్తూ వదిలించుకుంది ఈనాటి కుంతీ. కానీ, ఆనాటి కర్ణుడిలా ఈ అభివన కర్ణుడు ఊరుకోలేదు. 27 ఏళ్ల తర్వాత తన తల్లి ఆచూకీ వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ఏం చేశాడో ఈ వాస్తవ గాథ చదివితే తెలుస్తుంది. సుమారు 27 ఏళ్ల కిందట.. ఉత్తర ప్రదేశ్ బరేలీలో ఘోరం జరిగింది. తన సోదరి ఇంట్లో ఉంటున్న మైనర్‌ను.. బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అన్నదమ్ములు. అది ఒక్కసారి కాదు.. పలుమార్లు. నిందితులిద్దరూ ఆమె కుటుంబానికి పరిచయస్తులే. పైగా బయటకు విషయం చెబితే చంపుతామని బెదిరించారు కూడా. ఈలోగా ఆ మైనర్ గర్భం దాల్చడం.. ప్రాణంమీదకు రావడంతో ఆమె బిడ్డను కనడం జరిగిపోయాయి. దత్తత మీద ఆమె కుటుంబం బిడ్డను వదిలించుకుని.. రాంపూర్‌కు వలస వెళ్లింది. అప్పుడామె వయసు 12 ఏళ్లు. కొన్నేళ్లకు ఆమెకు వివాహం కాగా.. ఆమె అత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి పదేళ్ల తర్వాత ఆ భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. దీంతో.. ఆ మానని గాయంతో అలా ఒంటరిగానే మిగిలిపోయింది. ► కాలం గిర్రున తిరిగింది. ఆ దత్తపుత్రుడికి తాను ఉన్నచోటు తనది కాదని తెలిసింది. తన కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించాడు. 2021 మొదట్లో.. ఎట్టకేలకు ఆ బిడ్డ తన తల్లిని కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరో చెప్పాలని నిలదీశాడు. ఆమె తెలిసీతెలియని వయసులో తనకు జరిగిన అన్యాయం గురించి కొడుకు వద్ద ఏకరువు పెట్టుకుంది. దీంతో రగిలిపోయిన ఆ కొడుకు.. పోరాటానికి ఆమెను సిద్ధం చేశాడు. షాహ్‌జహాన్‌పూర్ పీఎస్‌కు వెళ్లి 1994లో తన తల్లిపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేశాడు. మూడు దశాబ్డాల కిందటి ఘటన కావడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఫిర్యాదు తీసుకోవడానికి తటపటాయించారు. అయితే.. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు కేసు నమోదు అయ్యింది. ► 2021, మార్చ్ 4వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ లోపు బాధితురాలి న్యాయం చేసేందుకు ప్రత్యేక బృందం ఈ కేసు విచారణ చేపట్టింది. చాలా ఏళ్ల కిందటి కేసు కావడం.. నిందితుల పేర్లూ పూర్తిగా తెలియకపోవడంతో దర్యాప్తునకు ఆటంకంగా మారింది. పైగా వాళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ, చిన్నవయసులోనే ఆ తల్లి అనుభవించిన క్షోభను పోలీసులు అర్థం చేసుకున్నారు. ఎస్సై ధర్మేంద్ర కుమార్ గుప్తా దగ్గరుండి విచారణ చేశారు. నిందితులు ఇద్దరూ అదే నగరంలో హద్దాఫ్ ప్రాంతంలో ఉంటున్నారని గుర్తించారు. ► అయితే విచారణ కోసం వెళ్లిన పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలెవరో తమకు తెలియదని ఆ అన్నదమ్ములు బుకాయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. జులై 2021న శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించారు. కానీ, ఫలితం రావడానికి ‘9 నెలల’ టైం పట్టింది. అందులో మొహమ్మద్ రాజీ ఆ బిడ్డకు తండ్రిగా తేలాడు. దీంతో పోలీసులు అరెస్ట్ వారెంట్‌తో నిందితుల ఇళ్లకు వెళ్లారు. అయితే.. ► అప్పటికే తమ బండారం బయటపడుతుందని భావించి.. నిందితులిద్దరూ పరారయ్యారు. పోలీసులు ఊరుకుంటారా?.. బృందాలను ఏర్పాటు చేయించి వాళ్లిద్దరి కోసం గాలింపు చేపట్టారు. సర్వేయిలెన్స్ టీం ఈ కేసులో కీలకంగా వ్యవహరించింది. ఎట్టకేలకు