సాక్షి, షహజహన్‌పూర్ : ఉత్తర్ ప్రదేశ్‌లో మరె దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద నడుకుచుంటూ వెళుతున్న యువతిని నలుగురు యువకులు కారులో కిడ్నాప్ చేసి.. ఆపై చెరుకుతోటలో సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని షహజహన్‌పూర్‌లో జరిగింది. స్థానిక రోజా ప్రాంతంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. నలుగురు యువకులు బలవంతంగా కార్లోకి ఎక్కించుని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు 20 ఏళ్ల యువతి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.
ఈఘటనపై పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జీ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. యువతి పెట్టిన కేసును రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. బాధితురాలు అరోపించిన వ్యక్తుల్లో షారుఖ్, నసీరుద్దీన్, అరుణ్, మరో వ్యక్తిపై కేసును పెట్టినట్లు ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా.. ‘బాధితురాలి తండ్రి ఓ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనను రేప్ చేశారని ఆరోపిస్తూ బాధితురాలు నలుగురిపై ఫిర్యాదు చేయగా.. వారంతా ఆమె తండ్రి చేసిన హత్య కేసులో సాక్షులుగా ఉన్నారు. బాధితురాల్ని వైద్యపరీక్షల నిమిత్తం పంపిన పోలీసులు, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment