Band Baaja Baaraat
-
పెళ్లి బారాత్‌లో పైసల లొల్లి.. ఇజ్జత్ తీసిండ్రు.. ఇక నేనుండ!
లక్నో: పెళ్లి బారాత్‌లో జాంజాం అని వెళ్లిన నూతన వరుడు అక్కడున్నవారందరికీ షాకిచ్చాడు. తన మాట కాదంటారా? అంటూ కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో జరిగింది. ఇంతకూ విషయం ఏంటంటే.. ధర్మేంద్ర అనే వ్యక్తి పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. కార్యక్రమంలో భాగంగా కంపిల్ నుంచి మీర్జాపూర్‌కు బ్యాండ్ మేళంతో బారాత్ చేరుకుంది. బ్యాండ్ బృందం వరుడి తరపువారిని సంభావన ఇవ్వాలని అడిగారు. అయితే, వధువు తరపువారే ఆ మొత్తం చెల్లించాలని.. అదే ఆనవాయితీ అని వరుడి తరపువారు స్పష్టం చేశారు. కానీ, ఇందుకు పెళ్లి కూతురు తరపువారు ససేమిరా అన్నారు. దీంతో పది మందిలో తన పరువుపోయిందని కొత్త పెళ్లికొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మెడలో ఉన్న పూలదండను నేలకేసి కొట్టి.. ఎవరు చెప్పినా వినకుండా పెళ్లి పందిట్లోంచి వెళ్లిపోయాడు. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగి వివాదం మరింత ముదిరింది. పెళ్లి ఆగిపోవడంపై పరస్పరం తమకు ఫిర్యాదులు అందాయని మీర్జాపూర్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్‌కుమార్ సింగ్ ఓ వార్త సంస్థకు తెలిపారు. చదవండి👇 బెంగుళూరు ప్రధాని పర్యటన.. బీబీఎంపీ ఖర్చు రూ.23 కోట్లు అమెరికాలో కాల్పులు.. నల్గొండ వాసి కన్నుమూత -
సినిమా రివ్యూ: ఆహా కళ్యాణం
నటీనటులు: నాని, వాణి కపూర్, సిమ్రాన్ సంగీతం: ధరన్ కుమార్ కెమెరా: లోగనాధన్ శ్రీనివాసన్ నిర్మాత: ఆదిత్య చోప్రా దర్శకత్వం: గోకుల్ కృష్ణ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన బ్యాండ్ బాజా బారాత్ చిత్ర రీమేక్ గా నానీ, వాణీ కపూర్ (శుద్ద్ దేశి రొమాన్స్ ఫేం)ల కాంబినేషన్ లో 'ఆహా కళ్యాణం' రూపొందించారు. అయితే 'బ్యాండ్ బాజా బారాత్' చిత్రాన్ని తెలుగులో సమంత, సిద్ధార్థ్ లతో 'జబర్దస్త్' గా రూపొందించడం వివాదస్పదమైంది. ఆ కారణంగా ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందించి తెలుగులో 'ఆహా కళ్యాణం'గా ఫిబ్రవరి 21 తేది శుక్రవారం విడుదల చేశారు. 'పైసా' తర్వాత నానీ, తెలుగులో తొలిసారి నటించిన వాణి కపూర్ చిత్రం 'ఆహా కళ్యాణం' కథేంటో తెలుసుకుందాం! వెడ్డింగ్ ప్లానర్ గా స్థిరపడి.. ఆతర్వాత తల్లితండ్రులు కుదర్చిన పెళ్లితో జీవితంలో సెటిల్ అవుదామనే లక్ష్యంతో శృతి సుబ్రమణ్యం (వాణి కపూర్) ప్రయత్నిస్తుంటుంది. శృతికి అల్లరి చిల్లరిగా తిరిగే శక్తి(నాని) పరిచయమవుతాడు. ఫైనాన్స్, రొమాన్స్ ను మిక్స్ చేయకూడదనే రూల్ తో శృతి, శక్తి లిద్దరూ 'గట్టి మేళం' అనే కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మ్యారేజ్ ఈవెంట్లను నిర్వహించడంలో 'గట్టి మేళం'కు అనూహ్య పాపులారిటీ వస్తుంది. కాని గట్టి మేళాన్ని ఓ రేంజ్ తీసుకువెళ్లిన శృతి, శక్తిల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. శక్తి హ్యపీ వెడ్డింగ్ అనే పేరుతో మరో ఆఫీస్ ను తెరుస్తాడు. అయితే శృతి, శక్తిల మధ్య విభేదాలకు కారణమేంటి? హ్యాపీ వెడ్డింగ్ ను ప్రారంభించిన శక్తి పరిస్థితేంటి? తమ మధ్య తలెత్తిన విభేదాలను శృతి, శక్తి పరిష్కరించుకున్నారా? శృతి పెద్దలు కుదర్చిన వివాహమే చేసుకుందా? శక్తి, శృతిల విభేదాలకు దర్శకుడు ఎలాంటి పరిష్కారాన్ని చూపారనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. ఇటీవల కాలంలో యువతరం నటుల్లో నాని ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆహా కళ్యాణంలో తన పాత్ర పరిధిమేరకు నాని పూర్తి న్యాయం చేకూర్చాడు. ఈ చిత్రంలో కామెడిని కూడ కొంత తన భుజాన వేసుకుని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. నాని డైలాగ్స్, కామెడీ పంచ్ ల టైమింగ్ బాగుంది. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి' అనే పాటలో నాని జోష్ ఆకట్టుకునేలా ఉంది. వాణి కపూర్ తో నాని కెమిస్ట్రీ ఫర్ ఫెక్ట్ గా ఉంది. నటుడిగా ఆహా కళ్యాణంతో మరోసారి నాని ఆకట్టుకున్నాడు. ఆహా కళ్యాణం చిత్రాన్ని పరిగణనలోకి తీసుకుని శృతి పాత్రను పరిశీలిస్తే వాణి కపూర్ బ్రహ్మండమైన పెర్ఫార్మెన్స్ అందించింది. చాలా సన్నివేశాల్లో నానిని డామినేట్ చేసే విధంగా ఎమోషన్స్ ను పలికించింది. ఫెర్ఫార్మెన్స్ కాకుండా గ్లామర్ తో అదరగొట్టింది. కొన్ని సన్నివేశాల్లో కత్రినా కైఫ్ లా కనిపించింది. తన స్క్రీన్ ప్రజెన్స్ తో టాలీవుడ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, అభిమానులను సంపాదించుకోవడానికి 'ఆహా కళ్యాణం' వాణి కపూర్ కు చక్కటి అవకాశం. టాలీవుడ్ లో వాణి కపూర్ కు అవకాశాలు పెరగడానికి ఈ చిత్రం దోహదపడుతుందని చెప్పవచ్చు. సిమ్రాన్ అతిధి పాత్రలో కనిపించింది. అయితే పెద్గగా ప్రాముఖ్యత లేని పాత్రలో సిమ్రాన్ దర్శనమిచ్చింది. నానీ. సిమ్రాన్ లు తప్ప వాణి కపూర్ తో సహా అందరూ టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియని వారు ఆహా కళ్యాణంలో ఉండటం ప్రధాన లోపం. 'ఆహా కళ్యాణం' ఆకట్టుకోలేకపోతే అదే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. సాంకేతికంగా రీరికార్డింగ్ బాగుంది. పాటలు ఆకట్టుకునేలా లేకపోవడం మరో లోపం. ఈ చిత్రం రీమేక్ కావడం వలన దర్శకుడు గోకుల్ కృష్ణ ప్రతిభను అంచనా వేయడానికి పెద్దగా అవకాశమే లేకపోయింది. కెమెరా పనితనం పర్వాలేదనింపించింది. రీరికార్డింగ్ ఓకే అనిపించేలా ఉన్నా.. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలుగులో తొలి చిత్రాన్ని అందించిన యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒకవేళ జబర్ధస్త్, బ్యాండ్ బాజా బారాత్ చూసినా వాణి కపూర్ ను చూడాలనిపిస్తే ధైర్యం చేయవచ్చు. చివరగా 'జబర్దస్త్' మిస్ అయిన ప్రేక్షకులకు 'ఆహా కళ్యాణం' ద్వారా మరో అవకాశం చిక్కింది.తమిళ వాసనలతో ఉన్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుడ్ని ఆకట్టుకోవడమనేది కష్టమే. -రాజబాబు అనుముల -
చాలా గర్వపడుతున్నాను - నాని
