చేసిన అప్పు తీర్చడం కోసం భార్యాబిడ్డలను అమ్మకానికి పెట్టిన ఓ కసాయి ఉదంతం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా నంద్యాల అర్బన్ ఐసీడీఎస్ సీడీపీవో ఆగ్నేష్ ఏంజల్, బాధితురాలు వెంకటమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోవెలకుంట్ల పట్టణం బుడగజంగాల కాలనీకి చెందిన పసుపులేటి మద్దిలేటి (36)కి నంద్యాల పట్టణంలోని వైఎస్సార్‌నగర్‌కు చెందిన వెంకటమ్మ(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త మద్దిలేటి మద్యానికి బానిసై అప్పులు చేశాడు.