రాజీని హైదరాబాద్‌లో కనిపెట్టి.. మంగళవారం నాడు అరెస్ట్ చేసింది. అసలు ఆ ఉదంతం మళ్లీ తన ముందుకు వస్తుందని తాను ఊహించలేదని నిందితుడు చెప్తున్నాడు. మరో నిందితుడు ఒడిశాలో ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు.. అక్కడికి బృందాలను పంపారు. తల్లిని వెతుక్కుంటూ వెళ్లడమే కాదు.. ఆమెకు జరిగినదానికి ఆలస్యమైనా న్యాయం జరిగింది. A case that will increase respect for @Uppolice Accused was hiding in Hyderabad since his DNA sample was taken.. UP: Born out of rape, son finds mother after 27 years, helps nab accused https://t.co/qm2lRK4eeG pic.twitter.com/wuD8zbSLNr — Kanwardeep singh (@KanwardeepsTOI) August 4, 2022 -
పెళ్లి బారాత్‌లో పైసల లొల్లి.. ఇజ్జత్ తీసిండ్రు.. ఇక నేనుండ!
లక్నో: పెళ్లి బారాత్‌లో జాంజాం అని వెళ్లిన నూతన వరుడు అక్కడున్నవారందరికీ షాకిచ్చాడు. తన మాట కాదంటారా? అంటూ కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో జరిగింది. ఇంతకూ విషయం ఏంటంటే.. ధర్మేంద్ర అనే వ్యక్తి పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. కార్యక్రమంలో భాగంగా కంపిల్ నుంచి మీర్జాపూర్‌కు బ్యాండ్ మేళంతో బారాత్ చేరుకుంది. బ్యాండ్ బృందం వరుడి తరపువారిని సంభావన ఇవ్వాలని అడిగారు. అయితే, వధువు తరపువారే ఆ మొత్తం చెల్లించాలని.. అదే ఆనవాయితీ అని వరుడి తరపువారు స్పష్టం చేశారు. కానీ, ఇందుకు పెళ్లి కూతురు తరపువారు ససేమిరా అన్నారు. దీంతో పది మందిలో తన పరువుపోయిందని కొత్త పెళ్లికొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మెడలో ఉన్న పూలదండను నేలకేసి కొట్టి.. ఎవరు చెప్పినా వినకుండా పెళ్లి పందిట్లోంచి వెళ్లిపోయాడు. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగి వివాదం మరింత ముదిరింది. పెళ్లి ఆగిపోవడంపై పరస్పరం తమకు ఫిర్యాదులు అందాయని మీర్జాపూర్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్‌కుమార్ సింగ్ ఓ వార్త సంస్థకు తెలిపారు. చదవండి👇 బెంగుళూరు ప్రధాని పర్యటన.. బీబీఎంపీ ఖర్చు రూ.23 కోట్లు అమెరికాలో కాల్పులు.. నల్గొండ వాసి కన్నుమూత -
పీపీఈ కిట్‌లో వచ్చినా ఫలితం దక్కలేదు
షాజహాన్‌పూర్: నగరానికి చెందిన వైద్యరాజ్ కిషన్ సంయుక్త వికాస్ పార్టీ తరఫున షాజహాన్‌పూర్ నియోజకవర్గానికి ఈనెల 25న నామినేషన్ వేశారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? కరోనా వ్యాప్తి నిరోధానికి వాడే పీపీఈ కిట్ తొడుక్కొని, శానిటైజర్ బాటిల్, థర్మల్స్కానర్తో వచ్చి ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. దీంతో కుప్పకూలిన వైద్యరాజ్ ఇది అధికారుల కుట్రని విమర్శించారు. మంత్రి సురేశ్ ఖన్నా సూచనల మేరకే అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని వాపోయారు. అయితే అసంపూర్ణ డాక్యుమెంట్లు సమర్పించినందునే ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ రోజే అడిగిన పత్రాలు ఇస్తానన్నా అధికారులు వినిపించుకోలేదని, మరుసటి రోజు వారు కోరిన పేపర్లను సమర్పించానని వైద్యరాజ్ చెప్పారు. కానీ కావాల్సిన పేపర్లను సమర్పించాలని వైద్యరాజ్కు మూడు నోటీసులు ఇచ్చినా స్పందిచలేదని, అందుకే తిరస్కరించామని అధికారులు వివరించారు. ఇంతవరకు వైద్యరాజ్ 18 ఎన్నికల్లో పోటీచేసి దిగ్విజయంగా డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయారు. వైద్యరాజ్ ఎవరో తనకు తెలియదని, తానెవరి నామినేషన్ తిరస్కరించమని చెప్పలేదని మంత్రి సురేశ్ వివరణ ఇచ్చారు. యోగిపై పోటీకి కూడా నామినేషన్ వేస్తానని వైద్యరాజ్ గతంలో ప్రకటించారు. -