‘‘దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్. చిన్నప్పట్నుంచీ వారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ సంస్థలో హీరోగా నటించినందుకు చాలా గర్వపడుతున్నాను’’ అని నాని అన్నారు. నాని, వాణీకపూర్ జంటగా గోకుల్‌కృష్ణ దర్శకత్వంలో యశ్‌రాజ్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం ‘ఆహా కళ్యాణం’. ఆదిత్య చోప్రా నిర్మాత. ధరన్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’రాజు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని సునీల్‌కి అందించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ -‘‘దర్శకుని సున్నితత్వం చూసి ‘ఏం తీస్తాడో...’ అనుకున్నాను. కానీ షూటింగ్ మొదలైన రెండో రోజే అతని ప్రతిభ ఏంటో తెలిసింది. అందరి అభిప్రాయాలూ తీసుకొని జనరంజకంగా సినిమా తీశారు. ‘బ్యాండ్‌బాజా బారాత్’ చిత్రానికి ఇది రీమేక్ అయినప్పటికీ... మన నేటివిటీ ఎక్కడా మిస్ కాదు. వాణీకపూర్కి తెలుగు రాకపోయినా... అర్థం చేసుకుని నటించింది. పేరుకు తగ్గట్టుగా సందడిగా సాగే సినిమా ఇది’’ అని చెప్పారు. 40 ఏళ్లుగా హిందీ చిత్రరంగంలో ఉన్న తాము తొలిసారిగా తెలుగు, తమిళ సినీ రంగాల్లో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని యశ్‌రాజ్ ఫిలింస్ ప్రతినిధి పదమ్‌కుమార్ అన్నారు. యశ్‌రాజ్ సంస్థలో పనిచేయడం గర్వంగా ఉందని, అందరికీ నచ్చే క్లీన్ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ‘‘ఈ సంస్థలో నాకిది రెండో సినిమా. నేను, నాని ఇందులో వెడ్డింగ్ ప్లానర్లుగా నటించాం. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’’ అని వాణీకపూర్ ఆకాంక్షించారు. రానా, కృష్ణచైతన్య, కరుణాకరన్ తదితరులు కూడా మాట్లాడారు. -
తెలుగులో యశ్‌రాజ్ వారి ఆహా! కల్యాణం
బాలీవుడ్లో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ తొలిసారిగా దక్షిణాదిలో అడుగుపెట్టబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో నాని హీరోగా ‘ఆహా! కల్యాణం’ నిర్మిస్తోంది. హిందీలో ఘనవిజయం సాధించిన ‘బ్యాండ్ బాజా బారాత్’కి ఇది రీమేక్. ఇందులో వాణీకపూర్ కథానాయిక. సిమ్రాన్ ముఖ్యపాత్ర పోషించారు. గోకుల్‌కృష్ణ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 23న పాటలను విడుదల చేయబోతున్నారు. ధరణ్‌కుమార్ స్వరాలందించారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడు దల చేస్తామని నిర్మాత ఆదిత్య చోప్రా వెల్లడించారు. ఈ చిత్రానికి కెమెరా: లోకనాథన్ శ్రీనివాసన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి. -
మత్తెక్కించేందుకు సిద్ధమంటున్న అనుష్క..
బాలీవుడ్ తెరపై తన అంద చందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అనుష్క శర్మ ప్రస్తుతం అభిమానులను మరోవిధంగా మత్తెక్కించేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో సరియైన అవకాశాలు లేక అల్లాడుతున్న అనుష్క శర్మ తాజాగా ఓ మద్యం ఉత్పత్తి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరించేందుకు అంగీకారం తెలిసింది. బ్యాండ్ బాజా బారాత్ చిత్రంతో అభిమానులకు చేరువైన అనుష్క శర్మ తమ కంపెనీ ఉత్తత్పికి బ్రాండ్ అంబాసిడర్ గా అంగీకరించడం శుభపరిణామమని సీగ్రామ్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ అన్నారు. ఆన్ స్క్రీన్ పైనే కాకుండా, ప్రచార రంగంలో గుర్తింపు ఉన్న అనుష్క ప్రచారం తమ కంపెనీకి కలిసివస్తుందని మార్కెటింగ్ గ్రూప్ తెలిపింది.