Band Fee Payment Issue Groom Walks Off Marriage In Uttar Pradesh Shahjahanpur - Sakshi
Sakshi News home page

Uttar Pradesh: పెళ్లి బారాత్‌లో పైసల పరేషాన్‌! వధువు ఫ్యామిలీకి షాకిచ్చిన వరుడు

Jun 22 2022 7:02 PM | Updated on Jun 22 2022 8:16 PM

Band Fee Payment Issue Groom Walks Off Marriage Uttar Pradesh Shahjahanpur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కార్యక్రమంలో భాగంగా కంపిల్‌ నుంచి మీర్జాపూర్‌కు బ్యాండ్‌ మేళంతో బారాత్‌ చేరుకుంది. బ్యాండ్‌ బృందం వరుడి తరపువారిని సంభావన ఇవ్వాలని అడిగారు. అయితే, వధువు తరపువారే ఆ మొత్తం చెల్లించాలని.. అదే ఆనవాయితీ అని వరుడి తరపువారు స్పష్టం చేశారు. కానీ,

లక్నో: పెళ్లి బారాత్‌లో జాంజాం అని వెళ్లిన నూతన వరుడు అక్కడున్నవారందరికీ షాకిచ్చాడు. తన మాట కాదంటారా? అంటూ కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది. ఇంతకూ విషయం ఏంటంటే.. ధర్మేంద్ర అనే వ్యక్తి పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. 

కార్యక్రమంలో భాగంగా కంపిల్‌ నుంచి మీర్జాపూర్‌కు బ్యాండ్‌ మేళంతో బారాత్‌ చేరుకుంది. బ్యాండ్‌ బృందం వరుడి తరపువారిని సంభావన ఇవ్వాలని అడిగారు. అయితే, వధువు తరపువారే ఆ మొత్తం చెల్లించాలని.. అదే ఆనవాయితీ అని వరుడి తరపువారు స్పష్టం చేశారు. కానీ, ఇందుకు పెళ్లి కూతురు తరపువారు ససేమిరా అన్నారు. దీంతో పది మందిలో తన పరువుపోయిందని కొత్త పెళ్లికొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

మెడలో ఉన్న పూలదండను నేలకేసి కొట్టి.. ఎవరు చెప్పినా వినకుండా పెళ్లి పందిట్లోంచి వెళ్లిపోయాడు. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగి వివాదం మరింత ముదిరింది. పెళ్లి ఆగిపోవడంపై పరస్పరం తమకు ఫిర్యాదులు అందాయని మీర్జాపూర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ అరవింద్‌కుమార్‌ సింగ్‌ ఓ వార్త సంస్థకు తెలిపారు.
చదవండి👇
బెంగుళూరు ప్రధాని పర్యటన.. బీబీఎంపీ ఖర్చు రూ.23 కోట్లు
అమెరికాలో కాల్పులు.. నల్గొండ వాసి కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement