
తూర్పు గోదావరి: ఖండాలు దాటినా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను మరువలేదు ఆ కుటుంబం. ఫ్రెంచి జాతీయత కలిగిన వారిద్దరికీ తెలుగు సంప్రదాయ రీతిలో వివాహం ఘనంగా జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతం యానాం పట్టణానికి చెందిన చింతా వెంకట్ కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం ఫ్రాన్స్ దేశంలో స్థిరపడ్డారు.
చింతా వెంకట్, వేద దంపతుల కుమారుడు సుమంత్ ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే దేశానికి చెందిన యువతి క్లమెన్‌టైన్‌తో అతడికి వివాహం కుదిరింది. ఈ వివాహాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో స్వస్థలం యానాంలో చేయాలని నిర్ణయించారు.
దీంతో హిందూ సంప్రదాయ రీతిలో స్థానిక గాజుల గార్డెన్స్ కల్యాణ మండపంలో సుమంత్, క్లమెన్‌టైన్‌ల వివాహం ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. వధూవరులను యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు, బంధుమిత్రులు ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment