
షాజహాన్‌పూర్(యూపీ): ఆంజనేయ ఆలయ నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి భూదానం చేసి మతసామరస్యాన్ని చాటాడు. ఢిల్లీ–లక్నో 24వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు కచియానా ఖేరి గ్రామంలో హనుమాన్ ఆలయం అడ్డంకిగా మారింది. విషయం తెలుసుకున్న స్థానికుడు బాబూ అలీ తన 0.65 హెక్టార్ల భూమిలో కొత్త ఆలయం నిర్మించుకోండంటూ భూమిని దానం చేశాడు. దీంతో రోడ్డపై ఆలయాన్ని పడగొట్టి అలీకి చెందిన స్థలంలో పునర్నిర్మించనున్నారని అదనపు జిల్లా మేజిస్ట్రేట్(పరిపాలన) రామ్‌సేవక్ ద్వివేది బుధవారం చెప్పారు. ఈ మేరకు భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిందని తిల్హార్ డెప్యూటీ జిల్లా మహిళా మేజిస్ట్రేట్ రాశీ కృష్ణ వెల్లడించారు. హిందూ – ముస్లిం ఐక్యతను అలీ మరోసారి చాటిచెప్పారని రాశీ పొగిడారు.
ఇదీ చదవండి: మా లక్ష్మణరేఖ తెలుసు
Comments
Please login to add a commentAdd a comment