వైరల్: 17 నిమిషాల్లో పెళ్లి.. కట్నంగా ఏం కోరాడంటే
లక్నో: మన సమాజంలో వివాహ వేడుకను ఎంత ఘనంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా తమ తమ స్థోమతలకు తగ్గట్టుగా పెళ్లి వేడుక నిర్వహిస్తారు. ఇక ముఖ్యంగా పెళ్లి తంతు ఎంత లేదన్న కనీసం గంటకు పైగానే సాగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్ షాజహన్‌పూర్‌లో జరిగిన పెళ్లి వేడుక గురించి చదివితే తప్పకుండా ఆశ్చర్యపోతారు. కేవలం 17 నిమిషాల్లో పెళ్లి తంతు ముగిస్తే.. ఇక కట్నంగా ఆ వరుడు ఏం కోరాడో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ పెళ్లి కుమారుడు రామాయణ గ్రంథాన్ని ఇవ్వమని కోరాడు. అది కూడా తన బావ మరుదులకు ఇష్టమైతేనే. ఈ పెళ్లి వేడుక గురించి తెలిసిన వారంతా ఈ కాలంలో కూడా ఇంత మంచి వారు ఉంటారా అని ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. షాజహన్‌పూర్‌కు చెందిన పుష్పేంద్ర దూబేకు స్థానికంగా ఉన్న ప్రీతి తివారితో వివాహం నిశ్చమయ్యింది. అసలే కోవిడ్ కాలం. ఎక్కువ మంది బంధువులను పిలవడానికి వీల్లేదు. ఇక పుష్పేంద్రకు కూడా ఇలాంటి హంగు ఆర్భాటాల మీద ఆసక్తి లేదు. ఊరేగింపు, కారు లాంటి అట్టహసాలు లేకుండా పెళ్లి కుమార్తె, మరి కొందరు అతిథులను తీసుకుని పట్నా దేవి కాళి ఆలయానికి వెళ్లాడు. అది కూడా నడుచుకుంటూ. ఆ తర్వాత ఆలయం చుట్టూ 7 సార్లు ప్రదిక్షణ చేసి వధువు మెడలో తాళి కట్టాడు. పెళ్లి ఇంత సింపుల్‌గా చేసుకున్న ఆ వ్యక్తి... ఇక కట్నంగా రామాయణం గ్రంథాన్ని ఇవ్వమన్నాడు. అది కూడా బావమరుదులుకు అంగీకరమైతేనే. ఈ సందర్భంగా నూతన దంపతులు పుష్పేంద్ర-ప్రీతి మాట్లాడుతూ.. ‘‘వరకట్నం అనే మహమ్మారి వల్ల ఎందరో మహిళల జీవితాలు నాశనం అవుతున్నాయి. అందుకే మేం కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని చూసి మరికొందరైనా మారితే ఎంతో సంతోషిస్తాం’’ అన్నారు. ఈ దంపతులు చేసిన పనిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. చదవండి: విచిత్ర సంఘటన.. డ్రైవర్‌గా మారిన పెళ్లికొడుకు -
బెయిల్‌పై వచ్చి ఘనంగా బర్త్‌డే
లక్నో: లైంగికదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ మంగళవారం బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం షాజహాన్‌పూర్‌లోని ముముస్కు ఆశ్రమంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. వందలాది మంది ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ మందిరానికి పాటుపడ్డవారిపై ఆయన ప్రశంసలు కురిపించారు. అయోధ్యలో శ్రీరాములవారి గుడి నిర్మాణం కోసం పాటుపడ్డవారందరినీ యోధులుగా అభివర్ణించారు. వారివల్లే నేడు ఆలయ నిర్మాణం కల సాకారమవుతోందన్నారు. మంగళవారం సాయంత్రం రామాయణంలోని సుందరకాండ అధ్యాయాన్ని పారాయణంతో బర్త్‌డే వేడుకలు ప్రారంభించినట్లు ఆశ్రమ అధికారులు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్శకులకు ప్రత్యేక ప్రసాదాలు అందజేశామన్నారు. మరోవైపు చిన్మయానందకు బెయిల్ ఇవ్వడంపై వచ్చిన అభ్యంతరాలను బుధవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. (రేప్ కేసులో చిన్మయానంద అరెస్ట్) ఇద్దరి అరెస్టు, బాధితురాలి విడుదల ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో లా కాలేజీలో అడ్మిషన్ రావడానికి సహకరించిన చిన్మయానంద్.. తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. అంతేకాక పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, తనతో మసాజ్ చేయించుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో సిట్బృందం సెప్టెంబర్ 20న చిన్మయానందను అరెస్టు చేసింది. ఇదిలావుండగా అత్యాచారం కేసులో బాధితురాలైన న్యాయ విద్యార్థిని డబ్బులు గుంజేందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఫిర్యాదు మేరకు సిట్ ఆమెపై కూడా కేసు నమోదు చేసి బాధితురాలిని అరెస్ట్ చేయగా డిసెంబర్ 4న విడుదల చేశారు. (చిన్మయానంద కేసులో కొత్త ట్విస్ట్.. విద్యార్థిని అరెస్ట్) చదవండి: ‘సిట్ ఆయనను రక్షించే ప్రయత్నం చేస్తోంది!’ (స్వామి చిన్మయానంద్‌కు బెయిల్) -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
షహజాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాతపడ్డారు. షహజాన్‌పూర్‌లోని జమ్కా క్రాసింగ్స్ వద్ద మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఎస్పీ దినేశ్ త్రిపాఠి తెలిపారు. అధిక వేగంతో వస్తున్న ట్రక్ మొదట టెంపోను ఢీకొట్టి, తర్వాత పక్కనే ఉన్న వ్యాన్‌ను సైతం ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రక్కు తిరగబడి వ్యాన్‌పై పడింది. ఈ రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో 16 మంది ఘటనాస్థలిలోనే ప్రాణాలుకోల్పోయారు. మరొక మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదం అనంతరం ట్రక్ క్లీనర్ పోలీసులకు చిక్కగా, డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. మరణించివారి కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామని స్పష్టంచేశారు. -
దారుణం : కొడుకు శవంతో
లక్నో : ప్రభుత్వాలు ఎన్ని మారినా, నాయకులు ఎంతమంది వచ్చినా పేదల బతుకులు మాత్రం మారడం లేదనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం. డబ్బుల్లేక, ఆసుపత్రి వర్గాలు అంబులెన్స్ ఇవ్వక ఓ మహిళ తన కుమారుడి శవాన్ని భుజాలపై మోసుకుంటు వెళ్లిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాహజాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు కండిషన్ సీరియస్‌గా ఉందని ఇతర ఆసుపత్రికి రిఫర్ చేశారని ఆ చిన్నారి తండ్రి తెలిపారు. అయితే తమ దగ్గర చిల్లి గవ్వలేకపోవడంతో అంబులెన్స్ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కాళ్లవేలా ప్రాధేయపడ్డామని, అయినా వారు కనికరించలేదన్నారు. దీంతో చేసేదేంలేక తన కొడుకును భుజాలపై వేసుకుని నడక సాగించామన్నారు. ‘నా భుజాలపై ఉన్న నా బిడ్డ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు’ అని మృతుడి తల్లి కన్నీటి పర్యంతమైంది. ఆసుపత్రివారు అంబులెన్స్ ఇచ్చి ఉంటే తన కొడుకు బతికేవాడని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆసుపత్రి ముందు మూడు అంబులెన్స్‌లు పార్క్ చేసి ఉన్నాయని, అయినా తమకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదన్నారు. ఇక ఆసుపత్రి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాయి. మెడికల్ అధికారి అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ చిన్నారి పేరు అఫ్రోజ్, అతన్ని రాత్రి 8.10 గంటలకు ఆసుపత్రి తీసుకొచ్చారు. అప్పటికే అతన్ని పరిస్థితి చాలా విషమంగా ఉంది. మేం వెంటనే లక్నోకు తీసుకెళ్లి చికిత్స అందించమని చెప్పాం. వారు మా ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్తామని చెప్పి ఆ పిల్లాడిని తీసుకువెళ్లారు. ఇప్పుడు అనవసర ఆరోపణలు చేస్తున్నారు’ అని తెలిపారు. -
‘పాప శరీరంలో దెయ్యం ఉంది’
లక్నో : శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా.. అంతరిక్షంలోకి వెళ్లినా మన సమాజంలో పాతుకుపోయిన కొన్ని ముఢనమ్మకాలను మాత్రం తొలగించలేకపోతున్నాం. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా భూత వైద్యులను, బాబాలను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే పనికిమాలిన సలహాల ప్రకారం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి సంఘటనే ఒకటి షాజహాన్ పూర్లో చోటు చేసుకుంది. నెలల పసికందుకు జబ్బు చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాల్సింది పోయి భూతవైద్యున్ని కలిశారు తల్లిదండ్రులు. అతడు కాస్తా పాప శరీరంలో చెడు ఆత్మ ఉంది. దాని వల్ల మీ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని చెప్పాడు. పాపను వదిలించుకోకపోతే ప్రాణ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించాడు. దాంతో ఊరి దగ్గర ఉన్న చెరువులో పాపను పడేసేందుకు నిశ్చయించుకున్నాడు కసాయి తండ్రి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ లోపు అక్కడికి చేరుకోవడంతో చిన్నారిని సురక్షితంగా కాపాడారు. అనంతరం పాప తండ్రితో పాటు, మాంత్రికున్ని కూడా అరెస్ట్ చేశారు. -
కామాంధుడితో కాంప్రమైజ్..!
షాజహాన్‌పూర్ : అఘాయిత్యం జరిగింది మహాప్రభో న్యాయం చేయండని వేడుకున్న ఓ మహిళను రక్షకభటులు చిన్నచూపు చూశారు. కేసు నమోదు చేయకపోగా.. రేప్ చేసిన కామాంధుడితో కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బాధితురాలు పోలీస్ స్టేషన్లోనే ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్త రామ్‌వీర్ తెలిపిన వివరాలు.. షాజహాన్పూర్లో నివాసముండే సుశీల (పేరు మార్చాం)పై అదే గ్రామానికి చెందిన వినయ్‌కుమార్ అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిందితుడికి అనుకూలంగా మాట్లాడారు. కేసు నమోదు చేయలేమనీ, వినయ్‌కుమార్‌తో కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి తెచ్చారు. పోలీసుల వ్యవహారంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన సుశీల వారి ఎదుటే బుధవారం (ఆగస్టు 29) ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని సుశీల భర్త తెలిపారు. కాగా, ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. స్టేషన్ ఇన్చార్జి సుభాష్‌కుమార్‌తో సహా ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. నిందితుడు వినయ్‌కుమార్‌ను అరెస్టు చేశామని ఎస్పీ ఎస్ఎన్.చినప్ప తెలిపారు. -
యూపీలో మరో అకృత్యం
సాక్షి, షహజహన్‌పూర్ : ఉత్తర్ ప్రదేశ్‌లో మరె దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద నడుకుచుంటూ వెళుతున్న యువతిని నలుగురు యువకులు కారులో కిడ్నాప్ చేసి.. ఆపై చెరుకుతోటలో సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని షహజహన్‌పూర్‌లో జరిగింది. స్థానిక రోజా ప్రాంతంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. నలుగురు యువకులు బలవంతంగా కార్లోకి ఎక్కించుని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు 20 ఏళ్ల యువతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈఘటనపై పోలీస్ స్టేషన్ ఇన్చార్జీ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. యువతి పెట్టిన కేసును రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. బాధితురాలు అరోపించిన వ్యక్తుల్లో షారుఖ్, నసీరుద్దీన్, అరుణ్, మరో వ్యక్తిపై కేసును పెట్టినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. ‘బాధితురాలి తండ్రి ఓ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనను రేప్ చేశారని ఆరోపిస్తూ బాధితురాలు నలుగురిపై ఫిర్యాదు చేయగా.. వారంతా ఆమె తండ్రి చేసిన హత్య కేసులో సాక్షులుగా ఉన్నారు. బాధితురాల్ని వైద్యపరీక్షల నిమిత్తం పంపిన పోలీసులు, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. -
తల్లి గర్భంలోనే తలనొదిలేశారు!
లక్నో: ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. ప్రసవం కోసం వచ్చిన ఓ నిండు చూలాలి గర్భం నుంచి శిశువును భద్రంగా బయటకు తీయడంలో నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా శిశువు బాడీ మాత్రమే బయటకు వచ్చింది. తల మాత్రం తల్లి గర్భంలో ఉండిపోయింది. జరిగిన పొరపాటును గ్రహించిన డాక్టర్లు ఆ తల్లి పట్ల మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తల్లి గర్భాశయంలో చిక్కుకుపోయిన శిశువు తలను వెలికి తీయడానికి ప్రయత్నించకుండా మరో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చారు. ఫలితంగా శిశువుతోపాటు తల్లి ప్రాణమూ పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం నాడీ సంఘటన జరిగింది. 32 ఏళ్ల గీతాదేవీ శనివారం రాత్రి ప్రసవ వేదనతో షాజహాన్ పూర్ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. అంతంత మాత్రంగానే సౌకర్యాలున్న ఆ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కూడా తోడడవడంతో శిశువు ప్రాణాలు పోయాయి. గర్భ సంచిలో ఇరుక్కుపోయిన శిశువు తలను వెలికి తీసి తల్లి ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు, సరైన సౌకర్యాలు లేవన్న సాకుతో గీతాదేవి భర్త హేమంత్‌ను పిలిచి మరో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. హేమంత్ తన భార్యను సమీపంలోని బెరైల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు తల్లి గర్భం నుంచి శిశువు తలను బయటకు తీయగలిగారు. అయితే తల్లి ప్రాణాలను మాత్రం కాపాడలేక పోయారు. సకాలంలో శిశువు తలను బయటకు తీసి ఉన్నట్టయితే ఆమె ప్రాణం పోయేది కాదని అక్కడి డాక్టర్లు చెప్పారు. గీతాదేవీది సంక్లిష్టమైన డెలివరని, అలాంటి డెలివెరికి షాజహాన్ పూర్ ప్రభుత్వాస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న షాజహాన్ పూర్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ కేజీ యాదవ్ తెలిపారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు తల గర్భాశయంలో చిక్కుకు పోయిందని అన్నారు. అందుకు ఎవరు బాధ్యులో కనుక్కొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తల్లీ, శిశువుల మరణంపై జిల్లా కలెక్టర్ శుభ్రా సక్సేనా తీవ్రంగా స్పందించారు. ఇది డాక్టర్ల నిర్లక్ష్యానికి సంబంధించిన తీవ్రమైన కేసని, దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అన్యాయంగా తల్లీ, బిడ్డలను పొట్టన పెట్టుకున్నారని, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ దారుణం జరిగిందని ఆ అభాగ్యురాలి భర్త హేమంత్ కూడా ఆరోపిస్తున్నాడు. -
చెల్లి తల నరికి.. ఊరేగించారు
లక్నో: పరువు హత్యతో ఉత్తర ప్రదేశ్‌లోని షాహజాన్ పూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తమ కుటుంబం పరువుకు భంగం కలిగించిందనే కోపంతో తోడబుట్టిన చెల్లిని.... ఇద్దరు సోదరులు క్రూరంగా నరికి చంపేశారు. అంతేకాకుండా నరికిన తలతో వారిద్దరూ వీధుల్లో అరుచుకుంటూ బీభత్సం సృష్టించారు. బహమనీ పంచాయతీ పరిధిలోని పరౌరా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ...ఫూల్ జెహాన్(17) బాలిక, మహమ్మద్ అచ్చన్‌ను ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం తెలిసి వరుసకు సోదరులు అయిన గుల్ హసన్, నాన్హే మియాన్ ఆగ్రహానికి లోనయ్యారు. అందరూ చూస్తుండగానే గ్రామ నడివీధిలో ఫూల్ జెహాన్ తలను అతి దారుణంగా నరికేశారు. తరువాత మొండాన్ని అక్కడే వదిలేసి, తెగిపడిన తల భాగాన్ని పట్టుకొని వీధుల్లో అరుచుకుంటూ తిరిగారు. తమ కుటుంబాల్లో ఇంకెవ్వరూ ఇటువంటి పరువు తక్కువ పని చేయరాదంటూ హెచ్చరించారు. తమ చర్య అమ్మాయిలందరికీ గుణపాఠం కావాలంటూ వారిద్దరూ ఉన్మాదంతో ఊగిపోయారు. తాము సరైన శిక్ష విధించామంటూ ఆవేశంతో రెచ్చిపోతూ ఊరంతా కలియదిరిగారు. క్రైమ్ సినిమాలను తలపించే ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు.అయితే ఇంత దారుణం జరుగుతున్నా స్థానిక పోలీసులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా ప్రేమికుడు అచ్చన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎనిమిది మంది సోదరులు ఉన్న కుటుంబంలో ఫూల్ జెహాన్ ఒక్కతే ఆడపిల్ల. ఆరుగురు ఢిల్లీలో నివసిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటన తరువాత బాలిక తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. అయితే నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బబ్లూ కుమార్ తెలిపారు. గ్రామంలోఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక బలగాలను తరలించినట్లు చెప్పారు. -
ఐదు గంటలపాటు నగ్నంగా ఊరేగించారు
షాజహాన్‌పూర్ : ఉత్తరప్రదేశ్ తో కులం రక్కసి మరోసారి పడగవిప్పింది. షాజహాన్‌పూర్ జిల్లా హరేవా ప్రాంతంలో అయిదుగురు దళిత మహిళలను నగ్నంగా ఊరేగించారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... తమ అమ్మాయి దళిత యువకుడితో వెళ్లిపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన వెనుకబడిన వర్గానికి చెందిన గ్రామస్తులు మంగళవారం ఉదయం దళిత మహిళలపై విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ వారిని ఇళ్లల్లోంచి బయటకు లాక్కొచ్చారు. చెప్పులతో కొట్టారు.. నడివీధికి తీసుకొచ్చి ఘోరంగా అవమానించారు. ఒంటిపై ఉన్న దుస్తులను లాగేసి విసిరిపారేశారు. ఆ తర్వాత ప్రధాన రహదారిపై ఊరేగించారు. దాదాపు అయిదు గంటలపాటు ఈ అమానుషకాండ కొనసాగింది. ఇంత జరుగుతున్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. కొందరు గ్రామస్తుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు గ్రామంలో మకాం వేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అమ్మాయి తండ్రితో సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించారు. మరోవైపు దీనిపై రాజకీయ పార్టీలు స్పందించాయి. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్నాయి.