debts crisis
-
రైతు కుటుంబం బలవన్మరణం.. కూటమి సర్కార్ అవహేళన
వైఎస్సార్ జిల్లా: అప్పుల బాధ తాళలేక వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దెకుంటలో రైతు నాగేంద్ర కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ విషాదాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలపై రైతులు, రైతుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలుకు వేసిన పంటలు పండక రైతు నాగేంద్ర రూ. 15 లక్షల అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో ఇటీవలే లోన్ ద్వారా తీసుకున్న ట్రాక్టర్ జప్తుకు గురి కావడం, కౌలు యజమాని డబ్బు అడిగితే ఏం చెప్పాలోనని ఆవేదన, అప్పు ఇచ్చిన వాళ్ళ ఒత్తడితో నాగేంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య, కుమార్తె, కుమారుడికి ఉరి వేసి తానూ ఆత్మహత్య పాల్పడ్డారు.అయితే, ఇంతటి విషాదంలో రైతు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడారు. రైతు నాగేంద్ర మరణంపై పోలీసుల విచారణ పూర్తిగాక ముందే పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘రైతు నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ’ బుకాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు నాగేంద్ర, అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై డీఎస్పీ విచారణ చేపట్టారు. విచారణలో అప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ రైతు కుటుంబానికి డబ్బు సమస్య కాదంటూ అవహేళనగా కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. -
ఉచితాలు.. శాపాలు!
ఎన్నికలవేళ అధికార, ప్రతిపక్షనేతలు ‘ఉచితాలు’పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఓటర్లు కూడా దీర్ఘకాలికంగా ఆర్థిక వెసులుబాటు కోసం ఆలోచించకుండా ఈ ‘ఉచితాలు’వైపే మొగ్గుతున్నారు. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నేరవేర్చడానికి అప్పు చేయాల్సి వస్తోంది. పార్టీలకు అతీతంగా గతంలో కంటే మరింత మెరుగైన ‘ఉచిత’ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మ్యానిఫెస్టో తయారు చేయించుకుని ప్రచారాలకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటికోసం తిరిగి అప్పు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. విభిన్న పార్టీలకు చెంది వివిధ రాష్ట్రాల్లో పాగా వేసిన కొన్ని ప్రభుత్వాల ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.హిమాచల్ప్రదేశ్హిమాచల్ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా అప్పు కలిగిన రాష్ట్రంగా నిలిచింది. దీనికి రూ.95,000 కోట్ల అప్పు ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలలపాటు మంత్రులు తమ జీతాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. సరైన నిధులులేక ఎన్నికలవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం సవాలుగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మధ్యప్రదేశ్బీజేపీ గతేడాది రాష్ట్రంలో గెలుపొందడానికి ప్రధాన కారణం ‘లడ్లీ బెహనా’ పథకం అని ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఈ పథకం ప్రకారం వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉండి 21-65 ఏళ్లు ఉన్న రాష్ట్ర మహిళలకు నెలకు రూ.1,000 నేరుగా తమ బ్యాంకులో జమ చేస్తారు. దీని అమలుకు ఈ ఏడాది రూ.18,984 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు ఒక్కనెలలోనే ఈ రాష్ట్రం రూ.10,000 కోట్లు అప్పు చేసింది. గతేడాది మొత్తంగా రూ.76,230 కోట్లు అప్పు పోగైంది. గడిచిన బడ్జెట్ సెషన్లో తెలిపిన వివరాల ప్రకారం మొత్తం రాష్ట్ర అప్పులు రూ.4.18 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యకలాపాల కోసం అదనంగా రూ.94,431 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించుకుంది. వ్యవసాయ మోటార్ల కొనుగోలు కోసం రాయితీ రూపంలో రూ.4,775 కోట్లు చెల్లించాల్సి ఉంది. 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడితే రూ.100 చెల్లించి బిల్లు మాఫీ చేసుకునే పథకానికి రూ.3,500 కోట్లు వెచ్చించాలి. రైతులు వాడే కరెంటు కోసం రూ.6,290 కోట్లు అవసరం అవుతాయి. బాలికల కోసం చేపట్టిన ‘లడ్లీ లక్ష్మీ’ పథకం కోసం రూ.1,231 కోట్లు కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, లోన్ల వడ్డీ చెల్లింపు కోసం రూ.1,17,945 కోట్లు అవసరం. ఈ ఏడాది రాష్ట్ర ద్రవ్యలోటు 4.1 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.కర్ణాటకకర్ణాటకలో కాంగ్రెస్ గతేడాది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చిలో బోస్టన్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకుని అదనంగా రూ.55 వేలకోట్లు-రూ.60 వేలకోట్లు ఎలా సమకూర్చుకోవాలో సలహాలు ఇవ్వాలని కోరింది. ఎన్నికలవేళ ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీల అమలు ప్రస్తుతం ఆర్థికభారంగా మారుతుంది. గతేడాది ఐదు గ్యారంటీలకు రూ.36 వేలకోట్లు కేటాయించారు. ఈసారి దీన్ని రూ.53,674 కోట్లకు పెంచారు. కేవలం ‘గృహలక్ష్మీ’ పథకానికి అందులో సగం కంటే ఎక్కువ అంటే రూ.28,608 కోట్లు కేటాయించారు. పథకాల అమలు, ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ ఏడాది కర్ణాటక రూ.1,05,246 కోట్ల అప్పు చేయాల్సి ఉంటుంది.పంజాబ్ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్రంలోని రైతులు, గృహావసరాల కోసం రూ.17,110 కోట్లతో విద్యుత్‌ను అందిస్తోంది. మార్చి 2024 వరకు రాష్ట్ర అప్పులు మొత్తం రూ.3,51,130 కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ డేటా తెలిపింది. రాష్ట్ర ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంది.ఇదీ చదవండి: ఆన్లైన్లో క్లెయిమ్ స్టేటస్తెలంగాణకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే ఏటా అదనంగా రూ.20,378 కోట్లు అవసరం అవుతాయి. రైతు రుణమాఫీ కోసం రూ.15,470 కోట్లు కావాల్సి ఉంది. మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి రూ.3,083 కోట్లు అవసరం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం రూ.1,825 కోట్లు కావాలి. వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 హామీ ఇంకా అమల్లోకి రాలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల కోసం రూ.5 లక్షలు-రూ.6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. -
పైసల్లేవ్.. ఏం చేస్తారు? తిండి తగ్గించారు!
కరోనా వైరస్.. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెట్టింది.. ఇంకా చూపెడుతోంది కూడా. కానీ, ఆ దేశంలో పరిస్థితిని మాత్రం ఘోరంగా దిగజార్చింది. వ్యవసాయం, విద్య, ఉద్యోగ, వ్యాపారం.. ఇలా ఎందులోనూ పైకి రాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏకంగా దేశాన్నే దివాళా వైపు అడుగులు వేయిస్తోంది. హిందూ మహసముద్ర ద్వీప దేశం శ్రీలంక.. ఆర్థిక-మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కరోనా సమయంలో తీవ్ర స్థాయికి చేరిన పరిస్థితులు.. అక్కడి పౌరుల జీవన ప్రమాణాలపై పెను ప్రభావం చూపెడుతున్నాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరగడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడం, ప్రభుత్వ ఖజానా ఎండిపోవడంతో 2022 దివాళా సంవత్సరంగా మారబోతోందన్న భయాందోళనలు అక్కడ కొనసాగుతున్నాయి. పేదరికంలోకి.. శ్రీలంకలో ఈ కరోనా టైంలో ఐదు లక్షల మంది పావర్టీ లైన్ దిగువకు చేరుకున్నారని ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. ఈ పరిస్థితి ఆ దేశం ‘పేదరికంతో ఐదేళ్లపాటు పోరాడడంతో సమానమ’ని అభివర్ణించింది కూడా. ఇక కిందటి ఏడాది నవంబర్‌లో ద్రవ్యోల్బణం 11 శాతం దాటగా, డిసెంబర్లో 12 శాతం పైనే కొనసాగింది. ఈ దెబ్బకి నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే.. మిలిటరీని రంగంలోకి దించి ప్రభుత్వ ధరలకే నిత్యావసరాలు అమ్మేలా చర్యలు చేపట్టారు. అయినా కూడా ప్రజలకు ఊరట లభించింది కొంతవరకు