ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' మానియానే కనిపిస్తుంది. ప్రభాస్-కృతిసనన్ నటించిన ఈ సినిమా (జూన్ 16) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మూడురోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పూర్తి అయ్యాయి. ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్ వేదికగా సినీ ప్రియులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కానీ అమెరికాలో 'ఆదిపురుష్' తమిళ వెర్షన్ కోసం కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడు పోయాయని సమాచారం. యూఎస్‌లో 255 థియేటర్లలో మొత్తం 1009 షోలు మొదటిరోజు ప్రదర్శించబడుతున్నట్లు మేకర్స్ తెలిపారు.
(ఇదీ చదవండి: నన్ను, నా బిడ్డను చంపేస్తాడు.. కాపాడండి సీఎం గారు: నటి)
ఇందులో తెలుగు 552షోలు, హిందీ 436 షోలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మొదటిరోజు టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. కానీ తమిళ్ వర్షన్‌కు 21 షోలకు గాను కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట. ఈ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులో కూడా 'ఆదిపురుష్'కు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోలకు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. అక్కడ హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్‌లే కనిపిస్తుంటే.. తమిళ వెర్షన్ 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి. దీనిని బట్టి వారు సినిమాను వ్యతిరేకిస్తున్నారా? అన్నట్లు ఉంది.
ఢిల్లీలో 'ఆదిపురుష్' రేంజ్ మామూలగా లేదు
ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ యాంబియెన్స్ మాల్‌లో 'ఆదిపురుష్' టికెట్ ధర చూసి అక్కడి వారందరూ అవాక్కవుతున్నారు. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2200. అక్కడి థియేటర్‌లో 9.15pm షోకి 'ఆదిపురుష్' (హిందీ) 2D వెర్షన్ చూడాలంటే రూ.2000, చెల్లించాల్సి ఉంది. ఇదే థియేటర్‌లో 7pm షోకి 3D వెర్షన్ టికెట్ ధర రూ.2250 ఉంది. అంతే కాకుండా బాలీవుడ్‌లో మొదటిరోజు టిక్కెట్లన్ని సోల్డ్ ఔట్ అయ్యాయి. దీంతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో దీనినిబట్టే తెలుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.
(ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?)
Comments
Please login to add a commentAdd a comment