మాత్రమే!. తిండి తగ్గించారు.. రాజధాని కొలంబో సహా చాలా చోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన జనాభానే కనిపిస్తోంది. ఉద్యోగాలు పొగొట్టుకుని, ఉపాధి దొరక్క తిరుగుతున్నారు. అవసరాల కోసం బాకీలు చేయక తప్పడం లేదు. బాకీలు తీర్చే క్రమంలో తిండి తినడం తగ్గించేస్తున్నాయి కొన్ని కుటుంబాలు. ఒక్కరోజుకి సరిపడే సరుకుల్ని వారానికి సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దుకాణాలు సైతం యాభై, వంద గ్రాముల స్థాయి ప్యాకింగ్‌లు సైతం సిద్ధమవుతున్నాయి. కూరగాయల రేట్లు 50 శాతం రేట్లకు చేరడాన్నే వాళ్లు ఊరటగా భావిస్తున్నారంటే.. అంతకు ముందు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బియ్యం, బ్రెడ్డు, పాల కోసం భారీ భారీ ‘క్యూ’లు కడుతున్నారు జనాలు. పాత తరం ప్రజలకు ఈ పరిస్థితులన్నీ 70వ దశకంలో ఎదురైన సంక్షోభాన్ని గుర్తు తెస్తున్నాయట. అప్పులంక రుణాలు తీర్చడం ఎలా?.. ఇప్పుడు లంక ముందు ఉన్న అతిపెద్ద సమస్య. స్వదేశీ, విదేశీ రుణాలన్నింటిని కలిపి సుమారు 7.37 బిలియన్ డాలర్ల అప్పును ఈ ఏడాదిలో చెల్లించాల్సి ఉంది. ఒక్క చైనాకే 5 బిలియన్ డాలర్ల రుణం బాకీ పడింది. అంతేకాదు కరోనా టైంలో అత్యవసరాల కోసం బీజింగ్ నుంచి మరో 1 బిలియన్ డాలర్ల రుణం తీసుకుని.. దశల వారీగా చెల్లిస్తూ వస్తోంది. అయితే ఆర్థిక వేత్త, ప్రతిపక్ష నేత హర్ష డి సిల్వా అంచనాల ప్రకారం.. విదేశీ నిధుల నిల్వ-అప్పుల్ని బేరీజు వేసి మరీ ఈ ఏడాది అక్టోబర్ లోపే దేశం దివాళా తీయడం ఖాయమని చెబుతున్నారు. ఒకవైపు బాకీలు తీర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే చెబుతూనే.. మరోవైపు ఆర్థిక విపత్తుకు అవకాశం లేకపోలేదన్న వాదనను ప్రభుత్వం సైతం తోసిపుచ్చకపోతుండడం విశేషం. ప్రస్తుతం లంక ఖజానాలో విదేశీ కరెన్సీ నిల్వలు కేవలం 1.6 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. టూరిజం వల్లే ఇదంతా! కరోనా వల్ల శ్రీలంకకు భారీ దెబ్బ పడింది పర్యాటక రంగం విషయంలోనే!. సుమారు 2 లక్షల మంది టూరిజం సెక్టార్, ట్రావెల్ రంగాల ద్వారా ఉపాధి కోల్పోయారని ప్రపంచం ప్రయాణ, పర్యాటక మండలి చెబుతోంది. ఈ పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందంటే.. చదువుకున్న యువత, విద్యావంతులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు పాస్‌పోర్ట్ ఆఫీసుల ముందు క్యూ కట్టేంతదాకా. బెడిసి కొట్టిన ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే నిర్ణయాలు తీసుకోకపోవడం ఒక ఎత్తయితే.. కరెన్సీ ముద్ర-ఎక్స్ఛేంజ్, ప్రభుత్వ పథకాల్లో ప్రయోగాలు ఇలా అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తీసుకున్న కొన్ని నిర్ణయాలు సైతం లంక పరిస్థితిని మరింత దిగజార్చాయి. మే నెలలో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మీద నిషేధం విధించిన ప్రభుత్వం.. బలవంతంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించింది. అయితే నష్టపోతామనే భయంతో చాలామంది వ్యవసాయం చేయలేదు. దీంతో ఆహార కొరత సమస్య తీవ్రంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యూటర్న్ తీసుకుని.. నిషేధం ఎత్తేయడం ఒక ఎత్తయితే, ఫర్టిలైజర్ల రేట్లు ఒక్కసారిగా పెంచడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు ఖజానాలు ఖాళీ అయిన పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక పొరుగు దేశాల నుంచి ఉత్పత్తులను, అప్పులను తీసుకుంది. అయితే అవి దీర్ఘకాలిక అప్పులు కాకపోవడంతో.. అధిక వడ్డీ రేట్లకు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పోషకాహార లోపం అక్కడ ప్రధాన సమస్యగా కొనసాగుతుండగా.. కరోనా విజృంభణ పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది. -
కుటుంబాలపై అప్పుల భారం
ముంబై: కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయని ఎస్బీఐ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు, 2017 జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు వంటి ఆర్థిక పరిణామాలు చోటుచేసుకున్న కాలం నుంచి జీడీపీలో కుటుంబాల రుణ భారాల నిష్పత్తి పెరుగుతూ వస్తోంది. రుణాల్లో ఏమున్నాయంటే... బ్యాంకులు, క్రెడిట్ సొసైటీలు, నాన్ బ్యాంకింగ్ ఫై నాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వం టి ఫైనాన్షియల్ సంస్థల నుంచి రిటైల్‌సహా వ్యవ సాయ, వ్యాపార రుణాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి. అగ్ర దేశాలకన్నా తక్కువే! జీడీపీలో కుటుంబ రుణ భారాల నిష్పత్తి ప్రస్తుత ఆర్థిక మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనావేస్తోంది. ఆరోగ్య భద్రతా వ్యయాలు కూడా గణనీయంగా పెరుగుతుండడం గమనించాల్సిన అంశమని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య క్రాంతి ఘోష్ పేర్కొన్నారు. అయితే జీడీపీలో కుటుంబాల రుణ నిష్పత్తి 37 శాతం అంటే మిగిలిన పలు దేశాలకన్నా ఇది తక్కువేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కొరియా (103.8 శాతం), బ్రిటన్ (90 శాతం), అమెరికా (79.5 శాతం), జపాన్ (65.3 శాతం), చైనా (61.7 శాతం)లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మెక్సికోలో ఇది కనిష్ట స్థాయిలో 17.4 శాతం. డిపాజిట్ల తీరు ఇలా... 2020–21లో బ్యాంక్ డిపాజిట్లు తగ్గడం ఇక్కడ ప్రస్తావనాశం. 2020 లాక్డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2020 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో కుటుంబాల పొదుపు రేటు (జీడీపీలో) 10.4 శాతంగా ఉంది. అయితే ఇది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 8.2 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో కుటుంబాల బ్యాంక్ డిపాజిట్ల రేషియో 7.7 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. ఇక కుటుంబాల రుణ భారం జీడీపీ విలువతో పోల్చితే 37.1 శాతం నుంచి 37.9 శాతానికి పెరిగింది. డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్స్, ప్రావిడెంట్ అండ్ పెన్షన్ ఫండ్స్, కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, ఈక్విటీలు, స్మాల్ సేవింగ్స్సహా ఫైనాన్షియల్ అసెట్స్ విలువ 7,46,821.4 కోట్ల నుంచి 6,93,001.8 కోట్లకు పడిపోయింది. ఇక మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇటీవల నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంది. ప్రైవేటు రంగం 80 శాతం ఆర్థిక నష్టం ఎదుర్కొంటే, ఇందులో కార్పొరేట్ రంగానికి కేవలం 12 నుంచి 16 శాతం. మిగిలినది కుటుంబాలు భరించాయి. -
బాబు దుబారా వల్లే రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది
-
కొత్త ప్రభుత్వానికి బాబు ఇచ్చే గిఫ్ట్ అదే
సాక్షి, గుంటూరు : రాబోయే నూతన ప్రభుత్వానికి చంద్రబాబు ఇచ్చే గిఫ్ట్ అప్పుల భారమే అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఏపీ చేసిందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రానికి అప్పు రూ. 90 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడది రూ.3.5 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. చేసిన అప్పులు తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. పుష్కరాల పేరుతో రూ. 3200 కోట్లు ఖర్చు చేస్తే.. అందులో కనీసం రూ. 300 కోట్ల పని కూడా జరగలేదన్నారు. పోలవరం ఎర్త్ డ్యాం ఒక్కశాతం కూడా పూర్తి కాలేదని లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. దుబారా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. అప్పు చేసి తెచ్చిన డబ్బులన్ని చంద్రబాబు దీక్షలకు, విదేశీ పర్యటనలకు, దుబారా ఖర్చులకే సరిపోయాయని విమర్శించారు. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఈనెల 21వ తేదీన గుంటూరులో మేధావులతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : బాబు దుబారా వల్లే రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది -
అప్పు తీర్చేందుకు భార్యాపిల్లలు అమ్మకానికి..
-
భార్యాపిల్లలు అమ్మకానికి..
సాక్షి, నంద్యాల : చేసిన అప్పు తీర్చడం కోసం భార్యాబిడ్డలను అమ్మకానికి పెట్టిన ఓ కసాయి ఉదంతం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా నంద్యాల అర్బన్ ఐసీడీఎస్ సీడీపీవో ఆగ్నేష్ ఏంజల్, బాధితురాలు వెంకటమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోవెలకుంట్ల పట్టణం బుడగజంగాల కాలనీకి చెందిన పసుపులేటి మద్దిలేటి (36)కి నంద్యాల పట్టణంలోని వైఎస్సార్‌నగర్‌కు చెందిన వెంకటమ్మ(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త మద్దిలేటి మద్యానికి బానిసై అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో.. రెండో కుమార్తె(13)ను రూ.1.50 లక్షలకు తన దూరపు బంధువుకు అమ్మేశాడు. అంతటితో ఆగకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని జులాయిగా తిరుగుతూ సుమారు రూ.15 లక్షలు అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి తన భార్యను సైతం రూ.5 లక్షలకు తన చిన్నన్నకు అమ్మకానికి పెట్టాడు. ‘నువ్వు సంతకం చేస్తే మా అన్న నాకు డబ్బులు ఇస్తాడు’ అంటూ భార్యను వే«ధించసాగాడు. దీంతో ఆమె కోవెలకుంట్ల నుంచి నంద్యాలలోని తన తల్లి వద్దకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చినా మద్దిలేటి పిల్లలను తన వెంట పంపించాలని వేధించసాగాడు. దీంతో బాధితురాలు వెంకటమ్మ, ఐసీడీఎస్ సీడీపీవో ఆగ్నేష్ ఏంజల్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శారదకు విషయం తెలిపింది. తన రెండో కుమార్తెను బంధువులకు అమ్మాడని, ఆ పత్రాలు బుజ్జి అనే వ్యక్తి వద్ద ఉన్నాయని, వాటిని ఇప్పించాలని బాధితురాలు కోరింది. ఈ మేరకు బాధితురాలితో రాత పూర్వకంగా రాయించుకున్న ఐసీడీఎస్ అధికారులు పిల్లలను ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రమేష్‌బాబు మాట్లాడుతూ పదిరోజుల క్రితం తన భర్త, బావ వేధిస్తున్నారని వెంకటమ్మ ఫిర్యాదు చేసిందని, ఈ విషయం ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో ఉందని చెప్పారు. బాధితురాలి భర్త, బావలను పిలిపించి విచారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
మల్లాపూర్(జగిత్యాల జిల్లా): మల్లాపూర్ మండలకేంద్రంలో రంగారెడ్డి(50) అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
ఆదిలాబాద్(భీమిని): భీమిని మండలం గజ్జరవెల్లిలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో కోట్రంగి దేవయ్య(35) అనే రైతుపురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. దేవయ్య చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. సహకార బ్యాంకులో రూ.40వేలు, ప్రైవేటుగా రూ. 2లక్షలు అప్పు ఉన్నట్లు, అదీ గాక వేసిన పంట సరిగా పండకపోవడంతో మనస్తాపం చెంది దేవయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.